టి ఎస్ యూ టి ఎఫ్ ఆధ్వర్యంలో జిల్లా పాలనాధికారికి వినతి పత్రం
కొమురంభీం ఆసిఫాబాద్ (వూదయం ప్రతినిధి) అక్టోబర్ 04 : రాబోయే డి ఎస్ సీ ని నూతనజిల్లాల ప్రకారం నిర్వహించాలని తెలంగాణ రాష్ట్ర యునైటెడ్ టీచర్స్ ఫెడరేషన్ జిల్లాశాఖ ఆధ్వర్యంలో బుధవారం జిల్లా పాలనాధికారి కి వినతి పత్రం సమర్పించారు. అనంతరం టి ఎస్ యూ టి ఎఫ్ జిల్లా ఉపధ్యక్షలు హేమంత్ షిండే మాట్లాడుతూ జిల్లా లోని చాల పాఠశాలలో ఉపాయాయుల పోస్టులు ఖాళీగా ఉన్నాయని ,పాఠశాలలో విద్యావాలంటరీలతో బోధనా జరిపిస్తున్నారని, విద్యావ్యవస్థ కుంటూ పడుతుందని వివరించారు. వినతి పత్రంలో డి ఎడ్ ,బి ఎడ్ చేసిన నిరుద్యోగులు జిల్లాలో చాలామంది డి ఎస్ సీ కోసం నిరీక్షిస్తున్నారని, త్వరగా దీనిని నిర్వహించి నియామక ఉత్తర్వులు ఇవ్వాలని కోరారు. ఈ కార్య క్రమంలో ట్రెజరార్ టి రమేష్, కార్య వర్గ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.
No comments:
Post a Comment