Tuesday, 24 October 2017

బెల్లంపల్లి ఏరియాలో డ్రైవింగ్ శిక్షణ కేంద్రాలు

బెల్లంపల్లి ఏరియాలో డ్రైవింగ్ శిక్షణ కేంద్రాలు 


కొమురంభీం ఆసిఫాబాద్ (వూదయం ప్రతినిధి) అక్టోబర్ 24 ; బెల్లంపల్లి ఏరియాలో పనిచేస్తున్న సింగరేణి ఉద్యోగులు మాజీ ఉద్యోగులకు పిల్లలకు పరిసర ప్రభావిత నిరుద్యోగులకు యువకులకు ట్రాక్ డ్రైవింగ్లో శిక్షణ పొందేందుకు సింగరేణి సేవా సమితి ద్వారా దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు డిజిఎం పర్సనల్ జి కిరణ్ తెలిపారు. శిక్షణ పొందేవారు వారి యొక్క హెవీ డ్రైవింగ్ లైసెన్స్ కలిగి ఉండి మూడు సంవత్సరాలు నుంచి ఐదు సంవత్సరాలు అనుభవం కలిగి, మానసికంగా మరియు శారీరకంగా ఆరోగ్యంగా ఉండి ఇంగ్లీషు హిందీ తెలుగులో రాయడం మరియు చదవడం వచ్చిన వారు మొదటి బ్యాచ్లో పది మందిని ఎంపిక చేయడం జరుగుతుంది అని తెలిపారు. మిగతా వారిని తర్వాత బ్యాచ్లో శిక్షణ ఇవ్వడం జరుగుతుంది. ఆసక్తి గల అభ్యర్థులు తమ దరఖాస్తులతో ఈ నేల 27న జీఎం కార్యాలయంలోని పర్సనల్ డిపార్టు మెంట్ నందు ఇంటర్వ్యూకి హాజరు కాగలరు ఉదయం పది గంటల ముప్పై నిమిషాలకు అభ్యర్థులు తమ తన డ్రైవింగ్ లైసెన్సు మరియు సంబంధిత పత్రాలతో పర్సనల్ డిపార్టుమెంట్ నందు సంప్రదించగలరు ఎంపిక అయిన డ్రైవర్కు మొదటి బ్యాచ్ బెంగుళూరులో నెంబర్ పదమూడు నుండి పదిహేడు వరకు శిక్షణ ఉంటుందని తెలిపారు. 

No comments:

Post a Comment