Wednesday, 23 December 2015

సింగరేణి ఆవిర్బావ దినోత్సవ వేడుకలు ఘనంగా

సింగరేణి  ఆవిర్బావ దినోత్సవ వేడుకలు ఘనంగా 


రెబ్బెన: (వుదయం ప్రతినిధి)  బెల్లంపల్లి ఏరియా లోని గోలేటి టౌన్ షిప్ లో గల భీమన్న మైదానంలో సింగరేణి డే వేడుకలు అట్టహాసంగా ప్రారంభమయ్యాయి.  బెల్లంపల్లి ఏరియ జనరల్ మేనేజర్ కె.రవిశంకర్  బెలూన్లను ఎగురవేశారు. అనంతరం అక్కడ ఏర్పాటు చేసిన స్టాళ్లను ప్రారంభించారు. సింగరేణి  చరిత్రను, ప్రగతి, విజయాలను చాటిచెప్పే విధంగా ఏర్పాటు చేసిన స్టాళ్లు అందరినీ ఆకట్టుకుంటున్నాయి.వివిధ విభాగాల్లో సేవలు అందించిన కార్మికులు సేవాసమితి  బహుమతులు ప్రధానం చేసరు  అనంతరం ఆయన మాట్లాడుతూ సింగరేణి యాజమాన్యం కర్మికులుపైనే కాకుండా కార్మికుల కుటుంబాల సంక్షేమం పట్ల ప్రత్యేక శ్రద వహిస్తోంది అని అన్నారు కార్మికుడు ఇంటి వద్ద ప్రశంతగా ఉన్నపుడే ఉత్పతి పై దృష్టి సాదిస్తారని ఆయన అన్నారు కార్మికుల కుటుంబాలను దృష్టిలో ఉంచుకోని ఆరోగ్యం కోసం ఆయుర్వేద వైద్య సదుపాయములు కల్పించమని నిరుద్యోగ యువతీయువకులు స్వయం కృషితో పారిశ్రామికవేత్తలు స్వయం సంపాదకులుగా ఏదిగే అవకాశం కల్పిస్తాము అన్నారు  అనంతరం గుస్సాడి నృత్యం మరియు సంగీతసాహిత్య ,మిమిక్రి  సంస్కృత కార్యక్రమాలు జరుపుకున్నారు   ఈ కార్యక్రమలో  అధికారులు, ఉద్యోగులు  తదితర సభ్యులు  పాల్గొన్నారు.

No comments:

Post a Comment