Wednesday, 7 September 2016

గణేష్‌ ఉత్సవాలను శాంతియుతంగా నిర్వహించాలి

గణేష్‌ ఉత్సవాలను శాంతియుతంగా నిర్వహించాలి 



రెబ్బెన: (వుదయం ప్రతినిధి); గణేష్ ఉత్సవాలను అందరూ కులమతాలకు అతీతంగా ఐక్యమత్యంతో సోదరభావంతో 11రోజుల పాటు జరిగే గణేష్ ఉత్సవాలను శాంతియుత వాతావరణంలో నిర్వహించాలని తాండూర్ సీఐ కరుణాకర్ పిలుపునిచ్చారు. ఆదివారం రెబ్బెన అతిధి గృహావరణలో  పోలీసులు  గణేష్ ఉత్సవ కమిటి సభ్యులకు  అవగాహన సమావేశం నిర్వహించారు.ఈసందర్బంగా సీఐ కరుణాకర్ మాట్లాడుతూ ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా 11రోజుల పాటు భక్తి శ్రద్దలతో సాంప్రదాయ బద్దంగా నిర్వహించాలని గణేష్ మండళ్ల నిర్వహకులకు సూచించారు. ఉదయం ఆరుగంటల నుంచి రాత్రి పది గంటల వరకు మాత్రమే మైకులు వాడాలని ఆతర్వాత ఎట్టి పరిస్థితుల్లో మైక్‌ వాడరాదని రెండు స్పీకర్లు మాత్రమే వాడాలని డిజె సౌండ్‌ సిస్టమ్‌ వాడటానికి అనుమతిలేదని  సూచించారు. గణేష్ మండలి వద్ద ఎలాంటి అల్లర్లు జరగకుండా కమిటీ సభ్యులే భాద్యత వహించి చివరి నిమర్జనం రోజున  ఎలాంటి అవకతవకలు జరగకుండా నవరాత్రి ఉత్సవాలను ముగించాలని కోరారు.   ఈ సమావేశంలో రెబ్బన ఎస్సై దారం సురేష్ , ఎంపీపీ కార్నాధం సంజీవ్ కుమార్  , జడ్పిటిసి బాబురావు, నార్లాపూర్ సర్పంచ్ భీమేష్ రెబ్బెన ఉప సర్పంచ్ బొమ్మినేని శ్రీధర్ ,సింగిల్ విండో డైరెక్టర్ మదనయ్య, సుదర్శన్ గౌడ్ ,దుర్గం సోమయ్య తదితర   గణేష్ ఉత్సవకమిటీ సభ్యులు పాల్గొన్నారు.

No comments:

Post a Comment