Wednesday, 21 September 2016

పురుగుల మందు సేవించి యువతి ఆత్మహత్య

  పురుగుల మందు సేవించి యువతి ఆత్మహత్

రెబ్బెన: (వుదయం ప్రతినిధి); రెబ్బెన మండలంలోని తక్కళ్లపల్లి గ్రామానికి చెందిన  తన్నీరు జ్యోతి(20)బుధవారం రోజున పురుగుల మందు త్రాగి ఆత్మహత్యకు  పాల్పడింది.రెబ్బెన ఎస్ ఐ డి. సురేష్  కథనం ప్రకారం మృతురాలు తాండూర్ విద్యాభారతిలో డిగ్రీ చివరి సంవత్సరం చదువుతుందని తెలిపారు . జ్యోతి   ఈ నెల 16 న చెవినొప్పితో  భాద పడుతూ స్థానిక ఆర్.యం.పి డాక్టర్ బి.రాజ్ కుమార్ వద్దకు వెళ్లిందని  ,  అతను వైద్యం చేస్తున్న క్రమంలో మృతురాలితో అసభ్యంగా ప్రవర్తించాడు . దీంతో ఈ నెల 19న జ్యోతి  ఆర్.యం.పి వైద్యుడి వద్దకు వెళ్లి అతన్ని కొట్టడం జరిగింది . విషయం బయటికి పొక్కటంతో గ్రామస్థులు యువతిని తప్పుపట్టారు. ఈమె రు. దీంతో మనస్థాపం చెందిన యువతీ బుధవారం ఉదయం ఆత్మహత్యకు పాల్పడిందని తండ్రి శ్రీనివాస్ పేర్కొన్నారు . . శ్రీనివాస్ ఇచ్చిన  పిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లుఎస్ ఐ దారం సురేష్  తెలిపారు.   సంఘటన స్థలాన్ని సి ఐ కరుణాకర్ సందర్శించారు.

2 comments: