Wednesday, 23 December 2015

ముస్థాబైన  గోలేటి భీమన్న స్టేడియం 
   

రెబ్బెన: (వుదయం ప్రతినిధి)  బెల్లంపల్లి ఏరియా లోని గోలేటి టౌన్ షిప్ లో గల భీమన్న స్టేడియం లో  నేడు నిర్వహించే సింగరేణి ఆవిర్భావ దినోత్సవ వేడుకల కోసం భీమన్న స్టేడియం ను ముస్తాబు చేసారు. ఏర్పాట్ల విషయం లో ఏలాంటి ఇబ్బందులు తలెత్తాకుండా  ఉండటానికి తగిన చర్యలు తీసుకున్నారు. సింగరేణి డే వేడుకలను ఘనం గ నిర్వహించడానికి అధికారుల పర్యవేక్షణలో  గోలేటి భీమన్న స్టేడియం కొత్త హంగులతో అంగారంగ వైభవంగా పనులను నిర్వహించడం జరిగింది. ఈ వేడుకలు ఉదయం నుండి రాత్రి వరకు జరగనున్నట్లు అధికారులు వివరించారు. ఈ కార్యక్రమానికి కార్మికుల కుటుంబాల నుంది అదిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలనీ వారు అన్నారు. ఈ కార్యక్రమానికి బెల్లంపల్లి ఏరియ జనరల్ మేనేజర్ కె.రవిశంకర్ ముక్య అధితి గా హాజరావ్తున్నారని అన్నారు. ఈ కార్యక్రమం లో సాంస్కృతిక కార్యక్రమాలతో కనువిందు చేయనున్నట్లు వారు వివరించారు. 

No comments:

Post a Comment