ఎమ్మెల్సీ ఏకగ్రీవం కార్యకర్తల్లో ఆనందం
ఎమ్మెల్సీ ఏకగ్రీవం కార్యకర్తల్లో ఆనందం
రెబ్బెన: (వుదయం ప్రతినిధి)
ఆదిలాబాద్ జిల్లాలో జరగబోయే ఎమ్మెల్సీ ఎన్నికల కోసం పురాణం సతీష్ ఏకగ్రీవంగా ఎన్నిక ఖాయం కావడంతో శుక్రవారం నాడు రెబ్బెన బస్టాండ్ వద్ద ప్రధాన రహదారి మీద బనసంచాలు కాల్చి జిల్లా టీఆర్‌ఎస్ పార్టీ నాయకులు ఆనందంతో మిటాయులు పంచుకొని శుభాకాంక్షలు తెలుపుకున్నారు. ఈ సందర్భంగా ఎంపిపి సంజీవ్, జడ్పిటిసి బాబురావు, జిల్లా ఉప అధ్యక్షుడు నవీన్ కుమార్ జైశ్వాల్ మాట్లాడుతూ జిల్లాలో ఏకగ్రీవంగా ఎన్నికకావడం మరోసారి టీఆర్‌ఎస్ పార్టీ జిల్లాలో బలోపేతం అయింది. ఆదిలాబాద్ ఎమ్మెల్సీ స్థానాన్ని తెరాస పార్టీ సొంతం చేసుకుందని. ఈ ఎమ్మెల్సీ స్థానానికి తెరాస అభ్యర్థిగా పురాణం సతీష్తో పాటు మిగితా అభ్యర్థులు నామినేషన్‌లు దాఖలు చేశారు. కాగా నేడు ఆ అభ్యర్థులు తమ నామినేషన్లను ఉపసంహరించు కున్నారు. దీంతో పురాణం సతీష్ నామినేషన్ ఒక్కటే మిగలడంతో ఆయన ఎన్నిక ఎకగ్రీవమైంది. కాగా నామిషన్‌కు ఈనెల 12వ తేదీ వరకు గడువు ఉన్నప్పటికీ ఈరోజే జిల్లా ఎమ్మెల్సీ స్థానం ఎకగ్రీవమవడం హర్షనీయమన్నారు. ఈ సందర్భంగా పురాణం సతీష్కి తెరాస నాయకులు శుభాకాంక్షలు తెలిపారు ప్రత్యర్థులను ధీటుగా ఎదుర్కోనే అనుభవమున్న పురాణం సతీష్ గెలుపుకు వ్యూహాత్మకంగా టీఆర్‌ఎస్ పార్టీ జిల్లా నాయకులు తమదౖౖౖెన శైలిలో ఇప్పటికే ప్రచారం మొదలు పెట్టినప్పటికీ. పురాణం సతీష్ ఏకగ్రీవంగా ఎన్నిక ఖాయం కావడం ఊహించిన పరిణామమని అన్నారు. ఈ కార్యక్రమంలో వైస్ ఎంపీపీ గోడుసేల రేణుక, సర్పంచ్ పెసరు వెంకటమ్మ, టౌన్ ప్రెసిడెంట్ రాపర్తి అశోక్, మైనార్టీ నాయకులు సలీం, అన్వర్, చోటు, మండల ఎస్సీ సెల్ అధ్యక్షుడు శ్రీనివాస్, జిల్లా మహిళా ప్రధాన కార్యదర్శి కుందారపు శంకరమ్మ, వెంకన్న గౌడ్, మధనయ్య, పల్లె రాజేశ్వర్, మహావీర్, బొమ్మినేని సత్యనారాయణ, కార్నాధం చంద్రయ్య, సోమ శేఖర్ టి,ఆర్,ఎస్ నాయకులు పాల్గొన్నారు..
No comments:
Post a Comment