కాంట్రాక్ట్ లెక్చలర్లను పర్మినెంట్ చేయాలి
రెబ్బెన: (వుదయం ప్రతినిధి); కాంట్రాక్టు లెక్చలర్లను పర్మినెంట్ చేయాలని కాంట్రాక్టు లెక్చలర్ల సంఘం గంగాధర్ అన్నారు. శుక్రవారం వాల్ పోస్టర్లు విడుదల చేశారు. అనంతరం వారు మాట్లాడుతూ పదవ పీఆర్సీ ప్రకారం నెలకు 37100 ఇవ్వాలని అన్నారు. కాంట్రాక్టు లెక్చలర్ల క్రమబద్ధీకరణ వేగవంతం చేయాలని అన్నారు. అదేవిధంగా మహిళా లెక్చలర్లకు ప్రసూతి సెలవులు ఇవ్వాలన్నారు. కాంట్రాక్టు లెక్చలర్ల అందరికి హెల్త్ కార్డులతో పాటు గ్రూప్ ఇన్సూరెన్సు ఇవ్వాలని అన్నారు. తీవ్ర జబ్బులతో బాధపడే వారిని కోరుకున్న ఉద్యోగంలో చేర్పించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో శ్రీనివాస్, ప్రవీణ్, ప్రకాష్, అమరేందర్, వెంకటేశ్వర్లు, నిర్మల, సుమలత, రామారావు, వరలష్మి, జాన్సీ, మల్లీశ్వరి, తదితరులు పాల్గొన్నారు.
No comments:
Post a Comment