ఘనంగా క్రిస్మస్ వేడుకలు
రెబ్బెన మండలంలో శుక్రవారం క్రిస్మస్ వేడుకలను క్రైస్తవ సోదరులు ఆనందోత్సాహాలతో శుక్రవారం జరుపుకున్నారు. ఈ సందర్భంగా మండలంలోని గంగాపూర్, రేపల్లెవాడ, గోలేటి, నంబాలా, ఇంద్రానగర్ లలో ఏసుక్రీస్తు ప్రార్థనా మందిరాలైన చర్చిలు ప్రార్థనల తో పులకించాయి. అలాగే పలు చర్చిలలో ఫాస్టర్లు ఇచ్చిన సందేశం క్రైస్తవ సోదర ,సోదరీమణుల్లో శాంతి, దయ ,కరుణ, జాలీ అనే అంశాలు ప్రభావితం చేసేవిధంగా వున్నాయి. దీంతోపాటు చర్చిలను పలు ప్రాంతాల్లో అత్యంత సుందరంగా తీర్చిదిద్దారు. కాగా పలువురు పాస్టర్లు అబాగ్యుల కోసం, ప్రపంచం అంతా ప్రశాంతంగా వుండాలని, ప్రకృతి వైపరిత్యాలనుంచి, మత ఘర్షణల నుంచి, కుల, జాతి విబేధాల వల్ల ప్రజలకే కాదు ఏప్రాణికి నష్టం, కష్టం కలుగకూడదని, ప్రతి ఒక్కరూ కరుణ. జాలి కలిగి ఇతరులను ఇబ్బంది పెట్టకుండా తాను సంపాదించిన సొమ్ములో కొంతైనా దానం చేసి పేద ప్రజలను ఆదుకోవాలని, సమాజ సేవలో పాలుపంచుకోవాలని, క్రీస్తు చూపిన మార్గంలో ప్రయాణించి శాంతి మార్గంలో ప్రతి ఒక్కరూ నడుచుకోవాలని సూచించారు. కాగా ఈ వేడుకల్లో శాంతా క్లాజ్ వేషదారణలో వున్న క్రైస్తవ సోదరులు చిన్న పిల్లలకు ప్రత్యేక ఆకర్షణగా నిలవగా, వేషదారణలో వున్న వారు స్వీట్లు, బిస్కెట్లు పంచిపెట్టారు.
No comments:
Post a Comment