Thursday, 31 December 2015

పాటశాలలో ముగ్గుల పోటీలు

పాటశాలలో ముగ్గుల పోటీలు


రెబ్బెన: (వుదయం ప్రతినిధి);; రెబ్బెన మండల కేంద్రంలోని సాయి విద్యాలయంలో కొత్త సంవత్సరం సందర్భంగా విద్యార్థులకు ముగ్గుల పోటీలు నిర్వహించారు. ముఖ్య న్యాయనిర్ణేతలుగా జిల్లా మహిళా ప్రధాన కార్యదర్శి కుందారపు శంకరమ్మ, దీకొండ్స్ విజయ, వై, సుజాత, యాస్మిన్  హాజరయ్యారు. ఈ పోటిలలో గెలుపొందిన సుప్రియ, గాయత్రి, కనకలక్ష్మి, శిరీష, మంగళ,  విద్యార్థులకు పాటశాల కరస్పాండెంట్ దీకొండ సంజీవ్ కుమార్ బహుమతులను అందజేశారు.

కార్మికులకు ఘన సన్మానం

కార్మికులకు ఘన సన్మానం



రెబ్బెన: (వుదయం ప్రతినిధి);; రెబ్బెన మండలంలోని గోలేటి టౌన్ షిప్ 1ఏ బెల్లంపల్లి ఏరియాలో విధులు నిర్వహించి పదవి విరమణ పొందిన ఆరుగురు కార్మికులను ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో ఎం, శ్రీనివాసరావు, ఎస్, తిరుపతి, బయ్య మొగిలి, రామారావు తదితరులు పాల్గొన్నారు.

గిరిజన మహా సభలను విజయవంతం చేయం

గిరిజన మహా సభలను విజయవంతం చేయండి 


రెబ్బెన: (వుదయం ప్రతినిధి) ;; జనవరి 3 న జరిగే చలో ఉట్నూరు గోడ ప్రతులను బుధవారం నాడు రెబ్బెన ఆర్ ఎండ్ బి అతిధి గృహం వద్ద ఆదివాసి నాయకులు విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆదివాసి నాయకులు మాట్లాడుతూ ఆదివాసి గిరిజన హక్కుల కోసం జరిగే ఈ మహాసభకు అధిక సంఖ్యలో పాల్గొని సభను విజయవంతం చేయాలని అన్నారు. ఈ కార్యాక్రమంలో కోడిపె వెంకటేష్, మదె గణపతి, ఎరగటి భీమయ్య, దినకర్, లోకేష్ తదితర నాయకులు పాల్గొన్నారు.

ఎక్కడి చెత్త అక్కడే-బోగే ఉపేందర్

ఎక్కడి చెత్త అక్కడే-బోగే ఉపేందర్


రెబ్బెన: (వుదయం ప్రతినిధి) ;; కేంద్రం స్వచ్ భారత్ పేరుతో చెత్త చెదారాన్ని శుభ్రం చేసి ఊరుకి దూరంగా పడేస్తుంటే గోలేటిలో మాత్రం దీనికి విరుద్ధంగా ఉందని అఖిల భారత యువజన సమాఖ్య జిల్లా ఉపాధ్యక్షుడు బోగే ఉపేందర్ అన్నారు. రెబ్బెన మండలంలోని గోలేటి భగత్ సింగ్ నగర్ లో ఆయన మాట్లాడుతూ గ్రామ పంచాయుతి సిబ్బంది 6 నెలల క్రితం మురికి కాలువల నుండి తీసిన చెత్తను అక్కడే ఇండ్ల ముందు రోడ్డు మిధ వేయడంతో కాలని వాసులు తీవ్ర ఇబ్బంది కి గురవుతున్నారని అన్నారు. దాని ద్వారా వచ్చే దుర్వాసనకు చిన్న పిప్రజలు అనారోగ్య పాలవుతున్నా రని ఈ విషయం గురించి సర్పంచ్, అలాగే గ్రామ పంచాయితి సిబ్బందికి ఎన్ని సార్లు చెప్పిన పట్టించు కోవడం లేదని అన్నారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి సమస్యను పరిష్కరించాలని కోరారు. ఈ సమావేశంలో  ఏ,అయ్,వై,ఎఫ్ మండల కార్యదర్శి ఎస్, సంతోష్, టౌన్ కార్యదర్శి దుర్గం తిరుపతి, టౌన్ అధ్యక్షులు మిడిగొండ లింగమూర్తి, సంతోష్, ఏ,అయ్,ఎస్,ఎఫ్ జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ దుర్గం రవీందర్ పాల్గొన్నారు. 

Tuesday, 29 December 2015

ఎమ్మెల్యేకు వినతి పత్రం

ఎమ్మెల్యేకు వినతి పత్రం


 (రెబ్బెన వుదయం  ప్రతినిధి) వట్టివాగు ప్రాజెక్టు కింద ఆయకట్టు కింద సాగు చేసుకుంటున్న రైతులకు సాగునీరు అందేలా చూడాలని రైతులు మరియు అధ్యక్షుడు కార్నాధం పెంటయ్య  మంగళవారం నాడు ఎమ్మెల్యే కోవ లక్ష్మికి వినతి పత్రం అందజేశారు. మాట్లాడుతూ వట్టివాగు ప్రాజెక్టు కింద 2300ల ఎకరాలు సాగుభూమి ఉందని, నీరు అందకపోవడంతో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని పేర్కొన్నారు. నీరందకపోవడంతో వేసిన వరినాట్లు ఎండిపోయాయని దీంతో రైతులు బాదపడుతున్నారని పేర్కొన్నారు. వట్టివాగు కాలువకు శటర్లు దొంగాలేత్తుకు పోవడంతో రైతులకు నీటిని చివరి ఆయకట్టు వరకు నీరుసరిగా అందకపోవడంతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నామన్నారు. ఇప్పటికైన పర్యవేక్షించి వెంటనే నీరందేలా చూడాలని అన్నారు. ఈకార్యక్రమంలో రైతులు వనమాల మురళి, శ్రీను, సాంబయ్య, తిరుపతి, వెంకన్న, పాపయ్య, నారయణ, నాగయ్య తదితరులు పాల్గొన్నారు.

లాన్ టెన్నిస్ ను ప్రారంభించిన జీ,ఎం

లాన్ టెన్నిస్ ను ప్రారంభించిన జీ,ఎం

  (రెబ్బెన వుదయం  ప్రతినిధి) రెబ్బన మండలంలోని బెల్లంపల్లి ఏరియా గోలేటిలో లాన్ టెన్నిస్ క్రీడలను జీ,ఎం రవి శంకర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ క్రీడాకారులు మరింతగా రాణించి ప్రతిభను కనబర్చాలని అన్నారు. ఈ కార్యక్రమములో  అస్.ఓ.టూ జీ.మ్ కొండయ్య,  పర్సనల్ మేనజేర్ సీతారం, డి వై. పి.ఎం.రాజేశ్వర్,  .ఐ.టి.యు.ఎస్.సి. నాయకులు తిరుపతి జి.ఎం.  కార్యాలయ సిబ్భంది తదితరులు పాల్గొన్నారు.

న్యాయ విజ్ఞాన సదస్సు

న్యాయ విజ్ఞాన సదస్సు 



  (రెబ్బెన వుదయం  ప్రతినిధి) రెబ్బన కళాశాలలో మంగళవారం నాడు మండల న్యాయా సేవ సంస్థ ఆసిఫాబాద్ వారి ఆధ్వర్యంలో న్యాయ  విజ్ఞాన సదస్సును నిర్వహించారు. ఈ సందర్భంగా జూనియర్ న్యాయమూర్తి ఎన్, హేమలత మరియు సీనియర్ న్యాయమూర్తి సురేష్  మాట్లాడుతూ విద్యార్థులు చట్టాలపై అవగాహన కోసమే న్యాయ విజ్ఞాన సదస్సు ఏర్పాటు చేసినట్లు  సమాజంలో ప్రతి శాంతియుత వాతావరణంలో జీవించాలని, బాల కార్మికుల చట్టం గురించి, బాల్య వివాహాలు నేరమని, వాటిని చేసినా. సహకరించిన వారికి రూ.లక్ష జరిమానాతో పాటు రెండేళ్ల జైలుశిక్ష పడుతుందని న్యాయమూర్తి చెప్పారు. అలాగే ప్రామిసరీ నోటుపై తెలియకుండా సంతకం చేయరాదన్నారు. డబ్బు చెల్లించిన వెంటనే ప్రామిసనరీ నోటును కూడా తీకుకోవాల న్నారు. ముఖ్యంగా మహిళలు చదువులో బాగా రాణించాలన్నారు. చట్టంపై ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉన్నప్పుడే సమాజం కూడా అభివృద్ది చెందుతున్నారు.మద్యపానం నేరాలకు ప్రథమ కారణమని, ఈ వ్యసనాన్ని వీడాలని సూచించారు. అన్యాయం జరిగితే పోలీసులను ఆశ్రయించాలని అన్నారు. ఈ సదస్సులో జిల్లా మహిళా ప్రధాన కార్యదర్శి కుందారపు శంకరమ్మ ప్రిన్సిపాల్ వెంకటేశ్వర్లు, బి, సతీష్ బాబు, రవీందర్, శ్యాం రావు, కళాశాల లెక్చరర్లు, విద్యార్థులు పాల్గొన్నారు.

