అక్రమంగా రవాణా చేస్తున్న కలప పట్టివేత
కొమురంభీం ఆసిఫాబాద్ (వూదయం ప్రతినిధి) అక్టోబర్ 23 : అక్రమంగా రవాణా చేస్తున్న కలపను ఆదివారం రాత్రి వెంకటాపూర్ వైపు ఆటోలో కలపను తరలిస్తుండగా పట్టుకున్నట్లు ఎఫ్ ఆర్ ఓ చంద్రకుమార్ తెలిపారు. ఆటోలో పదిహేడు టేకు దుంగలు ఉన్నట్లు వాటి విలువ సుమారు 46,799 రూపాయలు ఉంటుందని పేర్కొన్నారు. ఆటో డ్రైవర్ తప్పించుకొని పత్తిచేలలోకి పారిపోయినట్లు తెలిపారు. ఆటో యజమాని షైక్ అన్వారోద్దిన్, ఆటో డ్రైవర్ దేవదాస్ లపై కేసు నమోదు చేసి విచారణ జరిపిస్తున్నామని తెలిపారు. ఈ దాడిలో సిబంది సాయిచరణ్ , మహేందర్, శ్రీను పాల్గొన్నారు.
No comments:
Post a Comment