Tuesday, 9 February 2016

కుటీర పరిశ్రమల స్థాపన-అభివృద్ధి శిక్షణ

కుటీర పరిశ్రమల స్థాపన-అభివృద్ధి శిక్షణ  


రెబ్బెన: (వుదయం ప్రతినిధి) రెబ్బెన మండలంలోని స్థానిక రెబ్బెన ఆర్ట్స్ అండ్ సైన్స్ డిగ్రీ కళాశాలో నిర్వహిస్తున్న కుటీర పరిశ్రమల స్థాపన అభివృద్ధి  శిక్షణా నిర్వహణ జరుగుతుంది. సోమవారం రోజునుండి మొదలైన కార్యక్రమం మంగళవారం తో  రెండవ రోజుకు చేరుకుంది ఈ కార్యక్రమానికి ముఖ్య అదిథిగా విచ్చేసిన  ఆదిలాబాద్ జిల్లా ఇండస్ట్రీయల్ ప్రమోషనల్ ఆఫీసర్ అశోక్  మాట్లాడుతూ ప్రభుత్వం ఇచ్చే సబ్సిడీ ల గురించి నిరుద్యోగులకు అవఘాహన కల్గించారు. ఆ తర్వాత లఘు పరిశ్రమల అభివృద్ధి సంస్థ డిప్యూటి జె యన్ మిశ్రా ప్రసంగిస్తూ  పరిశ్రమల స్థాపించటానికి రూపొందించాల్సిన ప్రాజెక్ట్ రిపోర్ట్ పై అవఘాహన కల్గించారు. ఈ కార్యక్రమం లో కళాశాల అకాడమిక్ డైరెక్టర్ హరినాథ్,  ప్రిన్సిపాల్ అమీర్ ఉస్మని, రీక్యాప్ అండ్ ఇంపాక్ట్ కో ఆర్డినేటర్లు వెంకట్, శోబన్ బాబు,  యువతీ యువకులు పాల్గొన్నారు

No comments:

Post a Comment