అందరూ మంచితనం, సన్మార్గంలో నడవాలి
రెబ్బెన: (వుదయం ప్రతినిధి) రెబ్బెన మండలంలోని గోలిటి లో శుక్రవారం క్రిస్మస్ వేడుకలను క్రైస్తవ సోదరులు ఆనందోత్సాహాలతో ప్రజలందరూ ప్రేమ, త్యాగం, మంచితనం, సన్మార్గంలో నడిచి ఏసుప్రభువు కృపాకటాక్షములతో అందరూ కులమతాలకు అతీతంగా కలిసి మెలసి ఉండాలని ప్రార్థిస్తూ ప్రజలందరికీ జీఎమ్ రవి శంకర్ క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు. ప్రజలు చెడు మార్గాలను వీడి సన్మార్గంలో పయనించి దైవ మార్గంలో నడచినప్పుడే మనసుకు శాంతి, మనిషికి సంతృప్తి కలుగుతాయని, సన్మార్గంలో నడచి పలువురికి ఆదర్శంగా నిలచినప్పుడే జీవితానికి సార్థకత ఏర్పడుతుందని రెబ్బెన మండల తహశిల్దార్ రమేష్ గౌడ్ అన్నారు. పాస్టర్ తిమోతి, దుర్గం జనార్ధన్, లింగయ్య తదితర క్రైస్తవ సోదరులు పలుగోన్నారు.
No comments:
Post a Comment