Friday, 15 December 2017

ఎన్నికల హామీలను విస్మరించిన తెరాస ప్రభుత్వం

ఎన్నికల హామీలను విస్మరించిన తెరాస ప్రభుత్వం 
  కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా (వుదయం ప్రతినిధి) డిసెంబర్ 15 :సాధారణ ఎన్నికల సమయంలో విద్యారంగంలో అనేక మార్పులు తీసుకువస్తాము అని వాగ్దానాలు చేసి తీర హామీలను తెరాస విస్మరించందని ఏఐఎస్ఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి దుర్గం రవీందర్ అన్నారు. విద్యారంగంలో నెలకొన్న సమస్యలను పరిష్కరించాలని కోరుతూ శుక్రవారంనాడు రెబ్బెన మండల కేంద్రంలోని అంబేద్కర్ విగ్రహానికి ఏఐఎస్ఎఫ్ నాయకులూ వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా దుర్గం రవీందర్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం కేజీ టూ పీజీ ని అమలు చేయకుండా కాకమ్మ కధలు చెపుతూ కాలం వెల్లదిస్తున్నారని ఆరోపించారు. పెండింగులో ఉన్న ఫీజు రియింబర్స్మెంట్, ఉపకారవేతనాలను విడుదల చేయాలని డిమాండ్ చేశారు. పెండింగ్ లో ఉండడం వలన విద్యార్థులు తీవ్ర ఇబ్బందులకు గురి అవుతున్నారని అన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా వివిద శాఖలలోఉన్న ఉద్యోగుల ఖాళీలను వెంటనే భర్తీ చెయ్యాలని, ఎప్పటికప్పుడు నోటిఫికేషన్లు విడుదల చేసి రాష్ట్రంలోని నిరుద్యోగా విద్యార్థులకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలని అన్నారు. టిఆర్టీ నోటిఫికేషన్ విడుదల అసమర్థత తో ఉన్నదని,  సక్రమమైన ప్రణాళిక లేకపోవడం వలనే అనేక ఇబ్బందులు ఎదురౌతున్నాయన్నారు ప్రైవేట్,కార్పొరేట్ విద్య సంస్థలు విద్యార్థులను తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తూ, వారిని మానసికంగా వేధిస్తున్నారని, ఒత్తిడికి గురై ఆత్మహత్యలు చేసుకుంటే వాటిని నియంత్రించకుండ వాటికే ఈ ప్రభుత్వం కొమ్ముకాస్తున్నదని  అని అన్నారు. ఈ కార్యక్రమంలో ఏఐఎస్ఎఫ్ డివిజన్ కార్యదర్శి పూదరి సాయికిరణ్,జిల్లా కార్యవర్గ సభ్యులు కె.కమలాకర్, మండల అధ్యక్షుడు మలిశెట్టి మహిపాల్, మండల కారదర్శి పర్వతి సాయికుమార్, రెబ్బెన గ్రామ అధ్యక్షుడు బెజ్జంకి అనుదీప్, ప్రశాంత్, అరుణ్ సాయి తదితరులు పాల్గొన్నారు.

లంబాడీలను ఎస్ టి జాబితానుంచి తొలగించాలి ; ఆదివాసీ జాక్

లంబాడీలను ఎస్ టి జాబితానుంచి తొలగించాలి ; ఆదివాసీ జాక్
 కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా (వుదయం ప్రతినిధి) డిసెంబర్ 15 : లంబాడీలను ఎస్ టి జాబితానుంచి తొలగించాలని కోరుతూ శుక్రవారం నాడు కొమురంభీం జిల కేంద్రమైన ఆసిఫాబాద్లో అంబెడ్కర్ చౌక్ వద్ద    ఆదివాసీ జాక్ ఆధ్వర్యంలో రాష్ట్ర రోకో నిర్వహించారు. ఈ సందర్భంగా జాక్ జిల్లా అధ్యక్షులు కె  విజయ్ ,  జిల్లా  నాయకులు శంకర్ స్వామిలు మాట్లాడుతూ లంబాడీలను ఎస్ టి   జాబితా నుండి తొలగించి  ఆదివాసీ ల రాజ్యాంగబద్ధమైన హక్కులను కాపాడాలని కోరారు. నిజాం ప్రభుత్వంలో కొమురంభీం  జల్,జంగల్ జమీన్  అనే నినందంతో శాంతి యుతంగా పోరాటం చేసి సాధించి న ఆదివాసీ హక్కులను కాపాడుకోవడానికి అహింస మార్గంలోనే పోరాటం చేస్తున్నామన్నారు . కానీ లంబాడి నాయకులు రెచ్చగొట్టే ధోరణిలో ప్రవర్తిస్తున్నారన్నారు . సోషల్ మీడియాలలో ఆదివాసీలపై దుష్ప్రచారం సాగిస్తున్నారని, దీనిపై  ప్రభుత్వ వర్గాలు , పోలీసులు తక్షణమే చర్య తీసుకోని వారిని నిలువరించాలని కోరారు. శాంతియుతంగా చేస్తున్న ఈ పోరాటానికి పోలీసులు సహకరించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో ఆదివాసీ జాక్ మహిళా అధ్యక్షురాలు డి విజయ,సహాయ కార్యదర్శి ప్రమీల, గోండు మని అధ్యక్షురాలు కొట్నాక లక్ష్మి , కార్యదర్శి శకుంతల, నాయకులూ నాందేవ్, పీతాంబర్, మహేష్ మల్లేష్ తదితరులు పాల్గొన్నారు.   

Thursday, 14 December 2017

దివ్యంగుల కొరకు సదరం క్యాంపు


కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా (మా  ప్రతినిధి) డిసెంబర్ 14 :  కొమురంభీం జిల్లా ప్రభుత్వాసుపత్రిలో దివ్యంగుల కొరకు ఈ నెల 22 న సదరం క్యాంపు జిల్లా ప్రభుత్వాసుపత్రి సూపరింటెండెంట్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నట్లు జిల్లా పాలనాధికారి చంపాలాల్ గురువారం ఒక  ప్రకటనలో తెలిపారు. జిల్లా లోని దివ్యానుగులందరు ఈ సదవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ క్యాంపు కు హాజరయ్యే దివ్యంగుల అవసరాల కొరకు స్వచంద సంస్థలు ముందుకు వచ్చి సేవలు అందించాలని కోరారు. సదరం క్యాంపు కు వచ్చే దివ్యంగులు తమ వెంట రెండు ఫోటోలు, ఆధార్ కార్డు నకలు పై ఫోన్ నెంబర్ వ్రాసి తెచ్చుకోవాలని అన్నారు. 



శ్రమ శక్తి సంఘాలలో మార్పులు చేర్పుల కు అవకాశం

 కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా (మా  ప్రతినిధి) డిసెంబర్ 14 :   శ్రమ శక్తి  సంఘం లో సభ్యుల మార్పులు చేర్పులకు  ముఖ్యమైన సూచికలు జారీచేసినట్లు ఏ  పి  ఒ  కల్పనా గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. గత మూడు సంవత్సరాలు గ శ్రమశక్తి సంఘము లలో మార్పులు చేర్పులకు  అవకాశము లేదని,ఈ సంవత్సరం ఈ అవకాశాన్ని కల్పిస్తున్నట్లు తెలిపారు. శ్రమ శక్తి సంఘం లో గల సభ్యులందరూ పని చేయుట లేదు దాంతో కనీసఁ కూలీ రేటు తగ్గుతుంది.ప్రతి శ్రమ శక్తి సంఘం లో 20 నుండి40 మంది కూ ళీల కు అవకాశం ఉందని ఇంతవరకు శ్రమ శక్తి సంఘం లో కూలీల సంఖ్య యెక్కువ పనికి వచ్చు వారి సంఖ్య తక్కువ  ఉండేదని దాంతో మస్టర్ రోల్ నిర్వహణ ఇబ్బంది గ ఉండేదని  . సీజన్లో FA కు మస్టర్ నిర్వహణ ఇబ్బందిని తగ్గించుటకు గ్రూప్ పునర్విభజన  తప్పనిసరి అయిందని . దీంతో పని ప్రదేశం లో వసతుల కల్పన కు అనువుగా ఉంటుంది.అని అన్నారు. క్షేత్ర స్థాయి సిబ్బంది కి డిమాండ్ తీసుకొనటం, పనిని కేటాయింపు మరియు పే ఆర్డర్  జనరేషన్  కు అనుకూలముగా ఉంటుందని ఈ ఆర్ధిక సంవత్సరం లో అనగా ఏప్రిల్ 2017 నుండి ఇప్పటి వరకు కనీసం 5 రోజులైనా పనిచేసిన కూళీలు శ్రమ శక్తి సంఘం లోకి మారవచ్చు.ఖచ్చితముగా ప్రతి  శ్రమ శక్తి సంఘం కు కొత్త మేట్  ఎంపిక తప్పనిసరి.అని  50 % మంది మహిళ మేట్స్ తప్పనిసరి.మరియు ఓక కుటుంబ సభ్యులంతా ఓకె శ్రమ శక్తి సంఘం లో ఉండవచ్చు.2014 ఏప్రిల్ నుండి ఇంతవరకు అసలే పనికి వేళ్ళని శ్రమ శక్తి సంఘం రద్దు చేయబడును తక్కువ పని దినాలు నమోదైన శ్రమ శక్తి సంఘం కూడ రద్దు చేయబడును అని తెలిపారు. శ్రమశక్తి సంఘం లో నమొదైనప్పటికి పనికి వేళ్ళని కూలీల పేర్లు సంఘం జాబితా  లో కనపడవు.శ్రమశక్తి సంఘం లో ఏ తెగ కు చెందినవారు 50% కంటే పైబడి ఉన్నారో ఆ తెగ కు సంబంధించిన వారిని మాత్రమే మేట్ గ ఎంపిక చేసుకోవాలని  మొదటి గ్రూప్ కు చెందిన మెట్ మహిళా అయితే ఆటోమేటిక్ గ రెండవ గ్రూప్ మెట్ పురుషులు ఉంటారని అన్నారు.  ఒకవేళ   అవినీతి అక్రమాలకూ పాల్పడినట్టు సామాజిక తనిఖీ లేదా ఇతర మార్గాల ద్వార తెలిసిన వ్యక్తి మెట్   యొక్క జాబ్ కార్డు రద్దు చేయబడును అని తెలిపారు. 

విధినిర్వహణలోఉపాధ్యాయలు అలసత్వం తగదు



 కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా (మా  ప్రతినిధి) డిసెంబర్ 14 : ఉపాధ్యాయ వృత్తి చాల పవిత్రమైనదని  దానిలో అలసత్వం ప్రదర్శించరాదని వరంగల్ రీజినల్ జాయింట్ డైరెక్టర్ పి . ప్రవీణ్ అన్నారు. గురువారం రెబ్బెన జిల్లా పరిషత్ పాఠశాలను   ఆకస్మికంగా తనిఖీచేసి ఆయన పాఠశాల రికార్డులను, విద్యార్థుల హాజరును పరిశీలించారు. మధ్యాహ్న భోజన పథకం అమలుతీరును సంబంధిత ఏజెన్సీ ని, విద్యార్థులను అడిగి తెలుసుకొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉపాధ్యాయులు తప్పని సరిగా పాఠ్య  ప్రణాళికకు సంబందించిన యూనిట్, సిలబస్ ను తయారు చేసుకోవాలని అన్నారు. అనంతరం గంగాపూర్ ఉన్నత పాఠశాలని సందర్శించారు. ఈ కార్యక్రమంలో మండల విద్యాధికారి వెంకటేశ్వర స్వామి, పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు స్వర్ణలత తదితరులు పాల్గొన్నారు. 

