నేరాలు పునరావృతం చేయకండి ; రెబ్బెన ఎస్ఐ నరేష్
కొమురంభీం ఆసిఫాబాద్ (వూదయం ప్రతినిధి) అక్టోబర్ 13 : రెబ్బెన పోలీస్ స్టేషన్ లో శుక్రవారం పెండింగ్ లో ఉన్న కేసులను సబ్ ఇన్స్పెక్టర్ కే.నరేష్ కుమార్ పరిశీలించారు. పాత కేసులను విచారించే క్రమంలో నేరస్థులు హాజరు అయ్యారు. ఈ సందర్భంగా ఎస్ఐ నేరస్థులను ఉధ్యేశించి మాట్లాడుతూ నేరాలను వదిలిపెట్టి సమాజంలో మంచి పేరుతో మెలగాలని, సత్ప్రవర్తన తో నడుచుకోవలని అన్నారు. శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే ఎంతటి వారినైనా ఉపేక్షించేది లేదని స్పష్టం చేసారు.ఎంతటి సమస్యనైన సామరస్యంతో పరిష్కరించుకోవాలని సూచించారు. అదే విధంగా 56 కేసులలో పాలుపడిన వారిని, 15 మంది సానుభూతి పరులకు కౌన్సిలింగ్ నిర్వహించారు. దొంగతనాలు, ఇతర సంఘ విద్రోహ పనులకు పాల్పడవద్దని, ఇప్పుడు వారు ఏ యే వృత్తులలో వున్నారు అని ఎస్ఐ అడిగి తెలుసుకున్నారు. విచారణకు హజరు అయ్యిన నెరస్థులన సంతకాలు సేకరించారు.
No comments:
Post a Comment