విద్య రంగ సమస్యలను పరిష్కరించాలి ; పుదారి సాయికిరణ్
రెబ్బెన: (వుదయం ప్రతినిధి); రెబ్బన మండలలో విద్య రంగ సమస్యలను పరిష్కరించాలని ఎ ఐ ఎస్ ఫ్ డివిజన్ కార్యదర్శి పుదారి సాయికిరణ్ అన్నారు. అఖిల భారత విద్యార్థి సమాఖ్య అద్వర్యం లో రెబ్బెన తహశీల్ధార్ రమేష్ గౌడ్ కు వినతిపత్రాన్ని బుధవారం అందజేశారు. అనంతరం మాట్లాడుతూ ముఖ్య మంత్రి కె సి ఆర్ ఎన్నికలకు ముందు ఎన్నో వాగ్దానాలు చేసి మోస పూరితంగా వ్యవహరిస్తున్నారని , హామీలకు మాత్రమే పరిమితమయ్యారని అన్నారు . కె జి నుండి పిజి వరకు ఉచిత విద్యను వెంటనే అమలు చేయాలని , కళాశాలల్లో ని విద్యార్థులకు మధ్యాహన భోజనాన్ని పెట్టించాలని తెలిపారు . హాస్టళ్లల్లో పర్మినెంట్ వార్డెన్లను, వాచ్మెన్ లనురెగ్యులర్గా నియమించాలని డిమాండ్ చేశారు . ఖాళీగా ఉన్న ఎం ఐ ఓ , డి ఐ ఓ పోస్టులను భర్తీ చేయాలని , పాఠశాలల విలీననాన్ని విరమించుకోవాలని పేర్కొన్నారు . కనీస వసతులు లేని పాఠశాలల, కళాశాలల గుర్తింపు రద్దు చేయాలని అన్నారు . లేని పక్షంలో ఉద్యమాన్ని ఉదృతం చేస్తామని హెచ్కరించారు . నాయకులు మహేందర్ , సంపత్ , వినయ్ , శివ శంకర్ , మహిపాల్ , సందీప్ , శ్రీకాంత్ , వెంకటేష్ , ప్రశాన్తలు ఉన్నారు .
No comments:
Post a Comment