Monday, 28 December 2015

గ్రంధాలయం భూమికి పట్టపాసుపుస్తాకలు కావలి

గ్రంధాలయం భూమికి పట్టపాసుపుస్తాకలు కావలి 

రెబ్బెన గ్రంధాలయానికి పట్టపాస్ పుస్తకాలు కావాలని రెబ్బెన తహసిల్దార్ కి సోమవారం నాడు  వినతిపత్రమ అందజేశారు అనతరం వారు మాట్లాడుతూ 1998 లో ఊమెశ్ కుమార్ రాథోడ్ తన సొంత భూమి అయిన 205 సర్వే నంబర్ ఒక గుంట భూమి విరాళం ఇచ్చారు దాని తళుకు పట్టపాసు పుస్తకాలూ మంజూరు చేస్తే జిల్లా గ్రంధాలయ నిదులతో నూతన భవనం నిర్మిచాడనికి పాసుపుస్తాకలు మంజూరు చేయాలనీ అన్నరు ఈ  కార్యక్రమంలో గ్రంధాలయం అధికారి స్వర్ణలత  సదనందం టిడిపి మండల యుత్  అధ్యక్షులు మోడెమ్ సుదర్శన్ గౌడ్, రాజ గౌడ్, ఉపసర్పంచ్ శ్రీధర్ తదితరులు పలుగోన్నారు.

గిరిజన యునివర్సిటిని తరలిస్తే ఊరుకోం

గిరిజన యునివర్సిటిని తరలిస్తే ఊరుకోం 


ఆదివాసుల జిల్లా ఆదిలాబాద్ జిల్లాలో గిరిజన విద్యార్ధులు అధికంగా ఉన్నారని అలాంటి జిల్లాకు అన్యాయం చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం కుత్రపన్ను తుందని రాష్ట్ర ప్రభుత్వ యొక్క కుట్రలను తిప్పికొట్టుటకు విద్యార్ధులు సిద్ధంగా ఉన్నారని ఎ ఐ ఎస్ ఫ్ జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ దుర్గం రవీందర్ అన్నారు ఈ సందర్బంగా రెబ్బెన లో ని అర్ అండ్ బి గెస్ట్ హౌజ్ వద్ద మోకాళ్ళపై నిల్చొని కళ్ళకు గంటలు కట్టుకొన్ నిరసన వ్యక్తం చేశారు, అనంతరం మాట్లాడుతూ కొమురంబిం వర్ధంటిలో ప్రస్తుత ముఖ్యమంత్రి కేసియర్ గారు ఆదిలాబాద్ జిల్లా ఉట్నూరు లోనె గిర్జన యునివరిసిటి ఏర్పాటు సెస్స్తామని హమీచ్చారని అన్నారు కానీ ఇప్పుడు గిరిజన యునివరిసిటి వరంగల్ జిల్లాకు తరలించేందుకు  అన్నారని ఆదిలాబాద్ జిల్లలో 18 జిరిజనులే ఉన్నారని వారిలో సుమారు 2 లక్షాల పైగా గిరిజన విద్యార్ధులు ఉన్నారని అన్నారు గతంలోనే ఉట్నూర్ లో 400 ఎకారాల ప్రభుత్వ భూమిని గుర్తించారని అన్నారు ఆదిలాబాద్ జిల్లా నుండి గిరిజన యునివర్సిటి ని వరంగల్ జిల్లాకు తరలించి ఆదిలాబాద్ జిల్లాకు అన్యాయం చేయాలనీ చుస్తే ఎ ఐ ఎస్ ఫ్ గా ఉద్యమాల నిర్వహిస్తామని అన్నారు జిల్లలో ఉన్న మంత్రులు యునివర్స్ టి పై ఆదిలాబాద్ జిల్లా విద్యార్ధుల కు స్పష్టమైన హామీ ఇవ్వాలని డిమాండ్ చెశరు. ఈ కార్యక్రమంలో ఎ ఐ ఎస్ ఫ్ మండల  కార్యదర్శి పూదారి సాయి, ఉపాద్యాక్షులు మహిపాల్, ప్రదీప్, నాయకులు రాజు, మహేందర్, కార్తిక్, సాయి, దశరధ్ తదితరులు పాల్గోన్నరు.

Sunday, 27 December 2015

ఉచిత యోగ శిభిరాన్ని సద్వినియోగం చేసుకోండి

ఉచిత యోగ శిభిరాన్ని సద్వినియోగం చేసుకోండి


రెబ్బెన: (వుదయం ప్రతినిధి)  పతంజలి యోగ పీట్ హరిద్వార్ వారి ఆధ్వర్యంలో జిల్లా యోగ ప్రచారక్ ఎల్ములే అశోక్ కుమార్ గారు రెబ్బెన మండలంలో సోమవారం నాటి నుంచి శుక్రవారం వరకు ఉచిత యోగా తరగతులు నిర్వహించనున్నారు. కావున 5 రోజులు జరిగే ఈ యోగా శిభిరాన్ని రెబ్బెన మండల పరిసర వాసులు ఆసక్తి గలవారు రెబ్బెన పోలిస్ స్టేషన్ వెనుక సమయం ఉదయం 5.30 నుండి 7.30 వరకు నిర్వహించడం జరుగు తుందని తెలిపారు. 

కరాటే లో రాష్ట స్దాయి పతకాలు

కరాటే లో రాష్ట స్దాయి పతకాలు  సాదించిన 
సాయి విద్యాలయాలం విద్యార్దులు 



రెబ్బెన: (వుదయం ప్రతినిధి)  బెల్లంపల్లి పట్టణంలోని వైశ్య భవనంలో జరిగిన కుంగ్ పూ, కరాటే పోటిలలో రెబ్బెన మండలానికి చెందినా  సాయి విద్యాలయాలం (యస్.వి ) ఇంగ్లీష్ మీడియం విద్యార్దులు రాష్ట స్దాయి కరాటే పోటిలలో పతకాలను గెలుపొందరాని సాయి విద్యాలయాలం కారస్పాండెంట్  దికొండ  సంజీవ్ కుమార్ తేలిపారు . బంగారుపతకం లో  వై  హర్షవర్దన్,యం సాయి కిరణ్, ఏ వాసుదేవ్ లు, రజిత పతకం లో యల్ సిర్దార్ద, జి మహేశ్వర్, జి ప్రేమ సాగర్, కాంస్య పతకం లో శ్రీ జిత్, ఏ శ్రవణ్, జి సిర్దార్ద , జి శ్రీ రామ్, జి కృష్ణ, డి బాను ప్రసాద్ లు పతకాలను సాదించి రికార్డ్ నెలకొల్పారు. మండలానికే కాకుండా జిల్లాకే గర్వకారణం.  పతకాలను సాదించిన విద్యార్దులను స్దానిక  యంపిపి సంజీవ్ కుమార్, జడ్పిటిసి ఆజ్మీర బాబు రావ్, సర్పంచ్ పెసరు వేంకటమ్మ, ఉప సర్పంచ్ బి శ్రీధర్ నాయకులు నవీన్ కుమార్  జైస్వాల్, చిరంజీవి గౌడ్, మోడం సుదర్శన్ గౌడ్ లు అభినందిచారు. 


అందరూ మంచితనం, సన్మార్గంలో నడవాలి

అందరూ మంచితనం, సన్మార్గంలో నడవాలి


రెబ్బెన: (వుదయం ప్రతినిధి)  రెబ్బెన మండలంలోని  గోలిటి లో  శుక్రవారం  క్రిస్మస్‌ వేడుకలను క్రైస్తవ సోదరులు ఆనందోత్సాహాలతో ప్రజలందరూ ప్రేమ, త్యాగం, మంచితనం, సన్మార్గంలో నడిచి ఏసుప్రభువు కృపాకటాక్షములతో అందరూ కులమతాలకు అతీతంగా కలిసి మెలసి ఉండాలని ప్రార్థిస్తూ ప్రజలందరికీ జీఎమ్ రవి శంకర్  క్రిస్మస్‌ శుభాకాంక్షలు తెలిపారు. ప్రజలు చెడు మార్గాలను వీడి సన్మార్గంలో పయనించి దైవ మార్గంలో నడచినప్పుడే మనసుకు శాంతి, మనిషికి సంతృప్తి కలుగుతాయని, సన్మార్గంలో నడచి పలువురికి ఆదర్శంగా నిలచినప్పుడే జీవితానికి సార్థకత ఏర్పడుతుందని రెబ్బెన మండల తహశిల్దార్ రమేష్ గౌడ్ అన్నారు. పాస్టర్ తిమోతి, దుర్గం జనార్ధన్, లింగయ్య తదితర క్రైస్తవ సోదరులు పలుగోన్నారు. 

ఘనంగా క్రిస్మస్‌ వేడుకలు

ఘనంగా క్రిస్మస్‌ వేడుకలు



రెబ్బెన మండలంలో శుక్రవారం క్రిస్మస్‌ వేడుకలను క్రైస్తవ సోదరులు ఆనందోత్సాహాలతో శుక్రవారం జరుపుకున్నారు. ఈ సందర్భంగా మండలంలోని గంగాపూర్, రేపల్లెవాడ, గోలేటి, నంబాలా, ఇంద్రానగర్ లలో ఏసుక్రీస్తు ప్రార్థనా మందిరాలైన చర్చిలు ప్రార్థనల తో పులకించాయి. అలాగే పలు చర్చిలలో ఫాస్టర్లు ఇచ్చిన సందేశం క్రైస్తవ సోదర ,సోదరీమణుల్లో శాంతి, దయ ,కరుణ, జాలీ అనే అంశాలు ప్రభావితం చేసేవిధంగా వున్నాయి. దీంతోపాటు చర్చిలను పలు ప్రాంతాల్లో అత్యంత సుందరంగా తీర్చిదిద్దారు. కాగా పలువురు పాస్టర్లు అబాగ్యుల కోసం, ప్రపంచం అంతా ప్రశాంతంగా వుండాలని, ప్రకృతి వైపరిత్యాలనుంచి, మత ఘర్షణల నుంచి, కుల, జాతి విబేధాల వల్ల ప్రజలకే కాదు ఏప్రాణికి నష్టం, కష్టం కలుగకూడదని, ప్రతి ఒక్కరూ కరుణ. జాలి కలిగి ఇతరులను ఇబ్బంది పెట్టకుండా తాను సంపాదించిన సొమ్ములో కొంతైనా దానం చేసి పేద ప్రజలను ఆదుకోవాలని, సమాజ సేవలో పాలుపంచుకోవాలని, క్రీస్తు చూపిన మార్గంలో ప్రయాణించి శాంతి మార్గంలో ప్రతి ఒక్కరూ నడుచుకోవాలని సూచించారు. కాగా ఈ వేడుకల్లో శాంతా క్లాజ్‌ వేషదారణలో వున్న క్రైస్తవ సోదరులు చిన్న పిల్లలకు ప్రత్యేక ఆకర్షణగా నిలవగా, వేషదారణలో వున్న వారు స్వీట్లు, బిస్కెట్లు పంచిపెట్టారు.

