Friday, 2 September 2016

ఏ ఐ టి యూ సి, ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ దిష్టి బొమ్మ దహనం

ఏ ఐ టి యూ సి, ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ దిష్టి బొమ్మ దహనం

  రెబ్బెన: (వుదయం ప్రతినిధి);దేశ వ్యాప్తిత సమ్మెలో భాగంగా సింగరేణి కాంట్రాక్టు వర్కర్స్ యూనియన్ మరియు ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ దిష్టి బొమ్మను గోలేటిలో దహనం చేశారు. ఈ సందర్బంగా ఏ ఐ టి యూ సి  బ్రాంచ్ అధ్యక్షుడు బోగే ఉపేందర్ మాట్లాడుతూ కార్మికులకు కనీసవేతనం 18వేలు ఇవ్వాలని, కాంట్రాక్టు ఔట్  సోర్సింగ్ లను రద్దు చేసి రెగ్యులర్  చేయాలనీ అన్నారు. కేంద్ర ప్రభుత్వ స్కిం లలో  పనిచేస్తున్న వారిని కార్మికులుగా గుర్తించాలని అన్నారు. కార్మిక చట్టాల సవరణను నిలిపివేయరన్నారు. ప్రభుత్వ కార్మిక చట్టాలను పకడ్బందీగా అమలు చేయాలన్నారు. కేంద్ర ప్రభుత్వ వాటాల అమ్మకాన్ని ఆపాలన్నారు. 45రోజుల్లో కార్మికుల సంఘాల రిజిస్ట్రేషన్ చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో ఏఐటీయూసీ మండల కార్యదర్శి రాయిల్ల నర్సయ్య, బ్రాంచ్ ఉపాధ్యక్షుడు ఆరెపల్లి రామస్వామి, సహాయ కార్యదర్శులు రాం కుమార్, నాయకులు శంకర్, రాజ శేఖర్, ఏఐఎస్ఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి దుర్గం రవీందర్, పూదరి సాయి కిరణ్ తదితరులు పాల్గొన్నారు.

No comments:

Post a Comment