రెబ్బెన పోస్ట్ మ్యాన్ నిర్లక్ష్యం తో అందని చెక్కు
ఆందోళనలో బాధితులు
ఆందోళనలో బాధితులు
రెబ్బెన: (వుదయం ప్రతినిధి); రెబ్బెన మండల కేంద్రములో గల పోస్ట్ మ్యాన్ నిర్లక్ష్యముతో బాదితునికి సరియైన సమయములో చెక్కు అందలేదని బాధిత కుటింబీకులు లబో దిబో అంటున్నారు . రెబ్బెనలో నివాసముంటున్న సయ్యద్ ముజాహిద్ ఉద్దిన్ గత కొంత కాలంగా వ్యాధితో బాధ పడుతూ చికిత్స పొందుతుండే వాడని , వారు పేద కుటుంభానికి చెందిన వాడని బంధువులు తెలిపారు . చికిత్స కోసం ముఖ్య మంత్రి సహాయ నిధికి దరఖాస్తు చేసుకోగా తేదీ 29/ 07/ 2016 నాడు 40000/-రూపాయల చెక్కు మంజూరు అయిందని భార్య హజార బేగం బంధువులు ఎజాజ్ , ఖాయడ్ ఉద్దీన్ తెలిపారు . కుటుంభానికి ఆ సమయములో డబ్బులు అందితే ఎంతో కొంత ఊరటగా ఉండేదని భార్య ఆవేదన వ్యక్తం చేసింది . ముజాహిద్ ఉద్దీన్ తేదీ 08 / 08 / 2016 నాడు మృతి చెందగా , మంజూరు అయినా చెక్కు మాత్రం స్థానిక పోస్టుమ్యాన్ 19 / 09 / 2016 రోజున మృతుని బంధువులకు ఇవ్వడముతో విషయం బయటకు పొక్కింది . కాగా చెక్కు కాలపరిమితి అయిపొయింది . దింతో ఏమి చేయలేక బంధువులు స్థానికులతో పోస్ట్ ఆఫిస్ కు వెళ్లి పోస్ట్ మాస్టర్ను నిలదీశారు . పోస్ట్ మాస్టర్ కె మధుకర్ మాట్లాడుతూ పోస్ట్ డెలివరీ 29/07/2016 న చేశామని , అతనిపై చర్యలు తీసుకొనే అధికారం మాకు లేదని ఆయన అన్నారు . పిర్యాదు ఇస్తే తపాలా ఉన్నత అధికారులకు నివేదికను పంపిస్తామని తెలిపారు . ఎజాజ్ తో పాటు టి ఆర్ ఎస్ జిల్లా ఉపాధ్యక్షుడు నవీన్ కుమార్ జైస్వాల్ , నాయకులు ఖయాద్ ఉద్దీన్ చిరంజీవిగౌడ్ గోగర్ల ప్రవీణ్ చోటు లు ఉన్నారు .
No comments:
Post a Comment