Wednesday, 13 December 2017

గణిత టాలెంట్ టెస్ట్ లో ప్రతిభ కనబరిచిన జెడ్ పి హెచ్ ఎస్ విద్యార్థి


  కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా (మా ప్రతినిధి) డిసెంబర్ 13 :  కొమురంభీం జిల్లా  రెబ్బెన మండలం గణిత టాలెంట్  జిల్లా పరిషత్ పాఠశాల 10 వ తరగతి విద్యార్థి  గట్టు వంశీ   గణిత టాలెంట్ టెస్ట్ లో  ప్రతిభ కనబరిచి  మండల టాపర్ గ  నిలిచాడు. అంతేకాకుండా   జిల్లా స్థాయిలో నిర్వహించిన గణిత టాలెంట్ టెస్ట్ లో  తృతీయ స్థానాన్ని సాధించి రాష్ట్ర స్థాయి గణిత టాలెంట్ టెస్టుకు  అర్హత సాధించినందుకు పాఠశాల ప్రధానోపాధ్యాయులు స్వర్ణలత హర్షం వ్యక్తం చేసారు. , గణిత ఉపాధ్యాయులు మొగిలి, పార్వతి మరియు ఇతర ఉపాధ్యాయులు వంశీని అభినందించారు. ఈ సందర్భంగా  .  ఇతర విద్యార్థులు కూడా వంశీని ఆదర్శంగా తీసుకుని మంచి మార్కులతో పాసయి తల్లిదండ్రులకు గురువులకు సమాజానికి మంచి పేరు తెచ్చిపెట్టాలని ప్రధానోపాధ్యాయురాలు  పిల్లలకు ప్రార్థన సమయంలో సందేశం ఇచ్చారు.

ప్రపంచ తెలుగు మహాసభల సందర్భంగా తెలుగు పండితురాలికి ఘనసన్మానం

  కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా (మా ప్రతినిధి) డిసెంబర్ 13 : సింగరేణి పాఠశాలలోని  తెలుగు పండితురాలు శోభారాణిని టి ఆర్ ఎస్ వి ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించారు. బుధవారం గోలేటి లో ప్రపంచ తెలుగు మహా సభలను పురస్కారించుకొని  టి ఆర్ ఎస్ వి రాష్ట్ర అధ్యక్షులు జల్లు శ్రీనివాసరావు పేలుపు మేరకు జిల్లా ప్రధానకార్యదర్శి మాలరాజ్ శ్రీనివాసరావు మరియు జిల్లా కోఆర్డినేటర్ మస్క రమేష్  లు  మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం లో మొట్ట మొదటిసారిగా ప్రపంచ తెలుగు మహా సభలను తెలంగాణ రాష్ట్రంలో నిర్వహించుకోవడం గర్వకారణమన్నారు. మహాసభలను రాష్ట్ర ముఖ్యమంత్రి అంగరంగవైభవంగా నిర్వహించనున్నారని అన్నారు.తెలుగు  భాషను మరియు తెలంగాణ సాంస్కృతిని ప్రపంచ నలుమూలల చాటే విదంగా తెలుగు మహాసభలను   నిర్వహించడానికి  తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైందని  అన్నారు.  ఈ కార్యక్రమంలో  మొర్లే నరేందర్,  నాయకులు దుర్గం భరద్వాజ్ పార్వతి అశోక్  రాజ్ కుమార్ .రాజేందర్ తిరుపతి కళ్యాణ్ సునీల్ పాల్గొన్నారు.

క్రీడలలో ప్రతిభకనబరచిన సింగరేణి పాఠశాల విద్యార్థిని విద్యార్థులు


  కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా (మా ప్రతినిధి) డిసెంబర్ 13 : బెల్లంపల్లి ఏరియా గోలేటిలో వివిధ క్రీడలలో రాష్ట్రస్థాయి, మరియు జాతీయ స్థాయి పోటీలలో ప్రతిభ కనబర్చిన సింగరేణి ఉన్నత పాఠశాల  విద్యార్థిని విద్యార్థులను   బెల్లంపల్లి   ఏరియా జనరల్ కె రవిశంకర్ మరియు ఏరియా డిప్యూటీ జీఎం పర్సనల్ జూపాక కిరణ్ అభినందించారు. డిసెంబర్ ఐదు  ఆరు తేదీలలో   అసిఫాబాద్ లో   నిర్వహించబడిన జవహార్లాల్ నెహ్రూ నలభై అయిదు వ జిల్లా స్థాయి సైన్స్ మాథెమాటిక్స్  అండ్ ఎన్విరాల్మెంట్ ఎగ్జిబిషన్  2017-18 లో సీనియర్ విభాగంలో గోలేటిలోని  సింగరేణి  ఉన్నత పాఠశాల  పదవ తరగతి విద్యార్థి అప్పాల  ప్రశాంత్  వేస్ట్  మేనేజ్మెంట్  అండ్ వాటర్ బాడీ కన్సర్వేషన్  విభాగంలో నీటి వనరుల  సంరక్షణలో భాగంగా మన ఊరు మన చెరువు ప్రదర్శించిన ప్రాజెక్టు ప్రథమ బహుమతి సాధించి డిసెంబర్  19-22  వరకు వరంగల్లో నిర్వహించే రాష్ట్రస్థాయి సైన్స్ ఎక్సిబిషన్ కు ఎంపిక అయినాడు. స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ అఫ్ ఇండియా వారి ఆధ్వర్యంలో మహబూబ్నగర్ జిల్లా కురవిలో డిసెంబర్ 4-6 తేదీలలో జరిగిన పోటీల్లో అండర్  17 విభాగంలో 10వ తరగతి విద్యార్థిని  స్వర్ణలత జాతీయ స్థాయి పోటీలకు ఎంపికయ్యారు. అలాగే  నలభై అయిదవ సబ్   జూనియర్  అంతర్ జిల్లాల సాపాక్ తక్రా  చాంపియన్ షిప్  రెండువేల పదిహేడు (బాలుర, బాలికల ) విభాగంలో నిజామాబాద్ లో డిసెంబర్  7-10 తేదీలలో  నిర్వహించబడిన సాపక్   తక్రా విభాగంలో సింగరేణి కాలరీస్ ఉన్నత  పాఠశాల గోలేటి నుండి ఏడు గురు విద్యార్థులు, 5 గురు  విద్యార్థినిలు  పాల్గొన్నారు వీరిలో బాలికల విభాగం నుండి ఏడవ తరగతి విద్యార్థులు ఆర్ శరణ్య మరియు వి ప్రవళిక జాతీయ స్థాయి పోటీలకు ఎంపికయ్యారు.  అరవై మూడో సీనియర్ అంటారా జిల్లాల  తెలంగాణ రాష్ట్ర బాల్ బాట్ మెంట్ చాంపియన్ షిప్ 2017-18    బాలికల విభాగంలో డిసెంబర్ తొమ్మిది పదవ తేదీల్లో నిజామాబాద్ జిల్లాలో ఆర్మూర్ జరిగిన పోటీల్లో సింగరేణి కాలరీస్ ఉన్నత పాఠశాల గోలేటి విద్యార్థులు ఎనిమిది మంది పాఠశాల తరపున పాల్గొని ద్వితీయ స్థాయి కైవసం చేసుకున్నారు వీరిలో పదవతరగతి విద్యార్థినికి అంజలి తొమ్మిదో తరగతి విద్యార్థిని డి శ్రావణి జాతీయ స్థాయి పోటీలకు ఎంపికైనా వీరిద్దరూ హర్యానా రాష్ట్రంలో జరగబోయే పోటీల్లో పాల్గొంటారు.  ఈ పోటీలలో పాల్గొని  రాష్ట్రస్థాయి,జాతీయ స్థాయి   పోటీలో ఎంపికైన విద్యార్థిని  విద్యార్థులను వారికీ   తోడ్పడిన పాఠశాల ఉపాధ్యాయులను  బెల్లంపెల్లి ఏరియా  జనరల్ మేనేజర్ కె రవిశంకర్  మరియు డిప్యూటీ జనరల్ మేనేజర్ పర్సనల్ జూపాక కిరణ్  మరియు పాఠశాల కరెస్పాండంట్  ప్రత్యేకంగా అభినందించారు.  ఆటపాటల లోనే  కాకుండా చదువులో కూడా ప్రత్యేక గుర్తింపు తెచ్చుకోవాలని  కోరారు. ఈ కార్యక్రమంలో పాఠశాల హెడ్ మాస్టర్   వెంకటేశ్వర్లు,  సీనియర్ ఉపాధ్యాయులు  శ్రీనివాసరావు,   మూర్తి,  పి  ఈ  టి  కె భాస్కర్ ,ఏ రాజేశ్వర్ తదితరులు పాల్గొన్నారు. 

Tuesday, 12 December 2017

ప్రపంచ తెలుగు మహా మహాసభలు 2017 కు ఏర్పాట్లు

ప్రపంచ తెలుగు మహా మహాసభలు  2017 కు ఏర్పాట్లు 
 కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా (మా ప్రతినిధి) డిసెంబర్ 12 : ప్రపంచ తెలుగు మహా మహాసభలో 2017 సందర్భంగా  చీఫ్ సెక్రటరీ ఆదేశాల మేరకు హైదరాబాద్లో జరిగే వేడుకలలో పాల్గొనడానికి  ఆసక్తి గలవారు సాహితీవేత్తలు,  కళాకారులు,   తెలుగు భాషా అభిమానులు  ప్రజాప్రతినిధులు మొదలైన వారు సంబంధిత మండల విద్యాధికారి కార్యాలయంలో బుధవారం సాయంత్రం ఐదు గంటల్లోగా తమ పేర్లు నమోదు చేసుకోవాలని జిల్లా పాలనాధికారి చంపాలాల్ వీడియో కాన్ఫరెన్స్లో మంగళవారం తెలిపారు. రోడ్డు మార్గం గుండా ప్రయాణించే వారికీ  బస్ సౌకర్యం కలదని, కాగజ్ నగర్, ఆసిఫాబాద్,   జైనూర్, కౌటాల,  తదితర ప్రాంతాల నుంచి హైదరాబాదు  సౌకర్యం కల్పిస్తున్నామని ఆయన తెలిపారు ఆసక్తి కలవారు ఈ నెల పదిహేనవ  తేదీ నుంచి పంతొమ్మిదిన మహాసభలు ముగిసేంవరకు  హైదరాబాద్ లో జరిగే కార్యక్రమాల్లో  పాల్గొనవచ్చని తెలిపారు.  అదే విధంగా బుధవారం నాడు జిల్లా కేంద్రంలో జరిగే ప్రపంచ తెలుగు మహాసభలకు జిల్లా కలెక్టరేట్లో జరుగుతాయని ఉదయం పది గంటల నుంచి ర్యాలీ, రెండు గంటల నుండి సాహిత్య సాంస్కృతిక కార్యక్రమాలు జరుగుతాయని అన్నారు.  అన్నిశాఖల అధికారులు మరియు సాహితీ ప్రియులు భాషా అభిమానులు కవులు కళాకారులు విద్యార్థులు ప్రజాప్రతినిధులు ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు ఈ వీడియో కాన్ఫరెన్స్లో  జిల్లా సంయుక్త  పాలనాధికారి అశోక్ కుమార్, సిపిఓ కృష్ణయ్య ,డిఇవో రఫిక్,  జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు

లంబాడిల చలో హైదరాబాద్ ను జయప్రదం చేయండి

 లంబాడిల చలో హైదరాబాద్ ను జయప్రదం చేయండి 

  కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా (మా ప్రతినిధి) డిసెంబర్ 12 : తెలంగాణ లంబాడి శంఖరావం  బహిరంగ సభ  రేపు జరుగనున్న నేపథ్యంలో లంబాడి  సోదరులు భారీగా సభకు హాజరు కావాలని  గిరిజన నిరుద్యోగ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గుగ్లోత్ గోవింద్ నాయక్ పిలుపునిచ్చారు. మంగళవారం రోజున  రెబ్బెన మండలం గోలేటిలో శంఖారావం గోడప్రతులను లంబాడి కులస్థులు విడుదల చేసారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతు తెలంగాణలోని 31 జిల్లాలలో 25 లక్షల మంది లంబాడీలు ఉన్నట్లు, ఎన్నో ఏళ్లుగా కలసి మెలిసి ఉంటున్న ఆదివాసీలు, లంబాడి లను విడదీయడానికి జరిగిన కుట్రలో భాగంగానే కొద్దికాలంగా లంబాడి లపై విమర్శలు చేస్తున్నారని, దీనిని ప్రజలకు వివరించడానికి అహింసాయుత  మార్గంలో .మహాసభ జరపడానికి నిశ్చయించామన్నారు. తెలంగాణ వ్యాప్తంగా ఉన్న లంబాడీలు పెద్ద సంఖ్యలో మహాసభలో పాల్గొని  జయప్రదంచేయాలని కోరారు. గోడప్రతులు విడుదల చేసిన వారిలోగణేష్ లాల్, ఇందల్ సింగ్,హరి, ప్రకాష్,  రమేష్, రవి, సుబ్బారావు, ప్రేమ్ జాదవ్   పాల్గొన్నారు. 

