Saturday, 21 October 2017

విద్యారంగ సమస్యలతో విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ; ఎఐఎస్ఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి దుర్గం రవీందర్

 విద్యారంగ సమస్యలతో విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ; ఎఐఎస్ఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి దుర్గం రవీందర్

కొమురంభీం ఆసిఫాబాద్ (వూదయం ప్రతినిధి) అక్టోబర్ 21 :రాష్ట్రంలో నెలకొని ఉన్న విద్యారంగ సమస్యలు పరిష్కరించాలని ఏఐఎస్ఎఫ్ ప్రధాన కార్యదర్శి దుర్గం రవీందర్ డిమాండ్ చేశారు శనివారం రోజున విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ రాష్ట్రంలోని విద్యారంగ సమస్యలతో విద్యార్థులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని అన్నారు.  వసతి గృహాలలో  వాచ్ మన్  కామాటి   పోస్టులను భర్తీ చేయకుండా  ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తుందని  అన్నారు నూతనంగా ప్రారంభించిన గురుకుల పాఠశాలల కు స్వంత భవనాలు వెంటనే నిర్మించాలని అద్దె భవనాల్లో అరకొర వసతులతో  వసతుల్లో విద్యార్థులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని అన్నారు డీఎస్సీ నిర్వహించడంలో ప్రభుత్వం అలక్ష్యం  వహిస్తుందని ఉపాధ్యాయుల కొరతలో పాఠశాలలు మూసి వేసే పరిస్థితి వచ్చిందని  అన్నారు  విద్యారంగంపై ప్రభుత్వానికి  చిత్తశుద్ధి ఉంటే వెంటనే డీఎస్సీ వేయాలని డిమాండ్ చేశారు రాష్ట్రంలోని కార్పొరేట్ కళాశాలలకు మృత్యు గ్రహాలుగా మారాయని విద్యార్థులను విద్యా పేరిట మానసికంగా వేధిస్తున్నాయని అన్నారు రాష్ట్రంలో కార్పొరేట్ కళాశాలల ఆగడాలు మితిమీరిపోతున్నాయని రాష్ట్ర ప్రభుత్వం స్పందించకపోవడం  సిగ్గుచేటు అన్నారు నూతనంగా ఏర్పాటు చేసిన జిల్లాల్లో విద్యా అభివృద్ధికి కృషి చేయడానికి డిమాండ్ చేస్తామని ప్రతి జిల్లాలో డిగ్రీ పాలిటెక్నిక్ ఐటీఐ జూనియర్ కళాశాలను ఏర్పాటు చేయాలని కేజీ టూ పీజీ ఉచిత విద్యను వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు దేశంలో రాష్ట్రంలో పాలననుబాగుందని  భావిస్తున్నాయని విద్యా వ్యతిరేక విధానంపై  పోరాడుతామని ఎన్నికల్లో విద్యార్థులకు   ఇచ్చిన  హామీలను వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో ఏఐటియుసి మండల కార్యదర్శి రాయిల్ల నర్సయ్య ఎఐఎస్ఎఫ్ మండల కార్యదర్శి పార్వతి సాయికుమార్ ఏఐఎ్సఎఫ్ మండల అధ్యక్షుడు మలిశెట్టి మహిపాలఅనుదీప్ తదితరులు పాల్గొన్నారు

No comments:

Post a Comment