Thursday, 17 December 2015

గుడుంబా రహిత మండలంగా రెబ్బెన:ఎస్ ఐ .దారం సురేష్

గుడుంబా రహిత  మండలంగా రెబ్బెన:ఎస్ ఐ .దారం సురేష్ 





 రెబ్బెన: (వుదయం ప్రతినిధి); రెబ్బెన మండలంలోని గుడుంబా నాటుసారాను వందశాతం అరికడతామని రెబ్బెన ఎస్ ఐ .దారం సురేష్ అన్నారు గురువారం మాట్లాడుతూ రెబ్బెన మండలంలోని సింగలుగూడ, గోలేటి, తదితర గ్రామాలలో 90% అరికట్టామని త్వరలో 10% పూర్తి చేసి గుడుంబా రహిత మండలంగా తీర్చి దిద్దుతామని అన్నారు. గోలేటిలో 2 నెలల్లో దాడి చేసి 13 కేసులు నమోదు చేశామని, 8 మందిని బైండోవర్ చేశామని అన్నారు. అదేవిధంగా సింగలుగుడా గుడుంబా స్థావరాలను ద్వంశం చేసి బైండోవర్ చేశామని అన్నారు, గుడుంబా మహమ్మారి నిషేదానికి ప్రతివొక్కరు సహకరించాలని అన్నారు. గుడుంబా నిషేధంపై అవగాహన నిర్వనిర్వహించాలని.గుడుంబా వల్ల కుటుంబాలు చిన్న బిన్నం అవుతున్న తీరును వివరించారు.  మండలంలో చిన్న చిన్న దొంగతనాలు జరుగుతున్నాయని ఆ దొంగలను పట్టుకొని రిమాండుకు పంపుతున్నట్లు, మండలంలో అన్ని గ్రామాల మీద నిఘా ఉంచినట్లు, రాత్రి పూట బస్తీలలో గస్తి నిర్వహిస్తున్నామని తెలిపారు. 

No comments:

Post a Comment