Friday, 23 September 2016

ఉగ్ర వాద దాడి నీచమైనది

ఉగ్ర వాద దాడి నీచమైనది 

రెబ్బెన: (వుదయం ప్రతినిధి); భారత సైన్యం పై ఉగ్రవాదులు దాడి చేయడం అతి నీచమైన చర్య అని రెబ్బెన ఫ్రెండ్స్ యూత్  సభ్యులు అన్నారు.  శుక్రవారం రెబ్బెన ప్రముఖ వీధుల గుండా క్రొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు . అనంతరం వారు మాట్లాడుతూ కుల , మాత ప్రాంతాలకు అతీతంగా అందరు కలిసిమెలిసి ఉండే భారత దేశం పై ఉగ్రవాదులు నిద్రిస్తున్న సైనికులపై దాడి చేయడం పిరికి దద్దమ్మల చర్య అని వారు మండిపడ్డారు . జమ్మూ కాశ్మిర్ యూరి  సైనిక స్థావరం పై ఉగ్రవాదులు దాడి చేసి 18 మంది వీర జవాన్లను పొట్టన పెట్టుకున్న ఉగ్రవాదులను పట్టుకొని వారి కి గుణపాఠం చెప్పాల్సిన అవసరం ఉందని వారు  అన్నారు . 

No comments:

Post a Comment