తెలంగాణా ఉద్యమకారుల సమావేశాన్ని విజయవంతం చేయాలి

తెలంగాణా ఉద్యమకారుల సమావేశాన్ని విజయవంతం చేయాలి 


తెలంగాణా తూర్పు జిల్లా  ఉద్యమకారులను   ఆసిఫాబాద్ లో జరిగే సమావేశాన్ని విజయవంతం  చేయాలనీ డివిజన్ కో కన్వీనర్  తోట లక్ష్మన్ అన్నారు . రెబ్బెన అతిధి గృహంలో శుక్రవారం నాడు  విలేకరి సమావేశంలో మాట్లాడుతూ తెలంగాణా రాష్ట సదన కోసం ఉద్యమాలు చేసి ఆర్దికంగా అన్ని రకాలుగా నష్ట పోయాన ఉద్యమకారులను ఆదుకోవాలన్నచర్చలపై ఆసిఫాబాద్ ఈ నెల ఆదివారం 27న జరిగే  ఈ సమావేశానికి జిల్లా కమిటిని ఎన్నుకోవడం జరుగుతుందని ఉద్యమకారుల న్యాయమైన కోరికలపై చర్చలు జరుగుతాయని  కావున ఈ సమావేశానికి  ఉద్యమకారులు ఆదిక సంఖ్యలో తరలి వచ్చి ఈ సమావేశాన్ని విజయవంతం చేయాలనీ కోరారు ఈ కార్యక్రమములో       మండల  అధ్యక్షుడు దుర్గం రవీందర్, ప్రధాన కార్యదర్శి వినోద్ జైశ్వాల్,ఉపాధ్యక్షుడు వనమాల ఫణికుమార్, కార్యదర్శులు జుమ్మిడి రాజేష్,కుందారపు శంకరమ్మ,ఉద్యమకారులు నవీన్ కుమార్ జైశ్వాల్,చిరంజీవి గౌడ్,దుర్గం భరద్వాజ్ తదితరులు ఉన్నారు.  


సమస్యలు పరిస్కరించాకుంటే కోర్టు కు వెళ్తాం

సమస్యలు పరిస్కరించాకుంటే కోర్టు కు వెళ్తాం 


సర్పంచుల సమస్యలు పరిస్కరించాకుంటే కోర్టు కు వెళ్తామని రాష్ట్ర సర్పంచుల గౌరవా అధ్యక్షుడు సాడని భూమన్న యాదవ్ అన్నారు. గురువారం రెబ్బెనలో విలేకర్ల తో మాట్లాడుతూ 73. 74 రాజ్యాంగ సవరణలో 243 ఆర్టికల్ 29 అంశాలను అమలు పరచాలని అన్నారు. పచ్చిమ బెంగాల్ కేరళ రాష్ట్రాలలో నిధులను విధులుఅధికారాలను కల్పించాలని అన్నారు. గతంలో 278 జీవో రద్దు చేస్తూహాయ్ కోర్టు సర్పంచులకే చెక్ పవర్ ఇచిన్దని తెలిపారు. కేంద్రం నుండి వచ్చిన 14 వ ఆర్టిక సంగం నిధులను కరెంటు బిల్లులను మల్లించకుండా నేరుగా విదుల చేయాలనీ డిమాండ్ చెశారు. లేనిచో కోర్టుకు వెళ్తామని హెచ్చరించరు. సర్పంచులు వెంకటమ్మ . తోట లక్ష్మన్ భీమేశ్ శుశీల తదితరలు ఉన్నారు.  

Wednesday, 23 December 2015

ముస్థాబైన  గోలేటి భీమన్న స్టేడియం 
   

రెబ్బెన: (వుదయం ప్రతినిధి)  బెల్లంపల్లి ఏరియా లోని గోలేటి టౌన్ షిప్ లో గల భీమన్న స్టేడియం లో  నేడు నిర్వహించే సింగరేణి ఆవిర్భావ దినోత్సవ వేడుకల కోసం భీమన్న స్టేడియం ను ముస్తాబు చేసారు. ఏర్పాట్ల విషయం లో ఏలాంటి ఇబ్బందులు తలెత్తాకుండా  ఉండటానికి తగిన చర్యలు తీసుకున్నారు. సింగరేణి డే వేడుకలను ఘనం గ నిర్వహించడానికి అధికారుల పర్యవేక్షణలో  గోలేటి భీమన్న స్టేడియం కొత్త హంగులతో అంగారంగ వైభవంగా పనులను నిర్వహించడం జరిగింది. ఈ వేడుకలు ఉదయం నుండి రాత్రి వరకు జరగనున్నట్లు అధికారులు వివరించారు. ఈ కార్యక్రమానికి కార్మికుల కుటుంబాల నుంది అదిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలనీ వారు అన్నారు. ఈ కార్యక్రమానికి బెల్లంపల్లి ఏరియ జనరల్ మేనేజర్ కె.రవిశంకర్ ముక్య అధితి గా హాజరావ్తున్నారని అన్నారు. ఈ కార్యక్రమం లో సాంస్కృతిక కార్యక్రమాలతో కనువిందు చేయనున్నట్లు వారు వివరించారు. 

సింగరేణి ఆవిర్బావ దినోత్సవ వేడుకలు ఘనంగా

సింగరేణి  ఆవిర్బావ దినోత్సవ వేడుకలు ఘనంగా 


రెబ్బెన: (వుదయం ప్రతినిధి)  బెల్లంపల్లి ఏరియా లోని గోలేటి టౌన్ షిప్ లో గల భీమన్న మైదానంలో సింగరేణి డే వేడుకలు అట్టహాసంగా ప్రారంభమయ్యాయి.  బెల్లంపల్లి ఏరియ జనరల్ మేనేజర్ కె.రవిశంకర్  బెలూన్లను ఎగురవేశారు. అనంతరం అక్కడ ఏర్పాటు చేసిన స్టాళ్లను ప్రారంభించారు. సింగరేణి  చరిత్రను, ప్రగతి, విజయాలను చాటిచెప్పే విధంగా ఏర్పాటు చేసిన స్టాళ్లు అందరినీ ఆకట్టుకుంటున్నాయి.వివిధ విభాగాల్లో సేవలు అందించిన కార్మికులు సేవాసమితి  బహుమతులు ప్రధానం చేసరు  అనంతరం ఆయన మాట్లాడుతూ సింగరేణి యాజమాన్యం కర్మికులుపైనే కాకుండా కార్మికుల కుటుంబాల సంక్షేమం పట్ల ప్రత్యేక శ్రద వహిస్తోంది అని అన్నారు కార్మికుడు ఇంటి వద్ద ప్రశంతగా ఉన్నపుడే ఉత్పతి పై దృష్టి సాదిస్తారని ఆయన అన్నారు కార్మికుల కుటుంబాలను దృష్టిలో ఉంచుకోని ఆరోగ్యం కోసం ఆయుర్వేద వైద్య సదుపాయములు కల్పించమని నిరుద్యోగ యువతీయువకులు స్వయం కృషితో పారిశ్రామికవేత్తలు స్వయం సంపాదకులుగా ఏదిగే అవకాశం కల్పిస్తాము అన్నారు  అనంతరం గుస్సాడి నృత్యం మరియు సంగీతసాహిత్య ,మిమిక్రి  సంస్కృత కార్యక్రమాలు జరుపుకున్నారు   ఈ కార్యక్రమలో  అధికారులు, ఉద్యోగులు  తదితర సభ్యులు  పాల్గొన్నారు.

ఉత్తేజ క్యాథలిక్ యువత జిల్లా నూతన కార్యవర్గం ఎంపిక

ఉత్తేజ క్యాథలిక్ యువత  జిల్లా నూతన కార్యవర్గం ఎంపి

 రెబ్బెన: (వుదయం ప్రతినిధి) : ఆదిలాబాద్ క్యాథలిక్  యువత జిల్లా కార్యవర్గం ఎంపిక మంచిర్యాల్ లోని పాస్కల్ సెంటర్ లో  జరిగిందని ఆదిలాబాద్ జిల్లా క్యాథలిక్ యూత్ డైరెక్టర్ రెవరెంట్ ఫాదర్ రినోజ్ ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సందర్భంగా  ఆయన  మాట్లాడుతూ నేటి యువతే రేపటి భవిత అని, యువతను సక్రమం గా దేవుని మార్గం లో నడపగలిగితే మంచి  దైవ సంఘాన్ని ఏర్పరుచుకోవచ్చునని ఆయన అన్నారు. ఈ కార్యవర్గం లోని యువత నాయకత్వం వహిస్తూ ముందుండి జిల్లా క్రైస్తవ యువతను నడిపించాలని  కోరారు. ఈ సందర్భంగా అందరు కలిసి మినీ క్రిస్టమస్ ను కొనియాడమని తెలిపారు.  ఈ కార్యకార్యక్రమం లో ఆదిలాబాద్ జిల్లా క్యాథలిక్ యూత్ డైరెక్టర్ రెవరెంట్ ఫాదర్ రినోజ్, సహాయకులు జాయ్ సర్, జిల్లా లోని అన్ని పారిష్ ల నుండి వచ్చిన యువత ఈ ఎన్నికలో పాల్గొన్నారు .
నూతనంగా ఎంపికైన  క్యాథలిక్ యువత  జిల్లా కార్యవర్గం
ప్రెసిడెంట్ - జాడి ప్రశాంత్ (మంచిర్యాల్ ), వైస్ ప్రెసిడెంట్  - జాడి ప్రణవిశేష (జెండావెంకటాపూర్ ), బాయ్ రిప్రేసేన్టేటివ్ - రత్నం వివేకానంద్ (రేప్పెల్లెవాడ ), గర్ల్ రిప్రేసేన్టేటివ్- పసల దీప (బెల్లంపల్లి ), స్పోక్స్ పర్సన్ - డి.కరుణాకర్ (మందమరి ), జెనరల్ సెక్రెట్రీ - గంధం. శ్రీనివాస్ (గోలేటి ) , వైస్ సెక్రెట్రీ- జె. అనిత (గోలేటి )
ట్రెజరర్ - రామ్టేన్కి.శ్యాం (యేసయ్య పల్లె)

మండలాభివ్రుద్ధికి తోడ్పడాలి

 మండలాభివ్రుద్ధికి తోడ్పడాలి


రెబ్బన మండలంలో సోమవారం రోజున ఏమ్పిడివో కార్యాలయంలో ముఖ్య అతిధిగా జడ్పి చైర్మన్ శోభారాణి అబివృద్దికి తోడ్పడాలని అన్నారు. మండల ప్రజా పరిషత్  కార్యాలయంలో సర్వ సభ్య సమావేశం నిర్వహించారు. ఈ కార్యాక్రమంలో ఆమె మాట్లాడుతూ పలు అబివృద్ది సంక్షేమల పై, మండలంలోని అధికారులు, ప్రజా ప్రతినిధులు , సకాలంలో పనులు వేగావంతంగా నిర్వహించాలని, ఈ సమావేశంలో మండల సర్వతోముఖాబివ్రుద్దికి పాటుపడాలని అన్నారు. ఈ కార్యక్రమంలో జడ్పిటిసి బాబురావు, ఎంపిపి సంజీవ్, ఏమ్పిడివో ఎం ఏ అలీం, ఎమ్మార్వో రమేష్ గౌడ్, మండల ఎంపిటిసి లు, సర్పంచ్ లు, సంభందిత ప్రభుత్వ అధికారులు పాల్గొన్నారు.

Saturday, 19 December 2015

ప్రభుత్వ పరంగా నిర్వహించడం హర్షణీయం

ప్రభుత్వ   పరంగా నిర్వహించడం హర్షణీయం 

 రెబ్బెన: (వుదయం ప్రతినిధి); క్రైస్తవుల విశిష్టమైన  క్రిస్మస్ పండుగను రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించి పేదవారికి దుస్తులు పంపిణి చేయడఓమ హర్షనీయమని తెలంగాణా క్రిస్త్రియాన్ డివిజన్ అద్యక్షుడు రాజారత్నం అన్న్నారు. శనివారము రెబ్బెనలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశములో ఆయన మాత్లదారు. కె సి ఆర్ ముఖ్యమంత్రి మైనారిటీలకు పెద్ద పీత వేస్తున్నారని అన్నారు. టి ఆర్ ఎస్ ప్రభుత్వం పేద క్రిస్టియన్లకు నివాస స్తలం . ఇండ్లు   మంజూరు చేయాలని అన్నారు. ఈ కార్య క్రమములో జాషువా . తిమోతి లు ఉన్నారు.   

రోడ్డు ప్రక్కనే కంకర కుప్పలు ఇబ్బందుల్లో వాహన చోదకులు

రోడ్డు ప్రక్కనే కంకర కుప్పలు ఇబ్బందుల్లో వాహన చోదకులు

 రెబ్బెన: (వుదయం ప్రతినిధి); రెబ్బెన మండల కేంద్రంలో  రోడ్డు ప్రక్కనే ఉన్న వ్యాపారులు కంకర కుప్పలు వేయడం తో రద్దీగా ఉండే జాతీయ రహాదారి మీద  ఎప్పుడు ఎం జరుగుతుందో రోడ్డు ప్రక్క నుండి వాహనాలు వెళ్ళాలంటే చాల ఇబ్బంది ఉందని వాహన చోదకులు తెలుపు తున్నారు. ఇస్టారాజ్యంగా కంకర కుప్పలు ప్రక్కనే పెట్టడంతో ఎప్పుడు ఎ ప్రమాదం జరుగుతుందో అని భయపడుతున్నారు ఎప్పటి కైనా సంభందిత అధికారులు పట్టించుకోవాలని వాహన దారులు కోరుతున్నారు 

జాతియ స్థాయికి ఎంపికైన సింగరేణి విద్యార్థులు

జాతియ స్థాయికి ఎంపికైన సింగరేణి విద్యార్థులు

 రెబ్బెన: (వుదయం ప్రతినిధి); ఈ నెల 15 నుండి 18  వరకు హైదరాబాద్ లోని ఎల్బి స్టేడియం కోచింగ్ క్యాంపులో రాష్ట్ర జట్టు ఎంపికైనట్లు బాల బ్యాడ్మింటన్ అసోషియెసన్  ఆర్ నారాయణ మూర్తి తెలిపారు జాతీయ స్థాయికిఎంపికైన విద్యార్థులు బిహార్ పాట్నాలో జరిగే బాల్  బ్యాడ్మింటన్ పోటిలలో ఆడుతారని ఆయనఅన్నారు. క్రీడాకారులు కె, స్వప్న సిద్ధర్థ రాజ్, టి, సుస్మిత సింగరేణి పాటాశాలకు  చెందిన విద్యార్థులు జాతీయ స్థాయికి ఎంపికైన విద్యార్థులను ఎచ్ ఎం శ్రీనివాస్,  పీఈటి భాస్కర్, ఎ,అయ్,టి,యు,సి నాయకుడు ఎస్, తిరుపతి. టిజిబికేఎస్ సదాశివ్ కేంద్ర కార్యవర్గ సభ్యుడు ఎం శ్రీనివాస్ రావు, అయ్,ఎన్,టి,యు,సి నాయకుడు ఎస్ ప్రకాష్ రావు లతో పాటు స్థానిక సర్పంచ్ టి, లక్ష్మన్ అభినందించారు.

బి సి రిజర్వెషాన్ బిల్ ప్రవేశపెట్టాలి

బి సి రిజర్వెషాన్ బిల్ ప్రవేశపెట్టాలి 


 రెబ్బెన: (వుదయం ప్రతినిధి);; ప్రసుత పార్లమెంటు సమావేశాలో బి సి రిజర్వేషన్ బిల్లును వెంటనే ప్రవేశపెట్టాలని బి సి  ఐక్య సంగర్షణ సమితి డిమాండ్ చెస్తొన్ది. శుక్రవారం స్తానిక తహసిల్దార్ రమేష్ గౌడ్ కు వినతిపత్రాన్ని అన్దజెశారు.  నాయకులు మాట్లాడుతూ    చట్టసభల్లో అవకాశాలు కల్పించాలాని . బి సి లకు రిజర్వేశండ్లు కల్పించాకపోవడంతో చాల వెనుకబడి పోయారని వారు పెర్కొన్నారు.  దేశ జనాబాలో అత్యధిక జనాభా బి సి లు  ఉన్నారని అన్నన్నారు. దేశవ్యాప్తంగా పార్లమెంటులో 18 రాష్ట్రాలలో ప్రాత్నిద్యం లేదని అన్నారు. చట్ట సభల్లో రిజర్వేశండ్లు అమలు చేయక పోవడమే కారణమని తెలిపారు. హిజ్రాలను బిసి  జాబితాల్లో చేర్చడం వ్యతిరేకమని పెర్కొన్నారు. బి సి వారికి ఉద్యోగాల్లో ప్రమోశండ్లు కల్పిచాలని అన్నారు. వెనుకబడిన బి సి విద్యార్థులకు స్కాలర్ షిప్పులు విడుదల చేయాలనీ అన్నారని తెలిపారు. ఈ కార్య క్రమంలో నాయకులు కడ్తాల మల్లయ్య బొఇగె ఉపేందర్ పాలగాని పర్వతాలు. మానేం సంతోష్ రామడుగుల శంకర్ మోడెమ్ రాజగౌద్ బొంగు నరసింగ రవ నానవేని సత్తయ్య తధీతరులు ఉన్నారు,.

Thursday, 17 December 2015

మండల ప్రజా పరిషత్ సర్వ సభ్య సమావేశం

     మండల ప్రజా పరిషత్ సర్వ సభ్య సమావేశం

 రెబ్బెన: (వుదయం ప్రతినిధి); రెబ్బన మండలం  ఈ నెల 21 సోమవారం రోజున మండల ప్రజా పరిషత్ సర్వ సభ్య సమావేశం జరుగనున్నట్లు ఈ  కార్యాక్రమం లో పలు అబివృద్ది సంక్షేమల పై  సమావేశం కొనసాగుతుందని ఏమ్పిడివో ఎం ఏ అలీం పత్రిక ప్రకటనలో తెలిపారు. మండలంలోని అధికారులు, నాయకులను,ప్రజలను సకాలంలో హాజరు కావాలని  ఈ సమావేశంలో మండల సర్వతోముఖాబివ్రుద్దికి పాటుపడే అంశాలపై సర్వ సభ్య సమావేశం ఉంటుందని ఏమ్పిడివో  అన్నారు.

