Saturday, 20 February 2016

నేటి నుంచి గంగాపూర్ జాతర

నేటి నుంచి గంగాపూర్ జాతర 


 రెబ్బెన: (వుదయం ప్రతినిధి) రెబ్బెన మండలం గంగాపూర్ గ్రామ శివారులోని బాలాజీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో నేడు జరుగు జాతరకు జిల్లాలోని నలుమూలల నుండి భక్తులు అధిక సంఖ్యలో తరలి వచ్చి మొక్కులు తీర్చుకుంటారు .జిల్లాలోని  మారుమూల గ్రామాల్లోని ప్రజలు ఎడ్లను అలంకరించుకుని జాతరకు రావడం ప్రత్యేక ఆకర్షణగా  నిలుస్తుంది.  జాతరలో ప్రభుత్వ ఆరోగ్య కేంద్రాల అద్వర్యంలో ఉచిత  వైద్య శిబిరం నిర్వహించడానికి ఏర్పాట్లు చేసారు.  ఎలాంటి అవాంచనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా బెల్లంపల్లి  డి ఎ స్పీ రమణారెడ్డి  అద్వర్యం లో రెబ్బెన ఎస్సై.  దారం సురేష్ బందోబస్త్  ఏర్పాటు చేసారు

No comments:

Post a Comment