Monday, 11 December 2017

సమిష్టి సమన్వయము తో ముందుకు వెళ్ళాలి – జిల్లా ఎస్పి సన్ ప్రీత్ సింగ్

సమిష్టి సమన్వయము తో ముందుకు వెళ్ళాలి – జిల్లా ఎస్పి సన్ ప్రీత్ సింగ్

 కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా (వుదయం ప్రతినిధి) డిసెంబర్ 11: ప్రజా సమస్యలపై  సమిష్టి సమన్వయము తో పరిష్కారమార్గము ను చూపాలని జిల్లా ఎస్పి సన్ ప్రీత్ సింగ్ తెలిపారు సోమ వారం స్థానిక పోలీస్ ప్రధాన కార్యాలయము లో   గ్రివేన్స్ డే ను నిర్వహించిన జిల్లా ఎస్పి ప్రజా ఫిర్యాదులను ఫిర్యాదు దారుల  నుంచి నేరుగా స్వీకరించారు, ప్రజా ఫిర్యాదు విబాగం లో  ఆసిఫాబాద్ పట్టణం కు చెందిన రాచర్ల లక్ష్మయ్య s/o విశ్వనాధ్  తన యొక్క స్వాదినం అయిన 5 ఎకరాలు భూమి ను మరియు 19 లక్షల రూపాయలను మోసగించి అన్యులు తీసుకున్నారని వారి పైన తగు చర్య తిసుకోవలసింది గా జిల్లా ఎస్పి ను కోరారు.ఈస్గం మండలం కు చెందిన  భుమాకర్ తుకారం తనకు చెందిన భూమిను అన్యులు ఆక్రమించుకొని తన పైన మరియు కుటుంబ సబ్యుల పైన దాడులకు దిగుతున్నారని జిల్లా ఎస్పి కు ఫిర్యాదు చేశారు పై ఫిర్యాదుల పైన స్పందినచిన జిల్లా ఎస్పి బాదితులకు న్యాయం జరిగే చర్య లను తీసుకుంటామని జిల్లా ఎస్పి హామీ ను ఇచ్చారు. ఈ కార్యక్రమము లో ఎస్పి సిసి శ్రీనివాస్ , పోలీస్ ప్రధాన కార్యాలయ ఏ.ఓ ప్రహలద్  సినియర్ అసిస్టెంట్ సూర్య కాంత్ ,ఇంతియాజ్, కిరణ్ కుమార్ , ఫిర్యాదుల విబాగం అధికారిని సునీత మరియు  పీ ఆర్ ఓ మనోహర్ లు పాల్గొన్నారు.

నక్సలైట్ల పేరుతో బెదిరింపులకు పాల్పడిన వ్యక్తుల అరెస్టు

నక్సలైట్ల పేరుతో బెదిరింపులకు పాల్పడిన వ్యక్తుల అరెస్టు
 కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా (వుదయం ప్రతినిధి) డిసెంబర్ 11: నక్సలైట్ల పేరుతో లక్ష రూపాయలు డిమాండ్ చేసి బెదిరింపులకు పాల్పడిన వ్యక్తులను సోమవారం కస్టడీలోకి తీసుకున్నట్లు కుమ్రంభీం జిల్లా ఎస్పీ సన్ ప్రీత్ సింగ్ ఏర్పాటు చేసిన సమావేశంలో తెలిపారు. తిర్యాని మండలం మంగి గ్రామపంచాయతి నందు మిషన్ భగీరథ పనులు నిర్వహిస్తున్బ ఎల్&టి కంపెనీకి చెందిన సబ్ కాంట్రాక్టర్ వెంకటరావు ను నక్సలైట్లమని బెదిరించి లక్ష రూపాయలు డిమాండ్ చేసి ఆరువేల రుపాయలను బలవంతంగా తీసుకున్నారని, ఈ విషయం ఎక్కడ చెప్పిన చంపెస్తామాని అనడంతో భాదితుడు భయాందోళనకు గురి అయ్యాడు అని పేరుకున్నారు. భాదితుడి ఫిర్యాదు మేరకు పోలీసులు అనుమానం ఉన్న ఆసిఫాబాద్ జన్కాపూర్ వాసి అయిన షేక్ రజాక్ హుస్సేన్ ను అదుపులోకి తీసుకుని విచారించగా కాగజ్‌నగర్‌ కు చెందిన బావండ్లపల్లి ప్రసాద్ నేను కలిసి నెరమునకు పాల్పడినట్లు ఒప్పుకున్నారు. వారి వద్ద నుండి 5వేల రూపాయలు స్వాదీనం చేసుకున్నామని పోలీసు అధికారులు తెలిపారు.  కేసును 24గంటల్లో చేదించిన తిర్యాని ఎస్ఐ శ్రీనివాస్ ను మరియు సిబ్బంది ని ఎస్పీ అభినందించారు.

ఈ నెల 13న జిల్లా కేంద్రంలో తెలుగు మహాసభలు

ఈ నెల 13న  జిల్లా కేంద్రంలో తెలుగు మహాసభలు 

  కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా (వుదయం ప్రతినిధి) డిసెంబర్ 11: ప్రపంచ తెలుగు మహాసభలు-2017 సందర్భంగా కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలో ఈ నెల 13వ తేదీన నిర్వహించనున్నట్లు జిల్లా పరిపాలన అధికారి ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 13వ తేదీ(బుధవారం)రోజున ఉదయం 10 గంటలకు ర్యాలీ నిర్వహించనున్నట్లు, ఈ ర్యాలీ అంబేడ్కర్  చౌక్ నుండి ప్రారంభమై వివేకానంద చౌక్ మరియు గాంధీ చౌక్  మీదుగా కుమ్రంభీం  చౌక్ వద్ద ముగుస్తుందని తెలిపారు. అనంతరం మధ్యాహ్నం 2గంటల నుండి జిల్లా కలెక్టరేట్ ఆవరణలో తెలుగు మహాసభల్లో సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. కార్యక్రమంలో భాగంగా మొదట కవి సమ్మేళనం, సాహితీ గోష్ఠి, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందని అనంతరం కవులు, కళాకారులకు సన్మానాలు ఉంటాయన్నారు. విద్యార్థులకు బహుమతుల ప్రధానోత్సవం ఉంటుందన్నారు. ఈ ర్యాలీలో జిల్లా అధికారులు, తెలుగు పండితులు, కవులు, కళాకారులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు  పాల్గొంటరని తెలిపారు. కవులు మరియు కళాకారులు 13వ  తేదీన ఉదయం కలెక్టర్ కార్యాలయానికి చేరుకోవాలన్నారు.

ఈత చెట్లను నరికిన వారి పై కఠిన చర్యలు తీసుకోవాలి

ఈత చెట్లను నరికిన వారి పై కఠిన చర్యలు తీసుకోవాలి



  కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా (వుదయం ప్రతినిధి) డిసెంబర్ 11 : మిషన్ భగీరథ పనుల్లో భాగంగా రెబ్బెన మండలంలోని గోలేటి కి వెళ్లే ప్రధాన రహదారి పక్కన   ఈత చెట్లను ఎలాంటి అనుమతి లేకుండా సంబంధిత కాంట్రాక్టరు అక్రమంగా నరుకుతుండగా గీత కార్మికులు పనులను అడ్డుకున్నారు. అప్పటికే 15 ఈత చెట్లను తొలగించారు. దీనితో గౌడ కుటుంబాలు ఉపాధి కోల్పోయాయని  జిల్లాలోని  ఉన్నతాధికారులు, ఎక్సైజ్ అధికారులు  చెట్లను తొలగించిన వారిని వెంటనే అరెస్టు చెయ్యాలని గీత కార్మికులు డిమాండ్ చేసారు. ఈ సందర్భాంగా వారు మాట్లాడుతూ చెట్లను తొలగించేందుకు ఉపయోగించిన  ప్రోక్లైన్ ను  సిజ్ చెయ్యాలని గీత కార్మికులకు న్యాయం చేయాలని తెలంగాణ గౌడ జన హక్కుల పోరాట సమితి డిమాండ్ చేసింది.పనులను అడ్డుకున్న వారిలో తెలంగాణ గౌడ జన హక్కుల పోరాట సమితి రాష్ట్ర కార్యదర్శి కేసరి ఆంజనేయులుగౌడ్, మండల కార్యదర్శి చెపురి వెంకటస్వామిగౌడ్, గోలేటి గీత కార్మిక సంఘం అధ్యక్షులు కేసరి సాయగౌడ్, గట్టు ప్రభాకర్ గౌడ్, అరిగెల మదుకర్ గౌడ్, కేసరి నారాయణ గౌడ్, కేసరి కైలాసం గౌడ్, మలిశెట్టి కిష్టయ్య తదితరులు పాల్గొన్నారు.  

ప్రజా సమస్యలను పరిష్కరించడంలో అధికారులు ఉత్సాహంగా ఉండాలి : జిల్లా పాలనాధికారి చంపాలాల్

ప్రజా సమస్యలను పరిష్కరించడంలో అధికారులు ఉత్సాహంగా ఉండాలి : జిల్లా పాలనాధికారి చంపాలాల్ 


 కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా (వుదయం ప్రతినిధి) డిసెంబర్ 11 :    ప్రజా ఫిర్యాదులను పరిష్కరించడంలో  అలసత్వం వహించకుండా వెంటనే పరిష్కరించాలని జిల్లా పాలనాధికారి ఎం.చంపాలాల్ జిల్లాలోని వివిధ శాఖల అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్ లో  నిర్వహించిన ప్రజా ఫిర్యాదుల దినోత్సవంలో భాగంగా పాలనాధికారి ప్రజల నుండి అర్జీలను స్వీకరించారు.  ప్రజల నుండి వచ్చిన ఫిర్యాదులను ఆయా సంబంధిత శాఖల అధికారులు సత్వరమే పరిష్కరించాలన్నారు. దహెగాం  మండలం గిరివెల్లి గ్రామానికి చెందిన ఇస్తారు తన భూమిని వేరే వ్యక్తులు కబ్జా  చేసుకున్నారని  తనకు న్యాయం చేయాలని వినతి  ఇవ్వగా, గొడిచెర్ల నివాసి అయిన సుశీల తన స్వంత భూమిని వేరే వారు ఆక్రమించుకున్నారని తన భూమిని తనకు ఇప్పించవలసిందిగా అర్జీ సమర్పించింది. ఈ ప్రజా ఫిర్యాదుల్లో సుమారుగా ముప్పై మంది  అర్జీలు పెట్టున్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా సంయుక్త పాలనాధికారి అశోక్ కుమార్, ఆర్డీఓ కదం సురేష్,  జిల్లా అధికారులు,  ఆర్జీదారులు తదితరులు పాల్గొన్నారు.