గుడుంబా రహిత మండలంగా రెబ్బెన:ఎస్ ఐ .దారం సురేష్

గుడుంబా రహిత  మండలంగా రెబ్బెన:ఎస్ ఐ .దారం సురేష్ 





 రెబ్బెన: (వుదయం ప్రతినిధి); రెబ్బెన మండలంలోని గుడుంబా నాటుసారాను వందశాతం అరికడతామని రెబ్బెన ఎస్ ఐ .దారం సురేష్ అన్నారు గురువారం మాట్లాడుతూ రెబ్బెన మండలంలోని సింగలుగూడ, గోలేటి, తదితర గ్రామాలలో 90% అరికట్టామని త్వరలో 10% పూర్తి చేసి గుడుంబా రహిత మండలంగా తీర్చి దిద్దుతామని అన్నారు. గోలేటిలో 2 నెలల్లో దాడి చేసి 13 కేసులు నమోదు చేశామని, 8 మందిని బైండోవర్ చేశామని అన్నారు. అదేవిధంగా సింగలుగుడా గుడుంబా స్థావరాలను ద్వంశం చేసి బైండోవర్ చేశామని అన్నారు, గుడుంబా మహమ్మారి నిషేదానికి ప్రతివొక్కరు సహకరించాలని అన్నారు. గుడుంబా నిషేధంపై అవగాహన నిర్వనిర్వహించాలని.గుడుంబా వల్ల కుటుంబాలు చిన్న బిన్నం అవుతున్న తీరును వివరించారు.  మండలంలో చిన్న చిన్న దొంగతనాలు జరుగుతున్నాయని ఆ దొంగలను పట్టుకొని రిమాండుకు పంపుతున్నట్లు, మండలంలో అన్ని గ్రామాల మీద నిఘా ఉంచినట్లు, రాత్రి పూట బస్తీలలో గస్తి నిర్వహిస్తున్నామని తెలిపారు. 

విద్యా రంగా సమస్యలు పరిష్కరించాలి-ఎస్,ఎఫ్,అయ్

విద్యా రంగా సమస్యలు పరిష్కరించాలి-ఎస్,ఎఫ్,అయ్



 రెబ్బెన: (వుదయం ప్రతినిధి); రెబ్బెన కస్తూరిబా గాంధీ బాలికల విద్యలయంలోని సమస్యలు పరిష్కరించాలని కోరుతూ భారత విద్యార్ధి ఫెడరేషన్ గురువారం రెబ్బెన మండల తహసిల్దార్ రమేష్ గౌడ్ కు వినతి పత్రం అందజేశారు, ఎస్,ఎఫ్,అయ్ జిల్లా సహాయ కార్యదర్శి గోదిసేలా కార్తిక్ మాట్లాడుతూ మండల కేంద్రంలో ప్రభుత్వ జూనియర్ కళాశాలాకు స్వొంత భవనం పూర్తి కాకా ఇబ్బందులకు గురవుతున్నారని, మరుగుదొడ్లు, మూత్రశాలలు, ప్రహరి గోడ నిర్మించాలని, కస్తూరిబా గాంధీ బాలికల విద్యలయంకు ప్రహరిగోడ లేకపోవడంతో విద్యార్థినులు రాత్రిపూట భయబ్రాంతులకు గురౌతున్నారు అని, ప్రణాళిక ప్రకారం భోజనం పెట్టడం లేదని వారు తెలిపారు, అదే విధంగా రాత్రి సమయంలో పాటశాల ఆవరణం లో పొలిసు పెట్రోలింగ్ చేపట్టాలని వారు డిమాండ్ చేసారు.   


గ్రామ సభలు నిర్వహిస్తున్న అధికారులు

గ్రామ సభలు నిర్వహిస్తున్న అధికారులు 
Displaying 20151217_142004.jpg
Displaying 20151217_142004.jpg

ఎస్సి, బీసి కార్పోరేషన్ రుణాల కోసం గ్రామ సభలు నిర్వహిస్తున్నట్లు ఏమ్పిడివో ఎంఎ హలీమ్ తెలిపారు గురువారం రెబ్బెన మండలంలోని నవేగాం, వంకులం, కొండపల్లి, ఖైర్గాం లలో గ్రామ సభ నిర్వహించడం జరిగిందని ఎస్సి, బీసి, రుణాలకు అర్హులైన వారిని ఎంపిక చేస్తునట్లు ఈ రుణాలను సద్వినియోగం చేసుకోవాలని చేశారు.

Wednesday, 16 December 2015

ఆసిఫాబాద్ ను జిల్లా కేంద్రంగా ఏర్పాటు చేయాలి

ఆసిఫాబాద్ ను  జిల్లా కేంద్రంగా ఏర్పాటు చేయాలి

రౌండ్ టేబుల్ సమావేశం
రెబ్బెన మండల కేంద్రం లో మంగళవారం రోజున ఆసిఫాబాద్ జిల్లా కేంద్రం కావాలని  రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది. ఆసిఫాబాద్ ను జిల్లా కేంద్రం గ చేయాలనీ ఆసిఫాబాద్ జిల్లా సాధన సమితి రేగుంట కేశవరావు అన్నారు . మండల కేంద్రం లోని గెస్ట్ హౌస్ లో సమావేశాహం ఏర్పాటు చేసారు. ఆసిఫాబాద్ నవాబు కలం లో దాదాపు 25 సంవస్తారాలు జిల్లకేంద్రం గ కొనసాగిందని ఆసిఫాబాద్ గొండురాజు అంకం రాజు ఈ ప్రాంతం ను పరిపాలించడం జరిగిందని జరిగింది. నైజం నవాబైన హఫిజఈ  రాజకీయ పరిపాలన సాగించి జనగామ పేరుగా వున్నా దాన్ని ఆసిఫాబాద్ గా మార్చి జిల్లాగా ప్రకటించాడని వారు పేర్కొన్నారు. దురద్రుస్టవశత్తు  ఆసిఫాబాద్ జిల్లాను రద్దు చేసి ఆదిలాబాద్ గా మార్చటం జరిగిందని తెలిపారు అన్ని రకాలుగా వనరులున్న ఆసిఫాబాద్ వెనుకబడి వుందని జల్ , జంగల్ ,జమీన్ కోసం పోరాటం చేసిన కొమురం భీం పుట్టి పెరిగి అమరుడైనది జోడేఘాట్ కావున ఆసిఫాబాద్నే జిల్లాగా ప్రకటించాలని ఈ జిల్లాకు కొమురం భీం జిల్లాగా నామకరణం చేయాలనీ వారు డిమాడ్ చేసారు. ఈ కార్యక్రమం లో ఆసిఫాబాద్ జిల్లా ఏర్పాటుకై క్రింద పేర్కొన్న  రెబ్బెన మండల సాధన కమిటీ ని ఎన్నుకోవటం జరిగిందని పేర్కొన్నారు. 
ఆసిఫాబాద్ జిల్లా ఏర్పాటుకై  రెబ్బెన మండల సాధన కమిటీ
అధ్యకుడు 1: కర్నాథం సంజీవ్ కుమార్  యం.పి.పి
అధ్యకుడు 2:అజ్మీర బాబురావు  zptc
ముఖ్య  సలహాదార్లు : వనమల జక్కయ్య
కార్యవర్గం:
అద్యక్షులు:  కదతల మల్లయ్య
వర్కింగ్ ప్రెసిడెంట్ : కొవ్వూరి శ్రీనివాస్
అదికార ప్రతినిధి: లింగంపల్లి ప్రభాకర్
ఉపాధ్యక్షులు 1 ఎర్గట్టి సుధాకర్ తదితరులు ఉన్నారు.

దొంగలు అరెస్ట్

దొంగలు అరెస్ట్

రెబ్బెనలో ఈ నెల 4 న వ్యాన్ వస్తువులు జాకులు . బ్యాటరీలు దొంగలించిన కేసులో ముగ్గురు ని అరెస్టు చేసి రిమాండుకు పంపినట్లు రెబ్బెన ఎస్ ఐ సురేష్ . మాదారం ఎస్ ఐ టి వి రావు తెలిపారు. రెబ్బెనకు చెందినా గోడిసేలా భార్గవ్ గౌడ్, మనీష్,సతీష్  లను సామాగ్రి అమ్ముతుండగా చాక చక్యంగా పట్టుకున్నట్లు వారు తెలిపారు. బాదితుడు రామడుగు శ్రీనివాస్ ఇచ్చిన పిర్యాదు మేరకు అరెస్ట్ చేసి రిమాండు చేసినట్లు తెలిపారు.

Monday, 14 December 2015

తెలంగాణా ఉద్యమ కారుల కార్యవర్గం ఎన్నిక

తెలంగాణా ఉద్యమ కారుల కార్యవర్గం ఎన్నిక 


రెబ్బెన: (వుదయం ప్రతినిధి) రెబ్బెన మండల తెలంగాణా ఉద్యమ అధ్యక్షుడుగా దుర్గం రవీందర్ ని ఎన్నుకున్నట్లు ఉద్యమకారుల సంగం ఆసిఫాబాద్ నియోజకవర్గ కన్వీనర్ ఎం ఎ వాహబ్ తెలిపారు. రెబ్బెనలని గెస్ట్ హౌస్ లో ఈ ఎన్నిక జరిగినది. ఉపాధ్యక్షునిగా లావుద్య వసంత రావు. వనమాల ఫణికుమార్. ప్రధాన కార్య దర్శిగా వినోద్ జైస్వాల్. కార్యదర్శులుగా జమ్మిది రాజేష్. దాసరి సామ్బగౌద్. కుందారపు శంకరమ్మ కోశాది కారిగా రాపర్తి అశోక్ లను ఎన్నుకున్నారు. ఈ కార్యక్రమములో నాయకులు పోటు శ్రీధర్ రెడ్డి  బోగే ఉపేందర్ . తోట లక్ష్మన్ శ్రీరాం వెంకటేశ్వర్లు పోలిశెట్టి సత్తయ్య జెడ్ ఫై టి సి  బాబు రావు ఎంపి ఫై సంజీవ్ ఎం రమేష్ జయకృష్ణ మధునయ్య వెంకటేశ్వరా గౌడ్ శ్రీనివాస రావు జడి అశోక్ తదితరులు ఉన్నారు.  


