Tuesday, 1 December 2015

ఆసిఫాబాద్ ని జిల్లాగా ప్రకటించాలి

ఆసిఫాబాద్ ని జిల్లాగా ప్రకటించాలి 

  (రెబ్బెన వుదయం ప్రతినిధి); ఆసిఫాబాద్ ని జిల్లాగా ప్రకటించాలని జిల్లా సాదన సమితి రేగుంట కేశవ్ అన్నారు. రెబ్బెన అతిధి గృహంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశములో మాట్లాడుతూ నిజం పాలనలో  27సం;నుండి  ఆసిఫాబాద్ ని ప్రధాన కేంద్రంగా చేసుకొని సబ్ కలెక్టర్ ,న్యాయస్థానం మరియు జైలు మరెన్నో అధికారుల కార్యాలయాలు ఉన్నాయని అన్నారు. ఆదిలాబాద్ ని రెండు జిల్లాలుగా చెయ్యాలని  కొమరంభీం జిల్లాగా  ప్రకటించాలని కెసిఆర్ ఇచ్చినా మాటను నిలబెట్టుకోవాలని జిల్లాను సాదించే వరకు అన్ని కులాల వారిగా  ఉద్యమాన్ని కొనసాగిస్తామని అన్నారు.ఈ సమావేశంలో జిల్లా సాధన సహాయ కార్యదర్శి జయిర్ పాషా ,రజక సంఘ అద్యక్షుడు కడతల మల్లయ్య ,మాజీ జెడ్ పి టి సి సోమయ్య ,మాజీ సర్పంచ్ పర్వతాలు ,ఎ ఐ టి యు సి ఉపద్యాక్షుడు బోగే ఉపేందర్ ,భీమయ్య ,ఎమ్ ఆర్ పి ఎస్ నాయకులు ప్రభాకర్ ,సుధాకర్ ,శంకర్ తదితరులు పాల్గొన్నారు  

No comments:

Post a Comment