జిల్లా కలెక్టరేట్ నూతన భవనానికి శంకుస్థాపన ; ఘనంగా కొమురంభీం జిల్లా ఆవిర్భావ దినోత్సవ వేడుకలు
కొమురంభీం ఆసిఫాబాద్ (వూదయం ప్రతినిధి) అక్టోబర్ 11 : కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా ఏర్పాటై సంవత్సరం ఐన సందర్బంగా జిల్లా ఆవిర్భావ వేడుకలు జిల్లా కేంద్రంలోని ప్రమీల గార్డెన్స్లో ఘనంగా నిర్వహించారు. ముఖ్య అతిధులుగా అలోల్ల ఇంద్రకరణ్ రెడ్డి, జోగు రామన్న, ఎం పి నగేష్, ఆదిలాబాద్ ఎం ఎల్ సీ పురాణం సతీష్ కుమార్, ఆసిఫాబాద్ ఎం ఎల్ ఏ కోవా లక్ష్మి లు హాజరయ్యారు.ఈ సందర్బంగా మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు కావడానికి దారితీసిన పరిస్తుతులను వివరిస్తూ, రాష్ట్రం ఏర్పడిన తరువాత జరిగిన జరుగుతున్నా అభివృద్ధి పనులైనా మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ పనులను ఉటంకించారు. సంక్షేమ పథకాలైన షాదీ ముబారక్, కల్యాణ లక్ష్మి, ఆసరా, డబల్ రూమ్ పథకాలనువివరించారు. తెలంగాణ ప్రజల ముఖ్యమైన కోరిక మన భూమి, మన నీరు, మన ఉద్యోగాల సాధనకై నిరంతరం పటు పడుతున్న ముఖ్య మంత్రి కే సీ ఆర్ నాయకత్వాన్ని రాబోయే కాలంలో కూడా కొనసాగించవలసి అవసరాన్ని వివరించారు. మరెన్నో ఐ టి ఉద్యోగాల కల్పనకై కృషి చేస్తామని, మన రాబోయే కాలంలో బంగారు తెలంగాణ కల్పనలో మన జిల్లా ప్రధమ స్థానంలో ఉండాలని ఆకాంక్షించారు. కొత్తగా ఏర్పడిన జిల్లాలో ప్రజా పాలన,ప్రజల రక్షణ చాల బాగుందని కితాబిచ్చారు. జిల్లాలోని ఉద్యోగులందరూ అంకితభావంతో పనిచేసి జిల్లాకు మంచిపేరు తేవాలని అన్నారు.సాంస్కృతిక కళాబృందాలు సభికులను తమ డైన శైలిలో అలరించారు. అనంతరం ఆహూతులకు భోజన ఏర్పాట్లు చేసారు. అంతకు ముందు జిల్లా కలెక్టరేట్ నూతన భవనానికి శంకుస్థాపన కార్యక్రమం జరిగింది. ఆ కార్యక్రమంలో మంత్రులు,ఎం ఎల్ సీ ,ఎం ఎల్ ఏ ఎం పి లు పాల్గొన్నారు.
No comments:
Post a Comment