ఘనం గా చాకలి ఐలమ్మ వర్ధంతి...
రెబ్బెన: (వుదయం ప్రతినిధి);రెబ్బెన మండల కేంద్రంలోని R&B గెస్ట్ హోజ్ లో శనివారం రోజున చాకలి ఐలమ్మ 31వ వర్దంతి ని రజక సంఘం అధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు ఐలమ్మ చిత్రపటానికి పూల మాలలు వేసి కొబ్బరికాయలు కొట్టారు అనంతరం తెలంగాణ రాష్ట్ర రజక సంఘం మండల అధ్యక్షా కార్యదర్శి లు మాట్లాడూ తూ తెలంగాణ ర్తెతంగా సాయుధ పోరాటం చేసి దళిత బడుగు బలహిన వర్గాల. ప్రజల పోరాడిన వీర వనిత ని కొనియాడారు.తెలంగాణ రాష్ట్రం వచ్చ కా చాకలి ఐలమ్మ ను గుర్తించక పోవడం ఆమె వర్దంతి ని అధికారికంగా నిర్వహించక పోవడం భాధకరమని అన్నారు.తెలంగాణ. ప్రభుత్వనికి ఉద్యమ సమయంలో అయిలమ్మ ఉద్యమ స్ఫూర్తితో తెలంగాణ ఉద్యమం చేస్తానని చెప్పి తెలంగాణ వచ్చాక పట్టించుకోక పోవడం కే సీ ఆర్ దోరతనం కు నిదర్శనము అని అన్నారు చాకలి ఐలమ్మ విగ్రహాన్ని ట్యాంక్ బండ్ మరియు ప్రతి డివిజన్ కేంద్రం లో ఏర్పాటు చేయాలన్నారు.ఈ కార్యక్రమం లో రజక సంఘం నాయకులు గడ్డం సుధాకర్,కొత్తపల్లి అశోక్,కొండపర్తి జనగామ విజయ్ కుమార్,రంజిత్ కుమార్,సత్తన్న,కడతల సాయి,సంగం శ్రీనివాస్,డా" శ్రీను,శ్రీకాంత్,రాంబాబు,రవిందర్ తో పాటు తదితరులు పాల్గొన్నారు.
No comments:
Post a Comment