Saturday, 12 December 2015

ఆసిఫాబాద్ సబ్ కలెక్టర్ బదలీ

రాష్ట్రంలో గురువారం ఆరుగురు ఐఏఎస్ లు బదిలి అయ్యారు. ఈ బదిలిల్లో ప్రస్తుతం ఆసిఫాబాద్ సబ్ కలెక్టర్ గా విధులు నిర్వహిస్తున్న రాజీవ్ గాంధీ హన్మంతుకు ఖమ్మం జిల్లా భద్రాచలం ఐటిడిఏ పివో గా బదిలి చేశారు. ఈయన స్థానంలో మధ్యప్రదేశ్ కు చెందిన అద్వైత్ కుమార్ సింగ్ ను నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు విడుదల చేసింది

Friday, 11 December 2015

ఎమ్మెల్సీ ఏకగ్రీవం కార్యకర్తల్లో ఆనందం

ఎమ్మెల్సీ ఏకగ్రీవం కార్యకర్తల్లో ఆనందం



 రెబ్బెన: (వుదయం ప్రతినిధి)  

ఆదిలాబాద్ జిల్లాలో జరగబోయే ఎమ్మెల్సీ ఎన్నికల కోసం పురాణం సతీష్ ఏకగ్రీవంగా ఎన్నిక ఖాయం కావడంతో శుక్రవారం నాడు రెబ్బెన బస్టాండ్ వద్ద ప్రధాన రహదారి మీద బనసంచాలు కాల్చి జిల్లా టీఆర్‌ఎస్‌ పార్టీ నాయకులు ఆనందంతో మిటాయులు పంచుకొని శుభాకాంక్షలు తెలుపుకున్నారు. ఈ సందర్భంగా  ఎంపిపి సంజీవ్, జడ్పిటిసి బాబురావు, జిల్లా ఉప అధ్యక్షుడు నవీన్ కుమార్ జైశ్వాల్ మాట్లాడుతూ జిల్లాలో ఏకగ్రీవంగా ఎన్నికకావడం మరోసారి టీఆర్‌ఎస్‌ పార్టీ జిల్లాలో బలోపేతం అయింది. ఆదిలాబాద్ ఎమ్మెల్సీ స్థానాన్ని తెరాస పార్టీ సొంతం చేసుకుందని. ఈ ఎమ్మెల్సీ స్థానానికి తెరాస అభ్యర్థిగా పురాణం సతీష్తో పాటు మిగితా అభ్యర్థులు నామినేషన్‌లు దాఖలు చేశారు. కాగా నేడు ఆ అభ్యర్థులు తమ నామినేషన్లను ఉపసంహరించు కున్నారు. దీంతో పురాణం సతీష్ నామినేషన్‌ ఒక్కటే మిగలడంతో ఆయన ఎన్నిక ఎకగ్రీవమైంది. కాగా నామిషన్‌కు ఈనెల 12వ  తేదీ వరకు గడువు ఉన్నప్పటికీ ఈరోజే జిల్లా ఎమ్మెల్సీ స్థానం ఎకగ్రీవమవడం హర్షనీయమన్నారు. ఈ సందర్భంగా పురాణం సతీష్కి తెరాస నాయకులు శుభాకాంక్షలు తెలిపారు  ప్రత్యర్థులను ధీటుగా ఎదుర్కోనే అనుభవమున్న పురాణం సతీష్ గెలుపుకు వ్యూహాత్మకంగా టీఆర్‌ఎస్‌ పార్టీ జిల్లా నాయకులు తమదౖౖౖెన శైలిలో ఇప్పటికే ప్రచారం మొదలు పెట్టినప్పటికీ. పురాణం సతీష్ ఏకగ్రీవంగా ఎన్నిక ఖాయం కావడం ఊహించిన పరిణామమని అన్నారు. ఈ కార్యక్రమంలో వైస్ ఎంపీపీ గోడుసేల రేణుక, సర్పంచ్ పెసరు వెంకటమ్మ, టౌన్ ప్రెసిడెంట్ రాపర్తి అశోక్, మైనార్టీ నాయకులు సలీం, అన్వర్, చోటు, మండల ఎస్సీ సెల్ అధ్యక్షుడు శ్రీనివాస్, జిల్లా మహిళా ప్రధాన కార్యదర్శి కుందారపు శంకరమ్మవెంకన్న గౌడ్, మధనయ్య, పల్లె రాజేశ్వర్, మహావీర్, బొమ్మినేని సత్యనారాయణ, కార్నాధం చంద్రయ్య, సోమ శేఖర్ టి,ఆర్,ఎస్ నాయకులు పాల్గొన్నారు..

Wednesday, 9 December 2015

ఆయుర్వేద వైద్య శిభిరాన్ని సద్వినియోగం చేసుకోండి

ఆయుర్వేద వైద్య శిభిరాన్ని సద్వినియోగం చేసుకోండి


 రెబ్బెన: (వుదయం ప్రతినిధి)  ఆయుర్వేద మందుల ద్వారా ఆరోగ్యం త్వరగా నయమవుతుందని బెల్లంపల్లి ఏరియ డీవై జీఎం చిత్తరంజన్ కుమార్ అన్నారు. బెల్లంపల్లి ఏరియా సింగరేణి సేవా సమితి అధ్వర్యంలో హైదరాబాద్ లోని మాతా రిసెర్చ్ సెంటర్ డా,విశ్వనాథ మహార్షి వారు 10వ తేది ఉదయం 10 గం,ల నుండి మధ్యాహ్నము 1 వరకు ఆయుర్వేద వైద్య శిభిరాన్ని నిర్వహించడం జరుగుతుందని అలాగే సాయంత్రం 3 గంటల నుండి 6 గంటల వరకు నిర్వహిస్తున్నారని ఈ వైద్య శిభిరంలో దీర్ఘ కాలిక వ్యాదులైన కీళ్ళు, మోకాళ్ళ నొప్పులు, బీపీ, షుగర్, పక్షవాతం, మలబద్దకము, అస్తమా, స్త్రీ ల వ్యాధుల గురించి పరిక్షించడం జరుగుతుందని ఈ అవకాశాన్ని అందరు సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు.

సింగరేణి ఆవిర్భావ దినోస్తవాన్ని ఘనంగా నిర్వహించాలి ----జి ఎం

సింగరేణి ఆవిర్భావ దినోస్తవాన్ని ఘనంగా నిర్వహించాలి ----జి ఎం 



 రెబ్బెన: (వుదయం ప్రతినిధి)  బెల్లంపల్లి ఏరియాలో సింగరేణి ఆవిర్భావ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించాలని బెల్లంపల్లి ఏరియ జి ఎం రవిశంకర్ అన్నారు. బుద వారం అన్ని ఘనుల అధికార్లతో సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. ఆయ్యన మాట్లాడుతూ ఆవిర్భావ దినోత్సవ ఉత్సవాలను ఎలా జరుపుకోవాలో అధికార్లను అడిగి తెలుసుకున్నారు. అధికార్లు తమ మనో భావాలను తెలుపారు. అందరి సహాకారాలు చీయాలని ,అప్పుడే ఘనంగా విజయం సాదిస్తామని జి ఎం అన్నారు. ఈ సమావేశములో అధికార్లు , కార్మిక సంగ నాయకులు ఉన్నారు. 

18న టీవీవీ సదస్సు విజయవంతం చేయాలి

18న టీవీవీ సదస్సు విజయవంతం చేయాలి 


 రెబ్బెన: (వుదయం ప్రతినిధి)  తెలంగాణ విద్యార్థి వేధిక ఆధ్వర్యంలో బుధవారం జిల్లా టీవీవీ సదస్సుకు సంబంధించిన గోడ ప్రతులను రెబ్బన  మండల కేంద్రంలోని ఆర్‌అండ్‌బీ అతిథి గృహ ఆవరణలో ఆవిష్కరించారు. ఈసందర్భంగా మండల అధ్యక్షుడు పర్వతి సాయి మాట్లాడుతూ ఈనెల 18న ఆసిఫాబాద్‌లోని రోజ్‌గార్డెన్‌లో జిల్లా సదస్సు జరుగుతుందన్నారు. ఈసదస్సుకు నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో హాజరై విజయవంతం చేయాలని కోరారు. ఈసదస్సులో తెలంగాణ విద్యార్ధి వేదిక మండల అధ్యక్షులు పార్వతి సాయి, డివిజన్ నాయకులు సాయి నవతేజ, జిల్లా కార్య వర్గ సబ్యులు ప్రణయ్ , నాయకులూ సతీష్, హరీష్ తదితరులు పాల్గొన్నారు

Tuesday, 8 December 2015

పురాణం కు నీరాజనాలు


పురాణం కు నీరాజనాలు

బెల్లంపల్లి నుOడి ఆసిఫాబాద్ కు వెళ్తూ రెబ్బెన బస్టాండులో ఆగిన ఆదిలాబాద్ ఎం ఎల్ సి  అబ్యర్థి పురాణం సతీష్ కు రెబ్బెన టి ఆర్ ఎస్ నాయకులు నీరాజనాలు పలికారు. ట పాసులు పేల్చి సంతోషాన్ని వెలిబుచ్చారు. ధన్యవాదాలు తెలిపి ఆలింగనం చేసుకున్నారు, ఈ  కార్యక్రమములో ఎం పి పి కే సంజీవ్ కుమార్ , జెడ్ పీ టి సి బాబు రావు , సర్పంచ్ వెంకటమ్మ , జిల్లా ఉపాద్యక్షుడు నవీన్ జైస్వాల్ , ప్రధాన కార్యదర్శులు కె శంకరమ్మ , సి ఎచ్ సోమషేకర్ , నాయకులూ చిరంజీవి గౌడ్ , రమేష్ , సత్తయ్య , నరేందర్ , మధునయ్య , రేణుక , తదితరులు పాల్గొన్నారు. 

సి సి కెమరాల ఏర్పాట్ల కోసం పరిశీలన

సి సి కెమరాల ఏర్పాట్ల  కోసం పరిశీలన
  
రెబ్బెన బస్టాండులో సి సి కెమరాల ఏర్పాటు కోసం తాండూర్ సి ఐ కరుణాకర్ మంగళవారం స్థలాన్ని పరిశిలించారు. రెబ్బెన ఎస్ ఐ దారం సురేష్ ,మాదారం ఎస్ ఐ టి వి రావు లతో పాటు టెక్నిశియన్లతో రెబ్బెన బస్టాండు పరిసరాలను అడిగి తెలుసుకున్నారు. ప్రమాదాలు ఎక్కువ జరుగుతుండడముతో సి సి కెమరాలను ఏర్పాటు చేస్తున్నట్లు సి ఐ తెలిపారు.   

Monday, 7 December 2015

గ్రామపచాయతి సిబ్బంది సమస్యలు పరిశ్కరించండి

  1. గ్రామపచాయతి సిబ్బంది  సమస్యలు పరిశ్కరించండి 


గ్రామపచాయతి సిబ్బంది తమ సమస్యలపరిస్కారము కోసం చలో హైదరాబాద్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు జిల్లా కార్యదర్శి ఎన్ సుదాకర్ అన్నారు. గోలేటి లో విలేకర్లతో సోమవారము మాట్లాడుతూ గతములో 44 రోజులు సమస్యలు పరిష్కారం చేయాలనీ ధర్నా  చేసినప్పుడు పంచాయత్ రాజ్ శాఖ మంత్రి కార్యదర్శి శాస్వత ముగ సమస్యను పరైస్కరిస్తామని హామీ ఇచ్చి ధర్నాను విరమింప చేయించారని ఆయన అన్నారు. 2 నెలలు ఆగమారు కాని 4 నెలలు ఐనకాని ఇంతవరకు ఊసె ఎత్త్త లేదని పేర్కొన్నారు  రాష్ట్ర కమిటి పిలుపు మేరకు ఈ నెల 10 న హైదరాబాద్లోని కమిశ్స్నార్ కార్యాలయము ముందు దర్న నిర్వహిస్తున్నట్లు ఆయన అన్నారు. జిల్లాలోని కార్మికులందరూ అధీకసంక్యలో రావాలని పిలుపు నిచ్చారు. ఈ కార్య క్రమములో ప్రకాష్ .తిరుపతి దేవాజి లు పాల్గొన్నారు.   

స్వయం భూ కేతేశ్వర్‌ , కంకాలమ్మ దేవి జాతర ఘనంగా

స్వయం భూ కేతేశ్వర్‌ , కంకాలమ్మ దేవి జాతర ఘనంగా

 రెబ్బెన: (వుదయం ప్రతినిధి) కౌటాల మండలంలో ఆదివారం స్వయం భూ కేతేశ్వర్‌ , కంకాలమ్మ దేవి, లేత బొంగుల జాతర బారిఎత్తున వేలాది మందితో కొనసాగింది మేదరి కులస్థులందరూ ఒక్క దగర కలుసుకొని  కుల దేవత కు మోక్కులు సమర్పించుకునారు . అలాగే 45 అడుగుల కేతేశ్వర లింగం భూమి పూజ చేశారు రెబ్బెన మేదరి కులస్థులందరూ అదికసంకెల వెళ్ళారు. 

అంబేడ్కర్‌కు ఘన నివాళి

అంబేడ్కర్‌కు ఘన నివాళి

 రెబ్బెన: (వుదయం ప్రతినిధి) రాజ్యంగ నిర్మాత డాక్టర్‌ బీఆర్‌. అంబేద్కర్‌ 59వ వర్ధంతి సందర్భంగా ఘనంగా నివాళ్ళర్పించారు.దుర్గం రాజేష్  నేతృత్వంలో రెబ్బెన మండల కేంద్రంలోని ఆదివారం నాడు అంబేద్కర్‌ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళ్ళర్పించారు. ఈ సందర్భంగా zptc బాపురావ్  అధ్యక్షులు దుర్గం హనుమంతు జండా ఏగారవేశారు అనంతరం మాట్లాడుతూ బడుగు బలహీన వర్గాల కోసం, దళితుల కోసం కృషి చేసిన మహావ్యక్తి అంబేద్కర్‌ అని కొనియాడారు. సమాజ మార్పు కోసం ఆయన ఆశయ సాధనకు ప్ర తీ ఒక్కరు కృషి చేయాలని  కోరారు.ఈ కార్యక్రమంలోదొమల పోచయ్య, దుర్గం భరత్వాజ్ , మోడెం సుదర్శన్ గౌడ్ పొట్ శ్రీదర్ రెడ్డి ,కర్నతం పెంటయ్య ,లెండుగురెగంటుమేర ,భేమేష్ ,గోడిసేలా వేంకటేశ్వరుగౌడ్,గొగర్ల రాజేష్ ,వేంకటేశం ,గొగర్లతిరుపతి .  తదితరులు పలుగోన్నారు  

Saturday, 5 December 2015

రెబ్బెన తహసిల్దార్ కార్యాలయంలో ఎక్కడి పనులు అక్కడే


రెబ్బెన తహసిల్దార్  కార్యాలయంలో ఎక్కడి పనులు అక్కడే 
 రెబ్బెన: (వుదయం ప్రతినిధి) రెబ్బెన మండలంలో తహసిల్దార్ కార్యాలయంలో ఎక్కడిపనులు అక్కడే యున్నాయని కుల నివాస ఆదాయ సర్టిఫికెట్స్ సకాలంలో ఇవ్వడంలేదు. కొత్తగా పెళ్లి సేసుకొన్న వారికి ఆహార బద్రత కొరకు  అదార్ కార్డ్ నమోదు చేయడంలేదు దరకాస్తు  పెటి 35 రోజులు ఐన పటించుకోవడంలేదు మరియు రెబ్బెన మండల ప్రజలు ఇబ్బంది పడుతున్నారాణి గంగాపూర్ కు చెందినా మల్యాల రాజేష్.పత్రిక ప్రకటనలో తెలిపారు.

భయం గుప్పెట్లో రెబ్బెన వాహన యజమానులు

భయం గుప్పెట్లో రెబ్బెన వాహన యజమానులు

 రెబ్బెన: (వుదయం ప్రతినిధి) రెబ్బెన మండల కేంద్రం లో వరుసగా దొంగతనాలు జరగడంతో భయాందోలనకు గురవుతున్నారు. శుక్రవారం రాత్రి 3 వ్యాన్ ల బ్యాటరీలు మరియి జాక్ లు దొంగతనామ్ కావడంతో స్థానిక పోలిస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. రామడుగుల శ్రీనివాస్, గందే కార్తీక్, షేక్ ఇంతియాజ్ యొక్క వాహనాలు స్థానిక  లైబ్రరీ ముందు రాత్రి ఉంచారని క్లీనర్ రాత్రి 11 గంటల వరకు కాపలా ఉన్నారని , ఆ సమయంలో 3 వ్యక్తులు వాహన సమీపంలో తిరుగుతూ మాట్లాడారని తెలిపినట్లు, అనంతరం నిద్ర పోయాడని అన్నారు. తెల్లవారేసరికి వాహనాల వస్తువులు పోయాయని పేర్కొన్నారు. గతంలో కూడా రెబ్బెనలో లారీల టైర్లు, బ్యాటిరిల , వ్యాన్ల బ్యాటిరీల దొంగతనాలు జరిగాయని, పోలీసులకు వాహనదారులు ఫిర్యాదు చేసిన ఇంతవరకు దొంగలు దొరకలేదని ఆరోపించారు. ఇప్పటికైనా రెబ్బెనలో జరిగే చిల్లర దొంగాతనాలపై దృష్టి సారించి దొంగతనాలు జరగకుండా చర్యలు తీసుకోవలసిన అవసరం ఉందని రెబ్బెన ప్రజలు కోరుతున్నారు.

Friday, 4 December 2015

ఎ ఐ ఎఫ్ డి ఎస్ జిల్లా స్థయినిర్మణ సదస్సును సదస్సును విజయవంతం చేయండి

ఎ ఐ ఎఫ్ డి ఎస్  జిల్లా స్థయినిర్మణ సదస్సును సదస్సును విజయవంతం చేయండి 
రెబ్బెన: (వుదయం ప్రతినిధి) ఎ ఐ ఎఫ్ డి ఎస్  జిల్లా స్థయినిర్మణ సదస్సును జయప్రధంచేయాలని రెబ్బన అతిధి గృహంలో శుక్రవారం నాడు అఖిల భారత ప్రజాతంత్ర విద్యార్ధి సమాఖ్య అద్వర్యంలో గడపత్రాలు విదదలచెశరు.అనతరం  ఎ ఐ ఎఫ్ డి ఎస్  జిల్లా అధ్యాక్షులు మాట్లాడుతూ యూనివర్సిటిలలో రెగ్యలర్ అధ్యాపకులు 10 మది కుఆచా లేకుండా ల్యాబ్, లైబ్రరీ వసతులు తగ్గిపోయాయి. ఫలితంగా విద్యాబోధన పరిశొధననణ్యత ప్రమాణాలు క్షిణిస్తున్నాయి. విద్యా రంగంలోని సమస్యల పై నూతన ఉద్యమ పొరాఆన్ని నిర్మించుకొని విద్య ప్రైవెతీకరణకు, ప్రపమ్చికరణకు, వ్యాపారీకరణకు వ్యతిరేకంగా విద్యార్థులు వారి తల్లిదండ్రులు, ప్రజలు, ప్రజా సంగాలు అద్యాపకులు, మేధావులందరినీ సాఘటితపరచి ఉద్యామిమ్చి ప్రభుత్వ విద్యనూ పరిరక్షించుకోవమే కర్తవ్యంగా అఖిల భారత ప్రజాతంత్ర విద్యార్ధి సమాఖ్య ఈ సదస్సును నిర్వహిస్తుంది కావున 2015 డిసెంబర్ 18 మంచిర్యాల పట్టణంలో ఉ 11 గంటలకు జరుగు జిల్లా నిర్మాణ సదస్సును విజయవంతం చేయాలని కొరారు ఈ కార్యక్రమంలో. గోలేటి చరణ్, దుర్గం తులసిదాస్, శ్రీకాంత్, సంతోష్. తదితరులు పలుగోన్నారు 









