Friday, 23 September 2016

సంస్థ అభివృద్ధికి పాటుపడుదాం -జి ఎం రవిశంకర్

సంస్థ అభివృద్ధికి పాటుపడుదాం -జి ఎం రవిశంకర్ 

రెబ్బెన: (వుదయం ప్రతినిధి); ప్రతి కార్మికుడు  సింగరేణి సంస్థ మనది అనుకుని సమిష్టి కృషితో  అభివృద్దికి పాటుపడదామని జి ఎం రవిశంకర్ అన్నారు . బెల్లంపల్లి ఏరియాలోని ఖైరి గూడా ఓపెన్ కాస్ట్ లో మల్టి మీడియా డిపార్ట్మెంట్ సమావేశములో పాల్గొని మాట్లాడారు . సంస్థలో పని చేసే ప్రతి ఒక్కరు అంకిత భావముతో ఉత్పత్తి ఉత్పాదకతపై ద్రుష్టి సారించాలని తెలిపారు . జులై 2016 నాటికి 60 కోట్ల నష్టముతో ఉన్నదని  ఈ నష్టము నుండి బయట పడాలంటే రాబోయే కాలములో యంత్రాల వినియోగం పెరగాలని , కార్మికుల పని గంటలు విఇనియోగం పెంచాలని అన్నారు . ఖర్చులు తగ్గించుకోవాలని తెలిపారు . మల్టి డిపార్ట్మెంటల్ సభ్యుడు యోహాన్ స్లైడ్స్ ద్వారా లాభ నష్టాలు అభివృద్ధి పనులు వివరించారు . 300మంది కార్మికులు , సూపెర్విశేర్లు పాల్గొని సూచనలు ఇచ్చ్చారు . ఈ కార్యక్రమములో అధికారులు మోహన్ రెడ్డి , రమేష్  , , చిత్తరంజన్,  రామారావు , రాజమల్లు , నాయకులూ సదాశివ్ , తిరుపతి కో ఆర్డీ నేటర్ కుమారా స్వామీ   ,   సెల్ కమ్యూనికేషన్ అధికారి రాజేశ్వర్ లు ఉన్నారు . 

No comments:

Post a Comment