Sunday, 10 December 2017

శ్వశాన వాటిక ఏర్పాటుకు అధికారుల నిర్లక్ష్యం : ఖాండ్రే విశాల్

శ్వశాన వాటిక ఏర్పాటుకు అధికారుల నిర్లక్ష్యం : ఖాండ్రే  విశాల్ 
    కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా (వుదయం ప్రతినిధి) డిసెంబర్ 10 :  కిందిస్థాయి అధికారుల నిర్లక్ష్యంతో శ్వశాన వాటిక ఏర్పాటుకు గ్రహణం పట్టిందని హిందూ సాధన సమితి అధ్యక్షులు ఖాండ్రే   విశాల్ అన్నారు. ఆసిఫాబాద్ లో ఆదివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ స్మశాన వాటిక కోసం రిలే నిరాహారదీక్షలు చేయడం తో అధికారులు, రాజకీయ నేతలు త్వరలోనే భూమిని కేటాయించి శ్మశానవాటిక నిర్మిస్తామని హామీ ఇచ్చి  రిలే నిరాహార దీక్షలను విరమింపచేశారన్నారు. సుమారు రెండేళ్లు  కావస్తున్నా ఇంతవరకు ఈ విషయంలో  ఎలాంటి పురోగతి లేదన్నారు. ఈ విషయమై జిల్లా పాలనాధికారి చంపాలాల్ ను సంప్రదించగా సంబంధిత అధికారులకు సిఫారసు పంపగా కింది స్థాయి అధికారులు అలసత్వం ప్రదర్శిస్తున్నారన్నారు. ఇప్పటికైనా జిల్లా అధికారులు సత్వరమే స్పందించి స్మశానవాటికను త్వరలో మంజూరు చేయకపోతే  మళ్లి  ఆందోళన బాట పడతామని అన్నారు. ఈ కార్యక్రమంలో గుండా శంకర్, మొండయ్య, శ్యామ్, శ్రీనివాస్, ఉపేందర్, ఈశ్వర్, రాజయ్య, సత్యనారాయణ, హరీష్, రాజ్ కుమార్, కార్తీక్ తదితరులు పాల్గొన్నారు. 

లంబాడి మహాసభకు సన్నాహక ర్యాలీ

లంబాడి మహాసభకు సన్నాహక ర్యాలీ 


  కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా (వుదయం ప్రతినిధి) డిసెంబర్ 10 :   రెబ్బెన మండలంలో ఆదివారం నాడు లంబాడీలు ప్రధాన రహదారిపై ర్యాలీ  నిర్వహించి ప్రధాన కూడలి  వద్ద   సభ జరిపారు.   ఈ సభలో లంబాడి నాయకులు  అజ్మిరా  బాపు రావు  మాట్లాడుతూ ఈ నెల 13న  జరప నిర్ణయించిన  లంబాడి  మహాసభకు సన్నాహకంగా ఈ ర్యాలీ   నిర్వహించినట్లు పేర్కొన్నారు. తెలంగాణలోని 31 జిల్లాలలో 25 లక్షల మంది లంబాడీలు ఉన్నట్లు, ఎన్నో ఏళ్లుగా కలసి మెలిసి ఉంటున్న ఆదివాసీలు, లంబాడి లను విడదీయడానికి జరిగిన కుట్రలో భాగంగానే కొద్దికాలంగా లంబాడి లపై విమర్శలు చేస్తున్నారని, దీనిని ప్రజలకు వివరించడానికి అహింసాయుత  మార్గంలో .మహాసభ జరపడానికి నిశ్చయించామన్నారు. తెలంగాణ వ్యాప్తంగా ఉన్న లంబాడీలు పెద్ద సంఖ్యలో మహాసభలో పాల్గొని  జయప్రదంచేయాలని కోరారు.ఈ ర్యాలీ  లో నాయకులు  ఏ  రమేష్, రవి ,దుప్ప నాయక్, ఆత్మ రామ్నాయక్, శేఖర్ , ఎల్ రమేష్,  మరియు పెద్దసంఖ్యలో లంబాడీలు పాల్గొన్నారు.

Saturday, 9 December 2017

కొమురంభీం జిల్లా కోర్ట్ లో జాతీయ లోక్ అదాలత్

కొమురంభీం  జిల్లా కోర్ట్ లో  జాతీయ లోక్ అదాలత్ 

 కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా (వుదయం ప్రతినిధి) డిసెంబర్ 9 :జాతీయ  లోక్ అదాలత్  కార్యక్రమాన్ని  శనివారం రోజు కొమురం భీం జిల్లా  కోర్టు ఆవరణలో నిర్వహించారు.  ముందుగా  సీనియర్ సివిల్ జడ్జి కనకదుర్గ మరియు ఇంచార్జ్ డిఆర్ఓ ఆర్డీవో రమేష్ బాబు జ్యోతి ప్రజ్వలన గావించారు.  అనంతరం ఈ కార్యక్రమానికి విచ్చేసిన అతిథులకు బొకేలకు బదులు మొక్కలతో ఆహ్వానించారు.  ముందుగా సీనియర్ సివిల్ జడ్జి కనకదుర్గ మాట్లాడుతూ సమన్యాయ సామాజిక న్యాయం అన్నట్లు కక్షి  దారులందరికీ  రాజీ కేసులు పరిష్కరించు తున్నామని రెవెన్యూ కు సంబంధించిన కేసులో కూడా ఈ కార్యక్రమం లో  సామరస్యంగా పరిష్కరించడం జరుగుతుందన్నారు. రాజి మార్గంలో  . వెళితేనే సమస్యలు పరిష్కారం అవుతున్నాయని సమయాన్ని, ఖర్చును  తగ్గించుకునేందుకు అందరూ సమాన భావం స్నేహిత భావంతో మెలిగితే శాంతి నెల కోరుతుందన్నారు.  న్యాయవ్యవస్థలో పాటు రెవెన్యూ మరియు పోలీసు శాఖ వివిధ శాఖల వారు కలిసి పనిచేస్తారనే  భావన కలగాలని ఈ కార్యక్రమం ఉద్దేశించ బడుతున్నది రెవెన్యూ మరియు పోలీసు కేసులు పరిష్కరించ బడుతున్నాయి కేసులు రాజీ పడేందుకు సాక్ష్యాధారాలతోనే ముందుకు  రావాలన్నారు.   మన కక్షలు మన పిల్లల వరకు పోకుండా సామరస్యంగా పరిష్కరించుకోవాలన్నారు.  ఇంచార్జ్ డిఆర్ఓ రమేష్ బాబు మాట్లాడుతూ తెలిసి తెలియని క్షణికావేశంలో తప్పులు జరుగుతాయని ఆ తప్పులను సరి చేసుకోవాలన్నారు.  అడిషనల్ ఎస్పీ  మాట్లాడుతూ ఈ జాతీయ లోక్ అదాలత్  కార్యక్రమం  సమస్య సత్వర రాజీ మార్గానికి జోహార్ పలుకుతుందని అన్నారు అందువల్ల మీ కేసు మీరే స్వంతంగా  పరిష్కరించు కొనేందుకు ముందుకు రావాలన్నారు . జూనియర్ సివిల్ జడ్జి హేమలత మాట్లాడుతూ చేసిన తప్పులను సరిదిద్దుకునేందుకు రాజే మార్గంలో  కేసులు పరిష్కరించుకోవాలని అడిషనల్ జూనియర్ సివిల్ జడ్జి సురేష్ మాట్లాడుతూ ప్రజల చట్టాల గురించి అవగాహన కల్పించి ఉండాలన్నారు చట్టం ముందు అందరూ సమానమే  అన్నారు.   బార్ అసోసియేషన్ అధ్యక్షులు  రవీందర్ మాట్లాడుతూ సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారం న్యాయవాదులు పది శాతం ఉచితంగా సేవలు అందచేస్తున్నారన్నారు.  కోర్టుల చుట్టూ తిరుగుతూ సమయాన్ని వృధా చేసుకోమని గెలిచినా ఓడినా కక్షిదారులు ఇద్దరూ నష్టపోతారని అలాకాకుండా  రాజీ మార్గంలో కేసులు పరిష్కరించుకోవాలన్నారు  అనంతరం కోర్టు ఆవరణలో మొక్కలు నాటడం జరిగింది. కక్షిదారుల నుండి సమస్యలను స్వీకరించి రాజీ మార్గాల్లో పరిష్కరించారు.  ఈ జాతీయ లోక్ అదాలత్ లో  ముప్పై ఆరు కేసులు పరిష్కరించడ  మైనదని అన్నారు.  ఈ కార్యక్రమంలో రెవెన్యూ పోలీస్ మరియు అటవీ శాఖా దారులు కక్షిదారులు తదితరులు పాల్గొన్నారు.

సోనియా గాంధీ జన్మ దీన వేడుకలు

సోనియా గాంధీ జన్మ దీన వేడుకలు 
 కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా (వుదయం ప్రతినిధి) డిసెంబర్ 9 ;  సోనియా గాంధీ కృషి వల్లే తెలంగాణ ఆవిర్భవించిందని, రానున్న రోజుల్లో  కాంగ్రెస్ పార్టీ  అధికారంలోకి వచ్చి ప్రజాలకు  ఎన్నో సంక్షేమ పథకాలును అందిస్తుందని కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు యం రవీందర్  అన్నరు. రెబ్బెన మండల కేంద్రంలోని  అతిధి గృహంలో శనివారం సోనియా గాంధీ జన్మదిన సందర్బంగా  కేక్ కట్చేసి పండ్లు, మీటయిలు  పంచరు.  అనంతరం వారు మాట్లాడుతు కాంగ్రెస్ పాలనలో ప్రజలకు సంక్షేమ పథకాలు ను అందిస్తూ ఎంతో సేవచేశారని  తెలంగాణ రావటానికి సోనియా గాందే కారణమని అన్నారు. ఈ కార్యక్రమంలో మండల అధికార ప్రతినిధి ఏ వెంకన్న, ఉప అద్యక్షుడు, రాజేష్, మండల ప్రధాన కార్యదర్శి దుర్గం దేవాజి, వస్రం నాయక్, పుదారి హరీష్, గందె సంతోష్  తదితర నాయకులు పాల్గొన్నారు.