ఇసిక ట్రాక్టరుల పటివేత


ఇసిక ట్రాక్టరుల పటివేత 

రెబ్బెన: (వుదయం ప్రతినిధి)  రెబ్బెన మండలంలో గంగాపూర్ లో రెండు ట్రాక్టర్ లు మరియు వంకులమలో ఒకటి  ట్రాక్టర్ స్థానిక ప్రజలు అక్రమంగా తరిలిస్తుండగ రెబ్బెన  తహశిల్దార్ రమష్ గౌడ్ అప్పగించగా తాసిల్దార్ 5000 జరిమాన విధించారాని  తహశిల్దార్ తెలిపరు. 

బి సి చైతన్య సదస్సును విజయవంతం చేయండి

బి సి చైతన్య సదస్సును విజయవంతం చేయండి 

రెబ్బెన: (వుదయం ప్రతినిధి) ఈ నెల 6 వ తేదిన ఆదివారం రోజున హైదరాబాద్ లోని బిసి ఐక్య సఘర్షణ సమితి ఆధ్యర్యంలో బిసి కులాల చితన్య సదస్సు ఉంటుందని బిసి ఐక్యా సంఘర్షణ సమితి జిల్లా అద్యక్షుడు కేసరి ఆంజనేయులు గౌడ్ అన్నారు రెబ్బన అతిధి గృహంలో శుక్రవారం నాడు విలేకర్ ల తో మాట్లడుతూ  ఈ సదస్సు బిసి ఐక్యా సంఘర్షణ సమితి జాతీయ అస్యక్షుచు విజిఅర్ నారశోని హాజర అవుతారని ఈ సదస్సులో బిసి కులాల దారు ఎదుర్కొటున్న సమస్యలిపై చర్చంచి తీర్మానం చేయడం జరుగుతుందని దేశవ్యాప్తంగా బి సి కులాలు చలో సమస్యలు ఎదుర్కోటు న్నారని ముఖ్యంగా రాష్ట్రంలో బి సి కులాల వారు చలో పేదరికంలో ఎన్నరాని బి సి వాలందరికి కళ్యాణ లక్ష్మి పధకం అమలు చేయాలనీ వాళ్ళందరికీ 3 ఎకరాలు భుమియియ్యాలి డిమాండ్ చేస్తున్నాం ఈ కార్యక్రంలో బోగే ఉపేందర్, పాలగని పర్యతాలు, మాస్క రమేష్, రామగిరి సతీష్, గజ్జెల తిరుపతి. తదితరులు పాలుగోన్నారు .

Thursday, 3 December 2015

సింగరేణి సేవ సమితి ఆద్వైర్యంలో వికలాంగుల క్రీడో త్సవాలు

సింగరేణి సేవ సమితి ఆద్వైర్యంలో  వికలాంగుల క్రీడో త్సవాలు 

రెబ్బెన: (వుదయం ప్రతినిధి) సింగరేణి సేవ సమితి ఆద్వైర్యంలో వికలాంగుల దినో త్సవం సందర్భంగా గొలెతిలొ వికలాంగులకు క్రీడల పోటీలు నిర్వహించారు గెలుపొందిన వారికి సేవా సమితి అద్యక్షురాలు అనురాధా బహుమతులు ప్రధానం చేసారు. 

సింగరేణి ఆద్వైర్యంలో సూపర్ స్పెషాలిటీ వైద్య శిబిరం

సింగరేణి ఆద్వైర్యంలో సూపర్ స్పెషాలిటీ వైద్య శిబిరం



రెబ్బెన: (వుదయం ప్రతినిధి) సింగరేణిఆద్వైర్యంలో సూపర్ స్పెషాలిటీ వైద్య శిబిరాన్ని రెబ్బెన మండల కేంద్రములో గల గోలేటిలో గురువారం నాడు జి ఎం రవి శంకర్ ప్రారంభించారు. దీనిలో కార్మికులు మరియు వారి కుటుంబ సభ్యులు పరిక్షలు చేయించుకున్నారు ఈ శిబిరం ఈ రోజు రేపు కొనసాగుతుందని తెలిపారు.  



గుడుంబా స్తావరాలపై దాడులు

గుడుంబా స్తావరాలపై దాడులు 

రెబ్బెన: (వుదయం ప్రతినిధి) రెబ్బెన మండల కేంద్రములో గల గోలేటి గ్రామా పంచాయితీ లో గుడుంబా స్టావరాలపై  ఫారెస్ట్ మరియు పోలీసు అధికారులు జరిపిన సంయుక్త దాడులలో భారీ మొత్తంలో గుడుంబాను ద్వంసం చేసారు గుడుంబాని అక్రమ రవాణా చేస్తున్న ఆరు ద్విచక్ర వాహనాలను మరియు కలప  దుంగలను కూడా   స్వాధీన పరుచుకున్నట్లు సి.ఐ. కరుణాకర్ తెలిపారు ఈ దాడులలో పట్టుబడిన నిందితులని స్తానిక తహసిల్దారు ముందు బైండోవర్ చేసినట్లు తెలిపారు.  ఈ దాడులలో ఎస్.ఐ. లు దారం సురేష్,టి. వి. రావు, డిప్యూటీ రేంజ్ ఆఫీసర్ శ్రీనివాస్ మరియు సంబందిత శాఖల సిబ్బంది పాల్గొన్నారు

సమస్యల వలయములో ఆసిఫాబాద్ రోడ్ రైల్వే స్టేషన్


           సమస్యల వలయములో  ఆసిఫాబాద్ రోడ్ రైల్వే స్టేషన్ 


               రైల్వే జి.యం కుప్రజల వినతి;
 రెబ్బెన:  (వుదయం ప్రతినిధి) 
రెబ్బన మండల కేంద్రం లోని ఆసిఫాబాద్ రోడ్  రైల్వే స్టేషన్ నైజం పాలన నుండి ఉన్నపట్టికి ఇప్పటివరకు ఎటువంటి సౌకర్యాలు లేఖ సమస్యలతో కొట్టు మిట్టడుతుంది ఆసిఫాబాద్ నియోజకవర్గం లోని ఏకైఖ రైల్వే స్టేషన్ ఎనిమిది మండలాల ప్రజలకు ఈ ఒక్క రైల్వే స్టేషన్ మాత్రమే దిక్ఖు ప్రతి రోజు సుమారు 500 మంది ఉద్యోగ రిత్య ప్రయాణం చేస్తూ ఉంటారు చదువుకొనే విద్యార్థులు సైతం ఈ స్టేషన్ నుండే ప్రయాణిస్తూ ఉంటారు మండలం లో సింగరేణి జి యం  కార్యాలయం ఉన్నందున అనునిత్యం దూరప్రాంతాలకు వెళ్ళుటకు రెబ్బన స్టేషన్ లో తెలంగాణ,న్యూ డిల్లీ ఎక్ష్ప్రెస్ మరియు జనత ఎక్ష్ప్రెస్స్ లు ఆగక పోవడంతో  ప్రయాణికులు
ఇబ్బంది పడుతున్నారు.రైల్వే స్టేషన్ ప్రయాణికులకు కాలకృత్యాలు తీర్చుకొనుటకు కనీస సౌకర్యాలు లేక నానా ఇబందులు పడుతున్నారు మొదటి ఫ్లా ట్ ఫామ్  నుండి రెండవ   ఫ్లాట్ ఫామ్ కు    వెళ్ళుటకు ఫూట్ ఫ్లై ఓవర్ లేక ప్రయాణికులు అత్యంత ప్రమాదకరంగా పట్టాల పై నుండి దాటుతున్నారు. మరియు స్టేషన్ అత్యంత సమీపంలో బొగ్గు లోడింగ్ కేంద్రం ఉన్నందున  లోడింగ్ సమయం లో సి ఎల్ గేటు వద్ద గంటల తరబడి ప్రజలు వాహన చోదకులు వేచి ఉండాల్సి వస్తుంది.ఏమర్జేన్స్ అంబులెన్సు సైతం గేటు వద్ద ఆగాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. కావున సంబందిత రైల్వే అధికారులు ఇకనైన సమస్యల పై స్పందించాలని అఖిల పక్షం అద్వర్యంలో  సమస్యలతో కూడిన  వినతి పత్రాలు అధికారికి అందజేశారు.ఈ కార్యక్రమంలో మండల  యం పి పి సంజీవ్ కుమార్,తెదేపా మండలాద్యక్షుడు  సుదర్శన్ గౌడ్. మాజీ జడ్పిటి సి పల్లె ప్రకాష్ రావు ,నాయకులూ లవుడ్య రమేష్. బొమ్మినేని శ్రీదర్ మాణిక్యరావు .పొటు  శ్రీదర్ రెడ్డి. శంకరమ్మ. ప్పెసర మధునయ్య , వెంకటమ్మ. పల్లె రాజేశ్వరావు. భీమేశ్ లక్ష్మన్. పెంటయ్య.రాజేష్ .రాజగౌడ్. ఉమేష్.భార్గవ్ .లు పాల్గోన్నారు.