Saturday, 5 December 2015

భయం గుప్పెట్లో రెబ్బెన వాహన యజమానులు

భయం గుప్పెట్లో రెబ్బెన వాహన యజమానులు

 రెబ్బెన: (వుదయం ప్రతినిధి) రెబ్బెన మండల కేంద్రం లో వరుసగా దొంగతనాలు జరగడంతో భయాందోలనకు గురవుతున్నారు. శుక్రవారం రాత్రి 3 వ్యాన్ ల బ్యాటరీలు మరియి జాక్ లు దొంగతనామ్ కావడంతో స్థానిక పోలిస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. రామడుగుల శ్రీనివాస్, గందే కార్తీక్, షేక్ ఇంతియాజ్ యొక్క వాహనాలు స్థానిక  లైబ్రరీ ముందు రాత్రి ఉంచారని క్లీనర్ రాత్రి 11 గంటల వరకు కాపలా ఉన్నారని , ఆ సమయంలో 3 వ్యక్తులు వాహన సమీపంలో తిరుగుతూ మాట్లాడారని తెలిపినట్లు, అనంతరం నిద్ర పోయాడని అన్నారు. తెల్లవారేసరికి వాహనాల వస్తువులు పోయాయని పేర్కొన్నారు. గతంలో కూడా రెబ్బెనలో లారీల టైర్లు, బ్యాటిరిల , వ్యాన్ల బ్యాటిరీల దొంగతనాలు జరిగాయని, పోలీసులకు వాహనదారులు ఫిర్యాదు చేసిన ఇంతవరకు దొంగలు దొరకలేదని ఆరోపించారు. ఇప్పటికైనా రెబ్బెనలో జరిగే చిల్లర దొంగాతనాలపై దృష్టి సారించి దొంగతనాలు జరగకుండా చర్యలు తీసుకోవలసిన అవసరం ఉందని రెబ్బెన ప్రజలు కోరుతున్నారు.

No comments:

Post a Comment