సింగరేణి ఆవిర్భావ దినోత్సవం వేడుకల్లో స్టాళ్ల ఏర్పాటుకు దరఖాస్తుల ఆహ్వానం

సింగరేణి ఆవిర్భావ దినోత్సవం వేడుకల్లో స్టాళ్ల ఏర్పాటుకు దరఖాస్తుల ఆహ్వానం  
 కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా (వుదయం ప్రతినిధి) డిసెంబర్ 9 :  సింగరేణి ఆవిర్భావ దినోత్సవం వేడుకల సందర్భంగా  ఈ నెల 28 న బెల్లంపల్లి ఏరియా గోలేటి  టౌన్ షిప్ లోని  శ్రీ భీమన్న స్టేడియం గ్రౌండ్ నందు నిర్వహించనున్న  స్టాళ్ల ఏర్పాటుకు ఔత్సాహికులు  దరఖాస్తులు చేసుకోవాలని ఏరియా డీజీఎం పర్సనల్ జె కిరణ్ తెలిపారు . వేడుకల్లో భాగంగా వివిధ స్టాళ్లు, వ్యాపార సముదాయాలు, ఫుడ్స్ స్టాళ్లు ఏర్పాటుకు ఆసక్తి గల వారు జిఎం ఆఫీసులోని పర్సనల్ డిపార్టుమెంటులో దరఖాస్తులు తేదీ పదిహేను పన్నెండు రెండువేల పదిహేడు లోపు అందించాలని కోరారు అలాగే సింగరేణికి చెందిన స్టాళ్ల ఏర్పాటు చేయనున్నట్లు పేర్కొన్నారు సింగరేణి ఆవిర్భావ దినోత్సవ వేడుకల్లో భాగంగా మహిళలకు చిన్నారులకు ఆటల పోటీలు నిర్వహిస్తున్నారన్నారు అని వివరించారు విజేతలకు బహుమతులు అందించనున్నట్లు వెల్లడించారు వివరాలకై డివై పిఎం శ్రీ ఏ రాజేశ్వర్ ను సంప్రదించగలరు అని సూచించారు.

సింగరేణి ఓపెన్ కాస్టులో స్థానికులకే ఉద్యోగాలు కల్పించాలి

 సింగరేణి ఓపెన్ కాస్టులో స్థానికులకే ఉద్యోగాలు కల్పించాలి
 కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా (వుదయం ప్రతినిధి) డిసెంబర్ 9 :   ఓపెన్ కాస్టులో మట్టి తీసే పనుల్లో స్థానికులకే ఉద్యోగాలు కల్పించాలని వారికి తగిన సౌకర్యాలు కల్పించాలని కొమురం భీం కాంట్రాక్టు కార్మిక సంఘం ముఖ్య సలహాదారు అరిగెల మల్లికార్జున డిమాండ్ చేశారు శనివారం నాడు ఆయన బెల్లంపల్లి ఏరియాలో డోర్లీ ఓపెన్ కాస్టు మట్టి పనుల గుత్తేదారైనా      మహాలక్ష్మి కంపెనీ వద్ద ఏర్పాటు చేసిన ద్వార సమావేశంలో కార్మికులను ఉద్దేశించి మాట్లాడారు బెల్లంపెల్లి చుట్టుపక్కల  ప్రాంతాలలో  ఎంతో మంది నిరుద్యోగులు ఉన్నారని  వారిని కాదని  స్థానికేతరులను తీసుకోవద్దని  అన్నారు.  స్థానికుల ఉద్యోగాల కోసం కొమురం భీమ్ కాంట్రాక్టు కార్మిక సంఘం పోరాడుతుందని అదే కాకుండా ఉద్యోగులను యాజమాన్యం వేధిస్తోందని మరియు సరి అయిన సంక్షేమ పధకాలు అమలు చేయడం లేదని వారికి రావలసిన ఎన్నో హక్కులు కాలరాస్తున్నారని అన్నారు. అందుకే కొమురం భీం  కాంట్రాక్టు కార్మిక సంఘాన్ని ప్రారంభించామని స్థానిక  కమిటీలు నియమించి కార్మికుల హక్కుల సాధన కోసం నిరంతరం పోరాటం చేస్తామని అన్నారు కార్మికులకు అందుబాటులో ఉంటామని అన్నారు ఈ సమావేశంలో కొమురంభీం కాంట్రాక్టు కార్మిక సంఘం వర్కింగ్ ప్రెసిడెంట్ వజ్రాల శ్రీనివాసరావు అధ్యక్షుడు కె కమలాకర్,  ప్రధాన కార్యదర్శి పూదరి మొండయ్య,  సంతోష్ కె సుధాకర్, వినోద్ తదితరులు పాల్గొన్నారు

ప్రైవేట్, కార్పొరేట్ విద్య సంస్థలలో పకడ్బందీ ఫీజు నియంత్రణ చట్టాన్ని తీసుకురావాలి ; ఏఐఎస్ఎఫ్

ప్రైవేట్, కార్పొరేట్ విద్య సంస్థలలో పకడ్బందీ ఫీజు నియంత్రణ చట్టాన్ని తీసుకురావాలి ; ఏఐఎస్ఎఫ్

  కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా (వుదయం ప్రతినిధి) డిసెంబర్ 8 : ప్రైవేట్, కార్పొరేట్ విద్య సంస్థలలో పకడ్బందీ ఫీజు నియంత్రణ చట్టాన్ని తీసుకువచ్చి ఖచ్చితంగా అమలు పరచాలని ఏ ఐ ఎస్ ఎఫ్ డివిజన్ అధ్యక్షులు బావునే వికాస్, కార్యదర్శి పూదరి సాయికిరణ్ డిమాండ్ చేశారు. శుక్రవారం నాడు అసిఫాబాద్ లోని సీపీఐ పార్టీ కార్యాలయ ఆవరణలో ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో వారు మాట్లాడుతూ హైదరాబాద్ లోని గండిపేట సీబీఐటి ఇంజినీరింగ్ కళాశాల యాజమాన్యం మధ్యాంతరంగా ఫీజును పెంచడం దారుణమని,అట్టి కళాశాల యాజమాన్యం పై చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు. ప్రైవేట్ కార్పొరేట్ విద్యాసంస్థలు ఇష్టానుసారంగా ఫీజులు పెంచడంతో విద్యార్థులు, వారి తల్లిదండ్రులు తీవ్ర ఇబ్బందులకు గురౌతున్నారని అన్నారు. ప్రతి విద్య సంవత్సరం ప్రారంభం ముందు ఫీజు నియంత్రణ పై చేసే కసరత్తు తూ  తూ   మంత్రం చందంగా    ఉందన్నారు. ఈ విద్య సంస్థలను నియంత్ర ణ   చేయకుంటే ఈ పరిస్థితులు ఇలాగే కొనసాగితే నిరు పేద, బడుగు బలహీన వర్గాలకు చెందిన విద్యార్థులు చదువులకు దూరమయ్యే దుస్థితి ఏర్పడుతుంది అని దీనిని ఏ ఐ ఎస్ ఎఫ్ గా తీవ్రంగా ఖండిస్తున్నామని అన్నారు. ఈ విద్య సంస్థలను నియంత్రించడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలం చెందడమే కాకా తెలంగాణా విద్యార్థి లోకాన్ని తెరాస మోసం చేసిందని అన్నారు. ఈ సమావేశంలో నాయకులు నంది శ్రీకాంత్, ఆత్రం శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు. 

ఆసిఫాబాద్ బిజెవైఎం ఆధ్వర్యంలో స్వచ్ఛ భారత్

ఆసిఫాబాద్  బిజెవైఎం ఆధ్వర్యంలో స్వచ్ఛ భారత్ 

  కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా (వుదయం ప్రతినిధి) డిసెంబర్ 8 : స్వచ్ఛ భారత్ కార్యక్రమం లో  భాగంగాఆసిఫాబాద్  లోని బిజెపి బిజెవైయం కార్యకర్తలు ,  గ్రామస్థులు కలసి బాజార్వాడిలోని  ఎల్ఐజి కాలనీ పాఠశాల పక్కన ఉన్న చెత్తకుప్పలను  పిచ్చిమొక్కలను తొలగించారు. ఈ సందర్భంగా బీజేవైఎం జిల్లాఅధ్యక్షులు ఖాండ్రే   విశాల్ మాట్లాడుతూ మనఇంటిని శుభ్రంగా ఉంచుకున్నట్లే మన పరిసరాలను కూడా పరిశుభ్రంగా ఉంచుకోవడమే స్వచ్ఛ భారత్ ఉద్దేశమని,మహాత్మా గాంధీ ప్రవచించిన దానిని ఆదర్శంగా తీసుకోని ప్రధాన  మంత్త్రి .నరేంద్రమోడీ ప్రారంభించిన స్వచ్ఛభారత్ కార్యక్రమాన్ని అందరు ఒక ఉద్యమంగ చేపట్టాలని అన్నారు. ఈ కార్యక్రమంలో గుండా శంకర్, రాధిక, విజయ్ కుమార్, రాకేష్ ,గోదాబాయి , వరలక్ష్మి, , అఖిల్, అస్మిత, తదితరులు పాల్గొన్నారు.      . 

యూనిటీ యూత్ రైడర్ స్వచ్ఛంద సేవా సంస్థ సంయుక్త కార్యదర్శిగా జర్పుల శివాజీ

యూనిటీ యూత్ రైడర్ స్వచ్ఛంద సేవా సంస్థ సంయుక్త కార్యదర్శిగా జర్పుల శివాజీ 
 కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా (వుదయం ప్రతినిధి) డిసెంబర్ 8 : యూనిటీ యూత్ రైటర్స్ స్వచ్ఛంద సేవా సంస్థ సంయుక్త కార్యదర్శిగా రెబ్బెన మండలానికి చెందిన జర్పుల శివాజీని ఎన్నుకున్నట్లు సంస్థ అధ్యక్షులు చునార్కర్ రాజ్ కుమార్ ఒక ప్రకటనలో  తెలిపారు  ఈ సందర్భంగా జర్పుల శివాజీ మాట్లాడుతూ నా మీద నమ్మకంతో స్వచ్ఛంద సంస్థ నాకు బాధ్యతను అప్పగించినందుకు సంస్థ అధ్యక్షునికి  కృతజ్ఞతలు  తెలుపుతూ సంస్థకు శక్తివంచన లేకుండా  తన వంతు సహాయ  సహకారాలు అందిస్తామన్నారు . ఈ సందర్భంగా  జర్పుల వినోద్,దినేష్, అర్జున్, ప్రతాప్, ఆనంద్,కైలాష్ లు   స్వచ్చందంగా సమాజసేవలో పాలుపంచుకుంటామని    ఈ సంస్థలో చేరారన్నారు.

Wednesday, 6 December 2017

ప్రాధమిక వ్యవసాయ సహకార కేంద్రం లో వరి ధాన్యం కొనుగోలు

ప్రాధమిక వ్యవసాయ సహకార కేంద్రం లో రి ధాన్యం  కొనుగోలు



కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా (వుదయం ప్రతినిధి) డిసెంబర్ 6 :  రెబ్బెనమండల ప్రాధమిక వ్యవసాయ సహకార కేంద్రం ఆధ్వర్యంలోబుధవారం  400 బస్తాల ఏ  గ్రేడ్ ధాన్యం కొనుగోలు చేసినట్లు కేంద్రం ముఖ్య కార్యనిర్వాహక అధికారి ఆర్  సంతోష్ తెలిపారు. మండలంలోని రైతుల సౌకర్యంకోసం నేర్పల్లి, నారాయణపూర్, తక్కళ్లపల్లి,నక్కలగూడ గ్రామాలలో  వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలు    ఏర్పాటుచేసినట్లు  ఈ కేంద్రాలలో ఏ   గ్రేడ్ ధాన్యానికి 1590 రూపాయలు,  బి గ్రేడ్ ధాన్యానికి 1550 రూపాయలు చెల్లిస్తున్నట్లు, మండలంలోని రైతులు ఈ సదవకాశాన్ని ఉపయోగించుకోవాలని అన్నారు.  రైతులు ధాన్యం తీసుకొనివచ్చేటప్పుడు వారి ఆధార్ కార్డు, బ్యాంకు పాస్ బుక్, పట్టాదార్ పాస్ బుక్, మరియు వి ఆర్ ఓ సర్టిఫికెట్ నకళ్ళను తీసుకోని రావలసింది గ  తెలిపారు. 

