కాంట్రాక్టు కార్మికులకు అవకాశం కల్పించాలి
రెబ్బెన వుదయం ప్రతినిధి సింగరేణి యాజమాన్యం తలపెట్టిన మీ కోసం మీ ఆరోగ్యంకోసం కార్యక్రమంలో కాంట్రాక్టు కార్మికులకు అవకాశం కలిపించాలని సింగరేణి కాంట్రాక్టు వర్కర్స్ యూనియన్ బ్రాంచి ప్రెసిడెంట్ బోగే ఉపేందర్ , మండల కార్యదర్శి రాయిల్ల నర్సయ్యలు సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతు యాజమాన్యం కార్మికులు వారి కుటుంబాల ఆరోగ్యం కోసం తలపెట్టిన దానిలో కాంట్రాక్టు కార్మికులకు అవకాశం కల్పించాలని అన్నారు గత 15సం లు గా కాంట్రాక్టు కార్మికులు సింగరేణి యాజమాన్యం లాభాలు రావడానికి , మరియు సంస్థ అభివృద్ధికి ఎంతో దోహదపడుతున్నారు కాంట్రాక్టు కార్మికులు , పర్మనెంట్ కార్మికులు అనే భేదంతో వారిని విభజించి పాలిస్తున్నారన్నారు పర్మనెంట్ కార్మికులను పట్టించుకోని కాంట్రాక్టు కార్మికులను పట్టించుకోక పోవడం చాల బాధాకరం అని అయన అన్నారు.
No comments:
Post a Comment