Wednesday, 7 September 2016

ఐకేపీ విఓఏ ల మండల నూతన కార్యవర్గం ఎన్నిక

 ఐకేపీ విఓఏ ల మండల నూతన కార్యవర్గం ఎన్నిక  

రెబ్బెన: (వుదయం ప్రతినిధి); ఐకేపీ విఓఏ ఉద్యోగుల సంఘం సమావేశం రెబ్బెన  గెస్టుహౌస్ లోమంగళవారం  నిర్వహించి నూతనకార్యవర్గం ఎన్నుకున్నారు. ఈ  సమావేశానికి డివిజన్ ఉపాధ్యక్షులు ఫైమా ముఖ్య అతిధి గా  హాజరురై మాట్లాడారు  విఓఏ ల సమస్యల గురించి మాట్లాడుతూ 40 నెలల బకాయి వేతనాలు ఇవ్వకుండా ,ప్రభుత్వం ఇచ్చిన 5000/- వేతనం హామీ నెరవేర్చకుండా విఓఏ లను పట్టించుకోకుండా వెట్టిచాకిరి చేయించుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు  . 10వ తేదీన తూర్పుజిల్లా మంచిర్యాల ఉద్యోగుల సర్వసభ్య సమావేశం బెల్లంపల్లి లో నిర్వహించడం జరుగుతుందని ఆ సమావేశానికి అందరు విఓఏ లు అధిక సంఖ్య లో హాజరై సమావేశాన్ని విజయవంతం చేయాలని కోరరు. అదేవిదంగా  రెబ్బెన మండల కమిటీ నూతన కార్యవర్గం ఎన్నుకున్నారు అధ్యక్షులుగా గజ్జెల్లి భీమేష్ ,ఉపాధ్యక్షులుగా నల్లగొండ వెంకటేష్ ,ప్రధానకార్యదర్శిగా మొర్లే తిరుపతి ,సహాయకార్యదర్శిగా మైలారం శ్రీనివాస్ ,కోశాధికారిగా డోంగ్రి తిరుపతి లను ఎన్నుకోవడం జరిగిందని తెలిపారు ఈ సమావేశం లొ  కమిటీ సభ్యులుగా కృష్ణ ,రవికుమార్ ,శంకర్ ,శ్రీకాంత్ ,పరమేష్ ,ప్రకాష్ ,ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు.

No comments:

Post a Comment