రెబ్బెనలో ఘనముగా భగత్ సింగ్ జయంతి
రెబ్బెన: (వుదయం ప్రతినిధి); రెబ్బెన మండలం కేంద్రంలోని స్థానిక వసతి గృహంలో భగత్ సింగ్ జయంతి ఘనముగా నిర్వహించారు. తెలంగాణ విద్యార్థి వేదిక జిల్లా అధ్యక్షుడు కడ్తల సాయి అద్వర్యంలో భగత్ సింగ్ స్వాతంత్ర్య ఉద్యమంలో కీలక పాత్ర పోషించి మరణాన్ని లెక్క చేయకుండా ఉద్యమ ఆకాంక్షను ప్రజలకు తెలియాని వీరమరణం పొందిన గొప్ప వ్యక్తి అని, విప్లవ కారుడు అని అన్నారు అయన ఆశయ సాధనకు యువత ముందుండాలి అని తెలంగాణ విద్యార్థి వేదికగా పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో టి వి వి జిల్లా ఉప అధ్యక్షుడు మేడి వినోద్ ,మండల కార్యదర్శి జాగిరి వేణు,నాయకులూ తిరుపతి, శ్రీనివాస్, వసంత్, కార్తీక్ తదితరులు పాల్గొన్నారు.
No comments:
Post a Comment