Friday, 16 September 2016

వార్షికోత్సవాలను విజయవంతం

  వార్షికోత్సవాలను విజయవంతం 

రెబ్బెన వుదయం ప్రతినిధి తెలంగాణ సాయుధ పోరాట వార్షికోత్సవాలను విజయవంతం చేయాలనీ పొన్నం శంకర్   అన్నారు రెబ్బెన మండలంలోని ప్రయాణ ప్రాంగణంలో మంగళవారం సి పి ఐ జెండాను ఆవిష్కరించి అనంతరం వారు మాట్లాడుతూ నాటి నైజం నిరంకుశ పాలన అంతం కోసం భూ స్వామ్య వర్గాల దోపిడీకి రజాకార్ల దౌర్జన్యాన్ని వ్యతిరేకముగా భారత కమ్యూనిస్టు పార్టీ  సి పి ఐ తెలంగాణ సాయుధ పోరాటాన్ని సాగించింది ఈ పోరాటంలో 4500 మంది కమ్యూనిస్టు ఉద్యమకారులు తమ అమూల్యమైన ప్రాణాలు అర్పించారు ఈ వీరోచిత సాయుధ పోరాటం వలన నిజం నిరంకుశ పాలన అంతమైంది 1948 సెప్టెంబర్ 17 నాడు తెలంగాణ విముక్తి సాదించి  భారతదేశంలో తెలంగాణ విలీనం చేయబడింది తెలంగాణ సాయుధ పోరాటం భారతదేశంలో భూ సంస్కారణ లకు కౌలుదారు శాసనాలకు వెట్టి చాకిరి నిర్ములనకు అనేక చట్ట సంస్కారణల ఆవశ్యకతకు మార్గదర్శకం  చూపించింది అని అన్నారు. కావున సెప్టెంబర్ 17 తెలంగాణ విమోచ దినం ను ప్రభుత్వం అధికారకంగా చేపట్టాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో జగ్గయ్య , బోగే ఉపేందర్, రాయిల్లా నర్సయ్య, సాయి తదితరలు ఉన్నారు. 

No comments:

Post a Comment