సేవా సంస్థ ఆధ్వర్యం దివ్యంగుల దినోత్సవ వేడుకలు

 సేవా సంస్థ ఆధ్వర్యం దివ్యంగుల దినోత్సవ వేడుకలు



కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా (వుదయం ప్రతినిధి) డిసెంబర్ 6 :  అంతర్జాతీయ దివ్యంగుల దినోత్సవ సందర్భంగా బుధవారం  రెబ్బెన మండల గోలేటి లోని బెటర్ యూత్ బెటర్ సొసైటీ సేవా సంస్థ అద్వర్యం లో   (డి ఎం డి) ప్రత్యేక అవసరాల పిల్లల కేంద్రం పాఠశాలలో పిల్లలతో కేక్ కట్ చేయించి పండ్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా  బెటర్ యూత్ బెటర్ సొసైటీ  సేవా సంస్థ  అధ్యక్షులు ఒరగంటి రంజిత్ మాట్లాడుతూ దివ్యంగులని అందరితో సమానంగా చూడాలని ఎవరిని కూడా కించపరుస్తూ మాట్లాడరాదని కోరారు .  దివ్యంగులలో కొంతమంది నడవలేని వారు  గుడ్డి, మూగ, ఉంటారని వాళ్ళని కంటికి రెప్పలాకాపాడుకొనే  తల్లి తండ్రులకు ధన్యవాదాలు తెలిపారు. ఉన్నత స్థాయికి ఎదగడానికి అంగ వైకల్యం అడ్డు రాదని అంగ వైకల్యం ఉందని బాదపడోద్దని మంచిగా చదువుకొని ఉన్నత స్థాయికి ఎదగాలని అన్నారు. ప్రపంచం లో ఎంతోమంది  దివ్యంగులు శాస్త్రవేత్తలుగా, డాక్టర్లుగా,  ఎదిిగారని తెలిపారు. ఈ కార్యక్రమంలో సంస్థ ఉపాధ్యక్షులు నామాల రాజశేఖర్,అజయ్,,రవీందర్ కార్యదర్శులు ఏగ్గే తిరుపతి , రాకేష్, బలుగురి తిరుపతి మరియు పాఠశాల ఉపాధ్యాయురాళ్లు సుజాత,సౌజన్య,నికిత,తదితరులు పాల్గొన్నారు.

Tuesday, 5 December 2017

ప్రత్యేక అభివృద్ధి కోసం కుమరంబీం జిల్లా ఎన్నిక కేంద్ర ప్రభుత్వానికి కృతఙ్ఞతలు : బిజెపి జిల్లా అధ్యక్షులు జేబీ పౌడెల్

ప్రత్యేక అభివృద్ధి కోసం కుమరంబీం జిల్లా ఎన్నిక 
కేంద్ర ప్రభుత్వానికి కృతఙ్ఞతలు:  బిజెపి జిల్లా అధ్యక్షులు జేబీ  పౌడెల్
   కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా (వుదయం ప్రతినిధి) డిసెంబర్ 5 :     కుమరంబీం జిల్లా అభివృద్ధి కోసం ప్రత్యేకంగా వెనుకబడిన జిల్లాగా కేంద్ర ప్రభుత్వం   ప్రకటించినందున కేంద్ర బృందం అధికారిణి  వసుధ మిశ్రా కి మంగళవారం కుమరంబీం జిల్లాపాలనాధికారి  కార్యాలయ ఆవరణలో   పుష్ప గుచ్చం, మెమోరండం సమర్పించడం జరిగిందని బిజెపి జిల్లా అధ్యక్షులు జెబి పౌడెల్ తెలిపారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ కుమరంబీం జిల్లా అభివృద్ధి కోసం ప్రత్యేకంగావెనుకబడిన జిల్లాగా గుర్తించి కేంద్రం ప్రధానమంత్రి మోడీ ఆధ్వర్యంలో పలు అభివృద్ధిపథకాలను ప్రారంభించుటకు అవకాశం ఉందని అన్నారు. ఈ కార్యక్రమంలో .రాష్ట్ర కార్యవర్గ సభ్యులు బొనగిరి సతీష్, జిల్లా ప్రధాన కార్యదర్శులు కేసరి ఆంజనేయులుగౌడ్, చర్ల మురళి, చాపిడి అశోక్, కాగజ్ నగర్ అసెంబ్లీ కన్వీనర్ కోంగ సత్యనారాయణ, బిజెవైయం జిల్లా అధ్యక్షులు కాండ్రె విశాల్, ఆసిఫాబాద్ బిజెవైయం మండల అధ్యక్షులు పడిగెల విజయ్ కుమార్ ఆజాద్, ప్రదాన కార్యదర్శి పేంటపర్తి రాకెష్ లు పాల్గొన్నారు.

సింగరేణి కంపెనీ లెవెల్ అథ్లెటిక్ పోటీలు

 సింగరేణి కంపెనీ లెవెల్ అథ్లెటిక్ పోటీలు 

 కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా (వుదయం ప్రతినిధి) డిసెంబర్ 5 :  బెల్లంపల్లి ఏరియా గోలేటిలో డబ్ల్యూ పి ఎస్ అండ్ జి ఏ  ఆధ్వర్యంలో  ఈ నెల 7,8 వ తేదీలలో గోలేటి భీమన్న స్టేడియం గ్రౌండ్లో  జరిగే కంపెనీ లెవెల్ అథ్లెటిక్ పోటీలకు సంబంధించిన ఏర్పాట్లను సింగరేణి జనరల్ మేనేజర్ కే రవిశంకర్ మంగళవారం   పరిశీలించారు.  ఈ సందర్బంగా గ్రౌండ్లో జరుగుతున్నా ఏర్పాట్ల గురించి అధికారులను అడిగి తెలుసుకొన్నారు. పలు ఈవెంట్లలోపోటీలు జరుగుతున్నా సందర్భంగా అధికారులకు సూచనలు చేసారు. ఈవెంట్లో 11 ఆరేయాలనుండి  పాల్గొనే సుమారు 300 మంది క్రీడాకారులు, క్రీడాకారిణులు సంబంధించి వసతి ,భోజన సదుపాయాలను లోపాలు లేకుండా సిద్ధంచేయాలని అధికారులకు ఆదేశించారు. కంపెనీ స్థాయి పోటీలను ఘనంగా నిర్వహించడానికి సివిల్ మరియు వర్క్ షాప్ అధికారులు సమన్వయంతో పనిచేయాలని అన్నారు. ఈ కార్యక్రమంలో జనరల్ మేనేజర్ తో పటు డిజైన్ పర్సనల్ జె  కిరణ్,   డబ్ల్యూ ఫై ఎస్ అండ్ జి ఏ ఏ  గౌరవ కార్యదర్శి రాజేశ్వర్ ,స్పోర్ట్స్  సూపర్ వైజర్ రమేష్ ఇతర అధికారులు పాల్గొన్నారు. 

ఓ డి ఎఫ్ చెక్కుల పంపిణి

ఓ డి ఎఫ్ చెక్కుల పంపిణి 
 కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా (వుదయం ప్రతినిధి) డిసెంబర్ 5 :  వ్యకిగత మరుగు దొడ్లు నిర్మించుకొని పరిశుభ్ర వాతావరణాన్ని కల్పించాలని రెబ్బెన గ్రామా సర్పంచ్ శ్రీమతి పెసర వెంకటమ్మ అన్నారు. మంగళవారం  కొమ్రం భీమ్ జిల్లా రెబ్బెన మండల గ్రామపంచాయితిలో కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఓపెన్ డెఫినేషన్ ఫ్రీ విలేజ్  పధకం కింద  అర్హులయిన లబ్దిదారులకు చెక్ లను  పంపిణి చేసారు. ఈ సందర్భంగా  రెబ్బెన గ్రామ సర్పంచ్ పెసర వెంకటమ్మమాట్లాడుతూ వ్యక్తిగత పరిశుభ్రతతోనే గ్రామా పరిశుభ్రత ఆధార పది ఉందని అన్నారు.  ఈ కార్య క్రమంలో  ,పంచాయతీ  సెక్రేటరీ మురళీ ధర్  లబ్ధిదారులు.పాల్గొన్నారు.

Monday, 4 December 2017

ప్రజా ఫిర్యాదులపై సత్వరమే స్పందించాలి ; జిల్లా పాలనాధికారి చంపాలాల్

 ప్రజా ఫిర్యాదులపై సత్వరమే స్పందించాలి ;  జిల్లా పాలనాధికారి చంపాలాల్

   కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా (వుదయం ప్రతినిధి) డిసెంబర్ 4 :  కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా సోమవారం  ప్రజా ఫిర్యాదుల విభాగంగా జిల్లా పాలనాధికారి ఎం చంపాలాల్ ప్రజల నుండి ఆర్జీలను స్వీకరించారు. పాలనాధికారి మాట్లాడుతూ ఆర్జీదారుడు నుండి వచ్చిన ఆర్జీలను స్వీకరించి సత్యంను అసత్యాలు పరిష్కరించాలన్నారు ప్రజల నుంచి వచ్చిన ఫిర్యాదులను ఆయన  శాఖలను అధికారులు సత్వరమే స్పందించాలని ఫిర్యాదు విభాగంలో భాగంగా ఈ మొత్తం నలభై రెండు ఆర్జీలు  అందాయన్నారు రెబ్బెన మండలం గంగాపూర్ గ్రామానికి చెందిన రామయ్య కళ్యాణ లక్ష్మి ద్వారా రావాల్సిన డబ్బులు  రాలేదని అవి ఇప్పించుట కొరకు పోతపల్లి గ్రామానికి చెందిన అమృత తన భూమి చెరువులో మునిగి పోయిందని నష్టపరిహారం ఇచ్చుట కొరకు మండలలం జనకాపూర్ కు  చెందిన రాజుభాయ్ వితంతు పింఛన్ కొరకు  సురేంద్రనాథ్ బ్యాంకు రుణం ఇవ్వడం లేదని రెబ్బెనకు చెందిన సోమయ్య వృద్ధాప్య పింఛన్ కోసం పెంచికల్పేట్ గ్రామంలో కొమురంభీం విగ్రహ ఏర్పాటు చేయాలని ఆదివాసీ కమిటీ వారు ఆర్జీలు స్పందించారు ఈ ప్రజా ఫిర్యాదులు జిల్లా సంయుక్త పాలనాధికారి వి అశోక్ కుమార్ సిపిఓ కృష్ణయ్య అన్ని శాఖల జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు. 

గణితం మరియు పర్యావరణ ప్రదర్శన

గణితం మరియు పర్యావరణ ప్రదర్శన
 కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా (వుదయం ప్రతినిధి) డిసెంబర్ 4 :  నలభై అయిదు వ జవహార్లాల్ నెహ్రూ జిల్లాస్థాయి స్పైక్స్ గణితం మరియు పర్యావరణ ప్రదర్శన 2017-18 ప్రారంభోత్సవం మంగళవారం ఉదయం తొమ్మిది గంటలకు సెయింట్ మేరీస్ ఉన్నత పాఠశాలలో  జన్కాపూర్ నందు జరుగుటకు జిల్లా విద్యా అధికారి శాఖ ఎం  రఫీక్ తెలిపారు ఈ కార్యక్రమానికి సకాలంలో హాజరు కావాలని అన్నారు.

