తొలగించిన అంగన్ వాడి లను వెంటనే విధుల్లోకి తీసుకోవాలి
రెబ్బెన: (వుదయం ప్రతినిధి);తొలగించిన అంగన్వాడీలను వెంటనే విధుల్లోకి తీసుకోవాలని సి ఐ టి యు ,ఏ ఐ టి యు, ఎన్ ఎస్ యు ఐ , ఐ కె పి నాయకులూ రమేష్ , రాయిలా నర్సయ్య , భరద్వాజ్ , డి తిరుపతి లు అన్నారు. శుక్రవారం రెబ్బన ప్రధాన రహదారి ఫై బైఠాయించి రాస్తా రోకో నిర్వహించారు . వారు మాట్లాడుతూ మధ్యాహన భోజన కార్మికులను , ఆశ వర్కర్లను , ఐ కె పి సిబ్బందిని ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించి పర్మినెంట్ చేయాలని డిమాండ్ చేశారు . కాంట్రాక్ట్ కార్మికులందరికి కనీస వేతనం 18000/- రూపాయలు ఇవ్వాలని పేర్కొన్నారు . అదే విదంగా కార్మిక చట్టాల సవరణను ఆపాలని , పి ఎఫ్ , ఏ ఎస్ ఐ సౌకర్యా కల్పించాలని తెలిపారు . ఈ కార్య క్రమములో నాయకులు ఆర్ శంకర్ , రామ , సరస్వతి , బాలమ్మ , చంద్రకళ రాజేశ్వరి , సుజాత , సుశీల , శ్రీనివాస్ లతో పాటు ఆశ వర్కర్లు , అంగన్వాడీ కార్య కర్తలు ఐ కె పి సిబ్బంది ఉన్నారు.
No comments:
Post a Comment