విద్యార్థి దశ నుండే సమాజ సేవ అలవర్చుకోవాలి
రెబ్బెన: (వుదయం ప్రతినిధి); విద్యార్థి దశ నుండే సమాజ సేవ ను అలవర్చుకోవాలని సాయి విద్యాలయం ఇంగ్లిష్ మీడియం స్కూల్ కరస్పాండెంట్ ఢీకొండ విజ కుమారి అన్నారు . రెబ్బెన సాయి విద్యాలయం ఇంగ్లీష్ మీడియం స్కూల్ లో మంచిర్యాలలో డైమండ్ చారిటబుల్ ట్రస్ట్ స్వాచ్చ్చంద సంస్థకు , పేద విద్యార్థుల కోసం ఉపాధ్యాయులు మరియు విద్యార్థులు కలిసి 8025 రూపాయలు నగదును ఆ సంస్థ సభ్యుడు నాగరాజు కు అందచేశారు. అనంతరం పాఠశాల ప్రధాన ఉపాద్యాయుడు డికొండ సంజీవ్ కుమార్ మాట్లాడుతూ మన కోసం మనం కాకుండా ఇతరులకు సహాయం చేయడములో ముందుకు రావాలని తెలిపారు . పేద విద్యార్థుల కోసం సహాయం చేయుటలో మా పాఠశాల విద్యార్థులు ముందంజలోఉన్నారని అన్నారు. ఈ సందర్భముగా ట్రస్ట్ సోషల్ వర్కర్ నాగరాజు,పాఠశాల ఉపాధ్యాయులు రాజన్న, తిరుపతి ,సుజాత ,మల్లీశ్వరి ,విద్యాసాగర్ ,రేష్మ, ఉష, వినిత,ఆశలతో విద్యార్థులు పాల్గొన్నారు
No comments:
Post a Comment