డబ్ల్యూపీఎస్ జీఏ ఆధ్వర్యంలో దివ్యాంగుల దినోత్సవం

డబ్ల్యూపీఎస్ జీఏ ఆధ్వర్యంలో దివ్యాంగుల దినోత్సవం

   కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా (వుదయం ప్రతినిధి) డిసెంబర్ 4 :  బెల్లంపల్లి ఏరియా డబ్ల్యూపీఎస్ జీఏ ఆధ్వర్యంలో సోమవారం  గోలేటి టౌన్ షిప్లోని సింగరేణి హైస్కూల్ గ్రౌండ్ నందు దివ్యాంగుల దినోత్సవం నిర్వహించడం జరిగిందని  ఏరియా డీజీఎం పర్సనల్  జె  కిరణ్ తెలిపారు.  ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా హాజరైన ఎస్ఓ జీఎం కె కొండయ్య మాట్లాడుతూ దివ్యాంగులను అందరితో కలిసి సమానంగా చూడాలని ఎవరినీ కించపరుస్తూ మాట్లాడారాదని కోరారు.  దివ్యాంగులలో  కొంతమంది మూగ, గుడ్డి, సరిగ్గా నడవలేని వారు అంగ వైకల్యంతో ఉంటారని వీరిని కంటికి రెప్పలా కాపాడుకునే వారి తల్లిదండ్రులను ధన్యవాదాలు తెలిపారు. అంగ  వైకల్యం ఉందని బాధపడొద్దని చక్కగా చదువుకొని ఉన్నత స్థాయికి ఎదగాలని ప్రభుత్వం కూడా చేయూత అందిస్తుందని అంగవైకల్యాన్ని జయించి ప్రపంచంలో కొంతమంది శాస్త్రజ్ఞులుగా కూడా ఎదిగారని తెలిపారు. ఈ సందర్భంగా దివ్యాంగులకు ఆటల పోటీలు నిర్వహించారు ముఖ్యంగా టీఆర్ ఎస్పీ కమ్యూన్ మ్యూజిక్ సంస్థ ద్వారా దివ్యాంగులకు పాటల పాటలు కీబోర్డ్స్ ఫ్యాక్స్ లతో చక్కని ప్రదర్శన ఇచ్చిన రని అనంతరం ఎస్సో టూ జిఎం కొండయ్య  అందరికీ మెమొంటోలు అందజేశారు.  మరియు ఈ కార్యక్రమానికి వచ్చిన దివ్యాంగులందరికీ చక్కని ఆహార పొట్లాలు అందించడం జరిగింది ఈ కార్యక్రమంలో డీవై పీఎం ఏ రాజేశ్వర్, సింగరేణి స్కూల్ హెడ్మాస్టర్ వెంకటేశ్వర్లు, పిఇటి భాస్కర్, అసిస్టెంట్ స్టోర్ సూపర్వైజర్  హెచ్ రమేష్, కాంటినెంట్ డి కుమారస్వామి తదితరులు పాల్గొన్నారు.

విఘ్నేశ్వర రూపంలో బొప్పాయి

విఘ్నేశ్వర రూపంలో బొప్పాయి 

 కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా (వుదయం ప్రతినిధి) డిసెంబర్ 4 : రెబ్బెన మండలం లోని  కిష్టాపూర్ గ్రామంలో శ్రీ ఆంజనేయ స్వామి వారి గుడి ఎదుట పుప్పొడి   చెట్టు కి   విఘ్నేశ్వర రూపంలో విచిత్రంగా  ఉందని గ్రామస్తులు పూజా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా గ్రామస్తులు ఆ చెట్టును సందర్శించుకుని బొప్పాయి రూపంలో విఘ్నేశ్వరుడు వెలిశాడని అనుకుంటున్నారు.





Sunday, 3 December 2017

కొలువుల కొట్లాట బహిరంగ సభ గోడప్రతులు విడుదల

కొలువుల కొట్లాట బహిరంగ సభ గోడప్రతులు విడుదల
కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా (వుదయం ప్రతినిధి) డిసెంబర్ 3 :  తెలంగాణ జేఏసీ యాక్షన్ కమిటీ తలపెట్టిన కొలువులపై కొట్లాట బహిరంగ సభను ఈ నెల 4న చలో హైదరాబాద్ కు మండలంలోని నిరుద్యోగులు, విద్యార్థులు, పార్టీల నాయకులు వివిధ కుల సంఘాల వారు  అందరూ పాలుపంచుకుని విజయవంతం చేయాలని  జిల్లా కన్వీనర్ ఎల్ రమేష్ అన్నారు. ఆదివారం రెబ్బెన విశ్రాంతి భవనం ఆవరణలో కొలువులపై కొట్లాట బహిరంగ సభకు సంబంధిత గోడప్రతులను విడుదల చేశారు. అనంతరం మాట్లాడుతూ ప్రభుత్వ రంగ సంస్థల్లో ఉన్న ఖాళీలను ప్రకటించి తక్షణమే నియామక ప్రక్రియను చేపట్టాలని, పలు డిమాండ్లపై కొలువుల కొట్లాట సమావేశంలో జరుగు సభను అందరూ విజయవంతం చేయాలని అన్నారు. ఈ సందర్భంగా రెబ్బెన మండల యూత్ జేఏసీ కమిటీలను ఎన్నుకోవడం జరిగిందని  రెబ్బెన జేఏసీ చైర్మన్ మిత్ర దేవతా తెలిపారు రెబ్బెన యూత్ జేఏసీ కన్వీనర్ గా ఆవిడకు గోపి, కో కన్వీనర్ గా ఇందూరి మోహన్, చైర్మన్ గా అజ్మీరా శివనాయక్, అన్నపూర్ణ శాంతి గౌడ్, కో కన్వీనర్లుగా ఎం వెంకటేష్, బి వెంకటేశ్వర్లు ఎంపికైన ఈ కార్యక్రమంలో డి మల్లయ్య  భోగ ఉపేందర్, గోవింద్ దుర్గం రవీందర్, రాజేందర్ వంశీకృష్ణ, నరేష్, శ్రీకాంత్, మధుకర్, ప్రేమకుమార్, తదితరులు పాల్గొన్నారు.


Saturday, 2 December 2017

ఘనంగా మిలాద్ ఉన్ నబి ఉత్సవాలు

ఘనంగా మిలాద్ ఉన్ నబి ఉత్సవాలు
    కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా (వుదయం ప్రతినిధి) డిసెంబర్ 2 :   మిలాద్ ఉన్ నబి ఉత్సవాలను శనివారం   ఆసిఫాబాద్ లో ఘనంగా  జరుపుకున్నారు. ఈ సందర్భంగా జామియా మస్జిద్ నుండి పట్టణం లోని ప్రధాన కూడల మీదుగా ర్యాలీ నిర్వహించారు.ఈ ర్యాలీ లో తెరాస మైనారిటీ సెల్ జిల్లా అధ్యక్షుడు ఏం డి మహమూద్,మైనారిటీ నాయకులు రియాజ్ అహేమద్,శంషాద్ హుస్సేన్,,లయఖ్,షబ్బీర్,మొయిన్,తాహెర్,హాఫిజ్ జాఫర్ సాదిఖ్ ,అమర్ నిజామి,షాహీద్, తెరాస నాయకులు సాలామ్ ,అన్సర్,సాజీద్,సయ్యద్ జవీద్ ,ఖాళీళ్,అర్షద్,ముస్లిం పెద్దలు ,చిన్నారులు మరియు టీ యూ డబ్ల్యూ జె జిల్లా అధ్యక్షుడు అబ్దుల్ రహేమన్ ,జిల్లా కార్యవర్గ సభ్యుడు ఖాళీళ్ అహేమద్ పాల్గొన్నారు. ర్యాలీ అనంతరం జామియా మస్జిద్ లో అన్నదాన కార్యక్రమం నిర్వహించారు.

పదవీ విరమణ పొందిన పోలీస్ ఉద్యోగులకు సన్మానం

పదవీ విరమణ పొందిన  పోలీస్ ఉద్యోగులకు సన్మానం  
 

కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా (వుదయం ప్రతినిధి) డిసెంబర్ 2 :  విధి నిర్వహణ ను దైవం గా బావించి   ప్రజా సేవయే   పరమావధి గా పని చేసి పదవి విరమణ పొందిన వారిని సన్మానిoచుకోవటం మన  యొక్క అదృష్టం  అని జిల్లా  ఎస్పి సన్ ప్రీత్ సింగ్ తెలిపారు, ప్రజా పోలీసు గా పనిచేసినప్పుడే మన  సేవల కు  అమోఘమైన గుర్తింపు లబిస్తుందని ఆయన తెలిపారు.శుక్రవారం జిల్లా లోని స్థానిక జిల్లా ఎస్పి క్యాంపు కార్యాలయం  లొ నవంబర్  మాస అంతమున పదవి విరమణ పొందిన  జే. రామదాన్  ఏ.ఎసై జైనూర్, జి. తులసి రామ్ హెడ్ కానిస్టేబుల్ బెజ్జూర్  లను  జిల్లా ఎస్పి సన్ ప్రీత్ సింగ్ పదవి విరమణ సందర్బంగా  శాలువ తో సత్కరించి పుష్ప గుచ్ఛము ను అందచేశారు, మరియు  వారి యొక్క 37 సంవత్సరాల సర్విస్ లో చేసిన సేవల గురించి  అడిగి తెలుసుకున్నారు వారు  గడించిన అనుభవం ను తోటి వారికి సలహాల రూపం లో అందిస్తూ వారికి మార్గ నిర్దేశం చేయాలనీ జిల్లా ఎస్పి పదవి విరమణ పొందిన వారిని  కోరారు.   అనంతరం వారి యొక్క శేషజీవితము సుఖ సంతోషాలతో మనుమలు,మనుమరాండ్ల తో  ఆనందం తో గడపాలని అభిలషించారు    వారికీ రావలిసిన బెనిఫిట్స్ ను తక్షణం అందిస్తామని ఈ సందర్బంగా  జిల్లా ఎస్పి హామి ఇచ్చారు. ఈ కార్యక్రమము లో ఎస్బిసిఐ సుధాకర్ ,ఎస్పిసీసీ దుర్గం శ్రినివాస్,ఎన్.ఐ.బి ఇంచార్జ్ శ్యాం సుందర్, డి.పీ.ఓ.అడ్మినిస్ట్రేషన్ అదికారి ప్రహ్లాద్ , మహిపాల్, సీనియర్ అసిస్టెంట్  కేదార సూర్యకాంత్, ఇంతియాజ్, క్యాంపు కార్యాలయ సిబ్బంది కిరణ్ కుమార్, పోలీస్ అసోసియేట్ ప్రెసిడెంట్ శ్రీరాములు మరియు పి.ఆర్.ఓ మనోహర్ లు పాల్గొన్నారు.

