ఐ.టి.ఐ కళాశాల ఫీజుల దోపిడీని అరికట్టాలి -దుర్గం రవీందర్
రెబ్బెన: (వుదయం ప్రతినిధి); ప్రైవేట్ ఐ.టి.ఐ కళాశాలల్లో అక్రమంగా వసూలు చేస్తున్న ఫిజులను అరికట్టాలి.ఏ ఐ ఎస్ యఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి దుర్గం రవీందర్ డిమాండ్ చేసారు . ఈ సందర్భంగా విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ జిల్లా లోని ప్రైవేట్ ఐ.టి.ఐ కళాశాలల్లో విచ్చలవిడిగా ఫీజులు వసూలు చేస్తున్న సంబంధిత శాఖ అధికారులు చూచిచూడనట్లుగా వ్యవహరిస్తున్నారని అన్నారు సింగరేణిలో ఉద్యోగ అవకాశాలు లభిస్తున్నాయనే ఆశతో విద్యార్థులు ఐ.టి.ఐ కళాశాలల్లో చేరుతున్నారని ,దీనిని ఆసరాగా చేసుకొని యాజమాన్యులు విద్యార్థుల నుండి 30000 నుండి 35000 వరకు ఫీజుల రూపంలో వసూలు చేస్తున్నారని ,అంతే కాకుండా పరీక్ష ఫీజుల పేరిట వేలాది రూపాయలు దండుకుంటారన్నని అన్నారు . ఎలాంటి వసతులు కల్పించకుండా నిర్లక్షము వహిస్తూ ధనార్జనే ద్యేయంగా వ్యవహరిస్తున్నారని అన్నారు. కొన్ని కళాశాలల్లో అక్రమంగా అడ్మిషన్లు చేసుకుంటున్నారని అలాంటి కళాశాలను గుర్తుంచి క్రిమినల్ కేసులు నమోదు చేయాలనీ డిమాండ్ చేసారు . అధిక ఫీజులు తీసుకొంటున్న ఐ.టి.ఐ కళాశాలలపైనా చర్యలు తీసుకోవాలని లేని పక్షములో ఏ ఐ ఎస్ యఫ్ ఆధ్వర్యములో ఆందోళనలు నిర్వహిస్తామని అలాగే జిల్లా కలెక్టర్, ఆర్ డి డి (వరంగల్ ) గారికి త్వరలోనే ఏ ఐ ఎస్ యఫ్ ఆధ్వర్యములో పిర్యాదులు చేయనున్నట్లు తెలియజేసారు. ఈ కార్యక్రమంలో డివిజన్ కార్యదర్శి సాయి ,మండల అధ్యక్షులు రవి, మహిపాల్ ,శేఖర్ తదితరులు పాల్గొన్నారు.
No comments:
Post a Comment