జాగృతి పోస్టర్లు ఆవిష్కరణ
రెబ్బెన: (వుదయం ప్రతినిధి); తెలంగాణా జాగృతి ఆధ్వర్యములో రెబ్బెన లో శుక్రవారం పోస్టర్లను విడుదల శేశారు. ఈ సందర్బంగా యువ జన విభాగం జిల్లా కో కన్వీనర్ మహేష్ గౌడ్ మాట్లాడుతూ అక్టోబర్ 4 న గెస్ట్ హౌజ్ ఆవరణలో బతుకమ్మ వేడుకలు నిర్వహించ బడతాయని, మండలములోని అన్ని పంచాయతీల సర్పంచులు , ఎం పి టి సి లు, నాయకులు పాల్గొనాలని అన్నారు . ఈ వేడుకలకు ముఖ్య అతిథులుగా ఎం ఎల్ సి పురాణం సతీష్ కుమార్ , ఎం ఎల్ ఏ కోవా లక్ష్మి లు వస్తున్నారని తెలిపారు . మండల కేంద్రములో జరిగే ఈ కార్య క్రమానికి మహిళలు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయగలరని పేర్కొన్నారు . ఈ కార్య క్రమములో ఎం పి పి సంజీవ్ కుమార్, జెడ్ ఫై టి సి బాబురావు , వైస్ ఎం ఫై ఫై రేణుక, సర్పంచ్ వెంకటమ్మ , ఉప సర్పంచ్ శ్రీధర్ , ఆసిఫాబాద్ మార్కెట్ చైర్ మెన్ శంకరమ్మ , టి ఆర్ ఎస్ మండల అధ్యక్షుడు స్రేధర్ , నాయకు లు చిరంజీవి గౌడ్ , నవీన్ జైస్వాల్, శ్రీనివాస్ గౌడ్ , , మదనయ్య , వెంకటేశ్వర గౌడ్ , సోమయ్య , రాపర్తి ఆశోక్ , రాజ్ కుమార్ , వెంకట రమణ లు ఉన్నారు.
No comments:
Post a Comment