Thursday, 31 December 2015

ఎక్కడి చెత్త అక్కడే-బోగే ఉపేందర్

ఎక్కడి చెత్త అక్కడే-బోగే ఉపేందర్


రెబ్బెన: (వుదయం ప్రతినిధి) ;; కేంద్రం స్వచ్ భారత్ పేరుతో చెత్త చెదారాన్ని శుభ్రం చేసి ఊరుకి దూరంగా పడేస్తుంటే గోలేటిలో మాత్రం దీనికి విరుద్ధంగా ఉందని అఖిల భారత యువజన సమాఖ్య జిల్లా ఉపాధ్యక్షుడు బోగే ఉపేందర్ అన్నారు. రెబ్బెన మండలంలోని గోలేటి భగత్ సింగ్ నగర్ లో ఆయన మాట్లాడుతూ గ్రామ పంచాయుతి సిబ్బంది 6 నెలల క్రితం మురికి కాలువల నుండి తీసిన చెత్తను అక్కడే ఇండ్ల ముందు రోడ్డు మిధ వేయడంతో కాలని వాసులు తీవ్ర ఇబ్బంది కి గురవుతున్నారని అన్నారు. దాని ద్వారా వచ్చే దుర్వాసనకు చిన్న పిప్రజలు అనారోగ్య పాలవుతున్నా రని ఈ విషయం గురించి సర్పంచ్, అలాగే గ్రామ పంచాయితి సిబ్బందికి ఎన్ని సార్లు చెప్పిన పట్టించు కోవడం లేదని అన్నారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి సమస్యను పరిష్కరించాలని కోరారు. ఈ సమావేశంలో  ఏ,అయ్,వై,ఎఫ్ మండల కార్యదర్శి ఎస్, సంతోష్, టౌన్ కార్యదర్శి దుర్గం తిరుపతి, టౌన్ అధ్యక్షులు మిడిగొండ లింగమూర్తి, సంతోష్, ఏ,అయ్,ఎస్,ఎఫ్ జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ దుర్గం రవీందర్ పాల్గొన్నారు. 

No comments:

Post a Comment