Tuesday, 29 December 2015

న్యాయ విజ్ఞాన సదస్సు

న్యాయ విజ్ఞాన సదస్సు 



  (రెబ్బెన వుదయం  ప్రతినిధి) రెబ్బన కళాశాలలో మంగళవారం నాడు మండల న్యాయా సేవ సంస్థ ఆసిఫాబాద్ వారి ఆధ్వర్యంలో న్యాయ  విజ్ఞాన సదస్సును నిర్వహించారు. ఈ సందర్భంగా జూనియర్ న్యాయమూర్తి ఎన్, హేమలత మరియు సీనియర్ న్యాయమూర్తి సురేష్  మాట్లాడుతూ విద్యార్థులు చట్టాలపై అవగాహన కోసమే న్యాయ విజ్ఞాన సదస్సు ఏర్పాటు చేసినట్లు  సమాజంలో ప్రతి శాంతియుత వాతావరణంలో జీవించాలని, బాల కార్మికుల చట్టం గురించి, బాల్య వివాహాలు నేరమని, వాటిని చేసినా. సహకరించిన వారికి రూ.లక్ష జరిమానాతో పాటు రెండేళ్ల జైలుశిక్ష పడుతుందని న్యాయమూర్తి చెప్పారు. అలాగే ప్రామిసరీ నోటుపై తెలియకుండా సంతకం చేయరాదన్నారు. డబ్బు చెల్లించిన వెంటనే ప్రామిసనరీ నోటును కూడా తీకుకోవాల న్నారు. ముఖ్యంగా మహిళలు చదువులో బాగా రాణించాలన్నారు. చట్టంపై ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉన్నప్పుడే సమాజం కూడా అభివృద్ది చెందుతున్నారు.మద్యపానం నేరాలకు ప్రథమ కారణమని, ఈ వ్యసనాన్ని వీడాలని సూచించారు. అన్యాయం జరిగితే పోలీసులను ఆశ్రయించాలని అన్నారు. ఈ సదస్సులో జిల్లా మహిళా ప్రధాన కార్యదర్శి కుందారపు శంకరమ్మ ప్రిన్సిపాల్ వెంకటేశ్వర్లు, బి, సతీష్ బాబు, రవీందర్, శ్యాం రావు, కళాశాల లెక్చరర్లు, విద్యార్థులు పాల్గొన్నారు.

No comments:

Post a Comment