రెబ్బెన: (వుదయం ప్రతినిధి); ప్రభుత్వ విద్య ఫై రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యం ప్రదర్శిస్తు సవితి తల్లి ప్రేమ వహిస్తుందని ఏ ఐ ఎస్ ప్ జిల్లా ప్రధాన కార్యదర్శి దుర్గం రవీందర్ ఆరోపించారు. శుక్రవారం రెబ్బన మండలం గోలేటి లోని కే ఎల్ మహేంద్ర భవనం లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశం లో మాట్లాడుతూ తెరాస ప్రభుత్వం అధికారం లో కి వచ్చి రెండున్నర సంవత్సరాలు కావస్తున్నా పేద బడుగు బలహీన వర్గాల విద్యార్థులకు ప్రభుత్వ విద్య అందని ద్రాక్ష ల మిగిలి పోతుందని అన్నారు. కెసిఆర్ ఎన్నికల సందర్బంగా ఇచ్చిన కేజి టూ పిజి హామీని ని వెంటనే అమలు చేయాలనీ డిమాండ్ చేసారు.ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో కూడా మధ్యాహ్న భోజనాన్ని పెట్టాలని , సంక్షేమ వసతి గృహాల్లో నెలకొన్న సమస్యలు పరిష్కరించి ప్రతి వసతి గృహానికి శాశ్వత వార్డెన్ ,వాచ్ మెన్ ,కుక్ , కామాటి పోస్ట్ లను వెంటనే భర్తీ చేయాలని డిమాండ్ చెసారు ఈ కార్యక్రమాం లో ఏ ఐ ఎస్ ప్ డివిజన్ కార్యదర్శి పూదరి సాయి, మండల అధ్యక్షులు కస్తూరి రవి కుమార్ ,ఉపాధ్యక్షులు మహిపాల్ , శేఖర్ తదితరులు పాల్గొన్నారు.
No comments:
Post a Comment