విద్యా రంగా సమస్యలు పరిష్కరించాలి-ఎస్,ఎఫ్,అయ్
రెబ్బెన: (వుదయం ప్రతినిధి); రెబ్బెన కస్తూరిబా గాంధీ బాలికల విద్యలయంలోని సమస్యలు పరిష్కరించాలని కోరుతూ భారత విద్యార్ధి ఫెడరేషన్ గురువారం రెబ్బెన మండల తహసిల్దార్ రమేష్ గౌడ్ కు వినతి పత్రం అందజేశారు, ఎస్,ఎఫ్,అయ్ జిల్లా సహాయ కార్యదర్శి గోదిసేలా కార్తిక్ మాట్లాడుతూ మండల కేంద్రంలో ప్రభుత్వ జూనియర్ కళాశాలాకు స్వొంత భవనం పూర్తి కాకా ఇబ్బందులకు గురవుతున్నారని, మరుగుదొడ్లు, మూత్రశాలలు, ప్రహరి గోడ నిర్మించాలని, కస్తూరిబా గాంధీ బాలికల విద్యలయంకు ప్రహరిగోడ లేకపోవడంతో విద్యార్థినులు రాత్రిపూట భయబ్రాంతులకు గురౌతున్నారు అని, ప్రణాళిక ప్రకారం భోజనం పెట్టడం లేదని వారు తెలిపారు, అదే విధంగా రాత్రి సమయంలో పాటశాల ఆవరణం లో పొలిసు పెట్రోలింగ్ చేపట్టాలని వారు డిమాండ్ చేసారు.
No comments:
Post a Comment