బీజేపీ సభ్యత్వ నమోదు కార్యక్రమం
కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా (వూదయం ప్రతినిధి) అక్టోబర్ 30 : నరేంద్ర మోదీ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలను ప్రజలకు చేరవేసి కార్యకర్తలు బిజెపి బలోపేతానికి కృషి చేయాలని గోడగోని భరత్ గౌడ్ అన్నారు. సోమవారం రెబ్బెన మండలంలోని పుంజుమేరాగూడ గ్రామంలో భారతీయ జనతా యువమోర్చా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా నూతన కార్యకర్తలు సభ్యత్వ నమోదు కార్యక్రమం చేపట్టారు. ఈ సభ్యత్వంలో గ్రామంలోని వారు భారీ ఎత్తున పాల్గొని సభ్యత్వ నమోదు జరిగిందని తెలిపారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలను ప్రయోజనాలను పేదప్రజలకు అందరికీ అందించి 2019 నాటికల్లా బిజెపి బలోపేతానికి కృషి చేయాలని సూచించారు.ఈ కార్యక్రమంలో బీజేవైఎం కార్యదర్శి సంజయ్ , కొమురంభీం జిల్లా అధ్యక్షులు జె పి పౌడెల్, జిల్లా ప్రధాన కార్యదర్శి కేసరి ఆంజనేయులు గౌడ్, అసెంబ్లీ కన్వీనర్ గుల్బమ్ చక్రపాణి, రెబ్బెన మండల అధ్యక్షులు కుందారపు బాలకృష్ణ, బీజేవైఎం జిల్లా అధ్యక్షులు జుమ్మిడి రాజేష్, బీజేవైఎం మండల అధ్యక్షులు ఇగురాపు సంజీవ్, ఆసిఫాబాద్ మండల అధ్యక్షులు ఖాండ్రే విశాల్,మధుకర్,శ్రీధర్, వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు.