Saturday, 28 October 2017

సింగరేణిలో విజిలెన్సు వారోత్సవాలు బెల్లంపల్లి ఏరియా డీజీఎం

సింగరేణిలో విజిలెన్సు వారోత్సవాలు  బెల్లంపల్లి ఏరియా  డీజీఎం  

  కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా (వూదయం ప్రతినిధి) అక్టోబర్ 28 :  బెల్లంపల్లి ఏరియా లో ఈ నెల 30వ తేదీనుంచి నవంబర్ 4 వరకు విజిలెన్సు వారోత్సవాలు నిర్వహించనున్నట్లు గోలేటి డిజైన్ బి సుదర్శనం  శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. సింగరేణివ్యాప్తంగా యాజమాన్యం విజిలెన్సు వారోత్సవాలు  నిర్వహిస్తున్నది ఇందులో భాగంగా గనులపై కార్మికులకు వ్యాసరచన పోటీలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. సింగరేణి పాఠశాల విద్యార్థిని విద్యార్థులకు వకృత్వ పోటీలు నిర్వహిస్తారని, 30న అన్నిగనులు,డిపార్టుమెంటలా నందు సమగ్రత ప్రతిజ్ఞ చేయడం జరుగుతుందనితెలిపారు. కావున ఉద్యోగులందరూ విజిలెన్సు అవగాహనా వారోత్సవాలలో ఉత్సాహంగా పాల్గొని అవినీతి రహిత భారతదేశాన్ని నిర్మించాలని కోరారు. 

No comments:

Post a Comment