కొమురంభీం జిల్లాను ప్రేత్యేక అభివృద్ధికై ఎంపిక : బీజేపీ జిల్లా ప్రధానకార్యదర్శి కేసరి ఆంజనేయులు గౌడ్

కొమురంభీం జిల్లాను ప్రేత్యేక అభివృద్ధికై ఎంపిక  : బీజేపీ జిల్లా ప్రధానకార్యదర్శి కేసరి ఆంజనేయులు గౌడ్ 


 కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా (వుదయం ప్రతినిధి) డిసెంబర్ 2 : కొమరంభీం జిల్లాను కేంద్రప్రభుత్వం  వెనుకబడిన జిల్లాగా గుర్తించి ప్రత్యేకంగా అభివృద్ధి చేయడానికి నిర్ణయం తీసుకున్నందుకుకు బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి కేసరి ఆంజనేయులు గౌడ్ హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపాతు శనివారం రెబ్బెన మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వం రాష్ట్రంలోని వెనుకబడిన ఐదు జిల్లాలను  గుర్తించడం జరిగిందని  అందులో కొమురంభీం జిల్లా ను  కూడా ఎన్నిక  చేయడం జరిగిందని   ఆదివాసుల జిల్లాను గుర్తించడం హర్ష నియమని  కొమురంభీం జిల్లాను గుర్తించినందుకు ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ గారికి కృతజ్ఞతలు తెలియచేసారు.  కేంద్ర ప్రభుత్వం నుంచి వేరుగా గ్రామ పంచాయతీకి నిధులు వస్తున్నప్పటికీ అధికారుల పర్యవేక్షణ లోపం , ప్రజల అమాయకత్వంతో  గ్రామాల అభివృద్ధికి అందనంత దూరంలో ఉన్నాయన్నారు.   ఇప్పటికైనా   అధికారులు ప్రజాప్రతినిధులు స్పందించి  గ్రామాలను అభివృద్ధి చేయాలన్నారు.  కేంద్ర ప్రభుత్వం ప్రవేశ  పెట్టిన దేశ మహిళల ఆరోగ్యం కొరకు ఉజ్వల పథకం ద్వారా వంట  గ్యాస్ పథకాన్ని వినియోగించుకోవాలని భారత దేశంలోభారతీయ జనతా పార్టీ దేశంలో ఎక్కడ  ఎలక్షన్లు జరిగిన విజయం సాధిస్తుందని  నరేంద్ర మోడీ  నాయ కత్వంలో అభివృద్ధి  పథకాలను చూసి ప్రజలు బిజెపిని ఆదరిస్తుందన్నారు.    ఉత్తరప్రదేశ్  ఎన్నికల్లో విజయమే ఇందుకు  నిదర్శనం అన్నాడు.  రాబోయే రెండు వేల పందొమ్మిది లో తెలంగాణలోకూడా రాష్ట్ర ప్రభుత్వం వైఫల్యాలను, నిరుద్యోగులను డబుల్ బెడ్రూమ్లు దళితులకు మూడు ఎకరాల భూమి పంపిణి  లాంటి హామీలను  నెరవేర్చకపోవడంతో టిఆర్ఎస్కు బుద్ధి చెప్పి  బిజెపికి పట్టం కట్టడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారన్నారు. ఈ కార్యక్రమంలో    బీజేపీ మండల అధ్యక్షుడు కుందారపు బాలకృష్ణ, ఇగురపుసంజీవ్,తదితరులు పాల్గొన్నారు.

కొలువుల కొట్లాట సభ సన్నాహక సమావేశం

కొలువుల కొట్లాట సభ సన్నాహక సమావేశం 

 కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా (వుదయం ప్రతినిధి) డిసెంబర్ 2 :  నిరుద్యోగులకు అందరికీ ఉద్యోగాలు ఇచ్చినప్పుడే బంగారు తెలంగాణ సాధ్యమవుతుందని జెఎసి జిల్లా కో కన్వీనర్  రాయల  నర్సయ్య అన్నారు శనివారం రెబ్బెన విశ్రాంతి భవనంలో జాక్ మండల చైర్మన్ ఆధ్వర్యంలో  ఏర్పాటు చేసినకొలువుల కొట్లాట సభ సన్నాహక సమావేశంలో మాట్లాడారు. సకల జనుల సమ్మెలో పాల్గొని తెలంగాణ సాధించుకున్నప్పటికీ  ఎన్నికల హామీలో ఇంటికో ఉద్యోగం అని  చెప్పి  అధికారంలోసి వచ్చి మూడున్నరేళ్లవుతున్న ఇప్పటికీ ఉద్యోగాల భర్తీకి ఎలాంటి చర్యలు మొదలు పెట్టక  నిరుద్యోగులను మాటల  గారడితో మోసం చేస్తున్నారన్నారు.  ఈ నెల నాలుగు తారీఖున చలో హైదరాబాద్ సకల జెఎసి తలపెట్టిన కొలువులు కొట్లాట సభకు మండలంలోని నిరుద్యోగులు, విద్యార్థులు పెద్దఎత్తున తరలి వచ్చి సభను జయప్రదం చేయగలరని కోరారు. ఈ కార్యక్రమంలో బి సీ  ఐక్య సంఘర్షణ సమితి రాష్ట్ర కౌన్సిల్ మెంబెర్ పి . మొండయ్య, జాక్ మండల కో కన్వీనర్ దుర్గం మల్లయ్య ,మండల జాక్ నాయకులూ మహేష్, అజమీర హరిలాల్, ప్రేమకుమార్, హరీష్, తిరుమల, రాజేష్ తదితరులు పాల్గొన్నారు.

విద్యార్థుల వసతి గృహాలను నిర్వీర్యం చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వం : ఏఐఎస్ఎఫ్ డివిజన్ కార్యదర్శి పూదరి సాయికిరణ్

విద్యార్థుల వసతి గృహాలను నిర్వీర్యం చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వం :
                     ఏఐఎస్ఎఫ్ డివిజన్ కార్యదర్శి పూదరి సాయికిరణ్ 

 కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా (వుదయం ప్రతినిధి) డిసెంబర్ 2 : సంక్షేమ వసతి గృహాల, ఆశ్రమ ఉన్నత పాఠశాలల విద్యార్థులు చలికాలం కావడం వలన తీవ్ర అవస్థలు పడుతున్నారని  ఏఐఎస్ఎఫ్ డివిజన్ కార్యదర్శి పూదరి సాయికిరణ్ అన్నారు.   ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో రెబ్బన  మండలం గోలేటిలోని ఆశ్రమ ఉన్నత పాఠశాలను శుక్రవారం రాత్రి సందర్శించారు. విద్యార్థులతో మాట్లాడి వారి సమస్యలు తెలుసుకోవడం జరిగింది. ఈ సందర్బంగా పూదరి సాయికిరణ్ మాట్లాడుతూ ప్రభుత్వాలు మారిన పాలకుల విధానాలు మారడం లేదని, వసతి గృహం విద్యార్థులకు బ్లాంకెట్లను ప్రభుత్వం సరఫరా చెయ్యాలని ఆయన అన్నారు. వసతి గృహంలో సోలార్ వాటర్ హీటర్ చెడిపోవడం వలన విద్యార్థులు చలిలో వణుకుతూ ఉదయాన్నే చల్లని నీటితోనే స్నానాలు చేస్తూ అవస్థలు పడుతున్నారని అన్నారు. వాటర్ హీటర్ కు వెంటనే మరమ్మత్తులు చేయించి వేడి నీటిని  స్నానాలకు అందించాలని ఆయన డిమాండ్ చేశారు. అదే విదంగా  త్రాగు నీటి సౌకర్యం కోసం ఏర్పాటు చేసిన ఆర్వో ప్లాంట్ చెడిపోయి కొన్ని నెలలు అవుతున్న పట్టించుకున్న నాధులే లేరని అయన ఆరోపించారు.ఆర్వో ప్లాంటును పునరుద్ధరించి శుద్దీకరణ త్రాగు నీరు ఆనందించాలని అన్నారు.కేవలం ఇక్కడనే కాదు జిల్లా వ్యాప్తంగా అనేక వసతి గృహాలు సమస్యల వలయంలో కొట్టుమిట్టాడుతున్నాయని అయన అన్నారు. ఇన్ని సమస్యలు ఉంటె వాటిని పరిష్కరించాల్సిన    రాష్ట్ర ప్రభుత్వం, గిరిజన అభివృద్ధి సంస్థలు ఎక్కడికి వెళ్లాయో అర్ధ కావడం లేదని అన్నారు. విద్య సంవత్సరం 60 శాతం పూర్తి కావస్తున్నా నేటికీ ఏక రూప దుస్తులు పంపిణి చేయకపోవడం , పూర్త్తి స్థాయిలో పాఠ్యపుస్తకాలు ఇవ్వపోకవడాం చూస్తుంటే ప్రభుత్వ విద్య పైన ప్రభుత్వానికి ఎంత మేరకు పట్టింపు ఉన్నదో స్పష్టం అవుతుందని అన్నారు.   తెరాస ప్రభుత్వం  విద్య వ్యవస్ధను బ్రష్టు పట్టిస్తోందని ఆరోపించారు. విద్య వ్యవస్థ పైన సవితి తల్లి ప్రేమను ప్రభుత్వం విడనాడాలని అన్నారు. ఆయన వెంట పట్టణ కార్యదర్శి జాడి సాయికుమార్, అధ్యక్షులు పడాల సంపత్, నాయకులు  సంజయ్, సాగర్ విద్యార్థులు పాల్గొన్నారు.

Friday, 1 December 2017

ఎయిడ్స్ ను తరిమి కొడదాం అవగాహన ర్యాలీ ; డాక్టర్లు కుమార్, నాగమణి

ఎయిడ్స్ ను తరిమి కొడదాం    అవగాహన ర్యాలీ ;   డాక్టర్లు కుమార్,  నాగమణి  
 
కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా (వుదయం ప్రతినిధి) డిసెంబర్  01 : ప్రపంచ ఎయిడ్స్ దినోత్సవ సందర్భంగా  రెబ్బెన  ప్రభుత్వ ప్రాధమిక ఆసుపత్రి డాక్టర్ల ఆధ్వర్యంలో  రెబ్బెన మండల కేంద్రంలో ర్యాలీ  నిర్వహించారు. ఈ సంధర్భంగా ఆసుపత్రి సిబ్బందితో ప్రతిజ్ఞ చేయించారు. ఈ సందర్భంగా డాక్టర్ కుమార్, డాక్టర్  నాగమణి  మాట్లాడుతూ ఎయిడ్స్ పై ప్రతిఒక్కరు అవగాహన కల్పించుకోవాలని ,, వ్యాధిగ్రస్తులను వివక్షతో చూడవద్దని, సరైన మందులు సకాలంలో వాడితే వ్యాధి నియంత్రణలో ఉంటుందని అన్నారు.ప్రతిఒక్కరు ఆరోగ్యకరమైన జీవన విధానాన్ని అలవర్చుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో సంతోష్, పావని, కమలాకర్, మరియు సిబ్బంది పాల్గొన్నారు. 

సెర్ప్‌ ఉద్యోగులను క్రమబద్ధీకరించాలి 33 వ రోజుకు సమ్మె

 సెర్ప్‌ ఉద్యోగులను క్రమబద్ధీకరించాలి 33  వ  రోజుకు సమ్మె 

కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా (వుదయం ప్రతినిధి) డిసెంబర్  01 : సెర్ప్‌ ఉద్యోగులను క్రమబద్ధీకరించాలని, సమాన పనికి సమాన వేతనం చెల్లించాలని కోరుతూ కలెక్టరేట్‌ ఎదుట చేపట్టిన నిరవధిక  సమ్మె శుక్రవారం 33వ రోజుకు చేరింది.     ఈ సందర్భంగా వారు  మాట్లాడుతూ   ప్రభుత్వం తమ డిమాండ్ లను పరిష్కరించడానికి ముందుకు రాకపోవడం శోచనీయమని అన్నారు. సెర్ప్‌ ఉద్యోగుల డిమాండ్లను నెరవేర్చటంలో ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందన్నారు. గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థలో పనిచేస్తున్న ఉద్యోగులు  తమ డిమాండ్ లన్ని హేతుబద్దమైనవని వెంటనే ప్రభుత్వం స్పందించి   డిమాండ్లను నెరవేర్చాలని కోరారు.ఈ  కార్యక్రమంలో జాడి  సంపత్, భీం రావు, హన్మంతు, సురేష్, శంకరయ్య, ముక్తేశ్వర్, రాజేశ్వర్,, తదితరులు పాల్గొన్నారు.