ఎ.ఐ.యస్.యఫ్ జిల్లా మహాసభ విజయవంతం
రెబ్బెన: (వుదయం ప్రతినిధి);అఖిల భారత విద్యార్ది సమాఖ్య ఎ ఐ యస్ యఫ్ జిల్లా నిర్మాణ మహ సభ గురువారం గోలేటి లోని కే యల్ మహేంద్ర భవన్ లో విజయవంతం గా జరిగింది. ఎ.ఐ.యస్.యఫ్ ప్రతినిధులు, విద్యార్దులు పాల్గొని విజయవంతం చేయాలనీ ఎ ఐ యస్ యఫ్ జిల్లా ఇంచార్జ్ యస్ తిరుపతి ఇచ్చిన పిలుపుకు విశేష స్పందన లభించింది. ఈయన మాట్లాడుతూ రాష్టంలో అనేక విద్యారంగ సమస్యలతో విద్యార్దులు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారని అన్నారు. గిరిజన యూనివర్సిటిని ఆదిలాబాద్ జిల్లా నుండి వరంగల్ కు తరలింఛి జిల్లా విద్యార్దులకు, ప్రజలకు తీవ్ర అన్యాయం చేస్తున్నారని అన్నారు. రాష్టంలో టిఆర్ఎస్ ప్రభుత్యం అధికారం లో ఉన్నప్పటికీ విద్యార్దుల సమస్యలు అలాగనే ఉన్నాయని,ఈ నిర్మాణ మహాసభలో విద్యార్దులు దుర్కొంటున్న సమస్యలపై చర్చించి భవిష్యత్ కార్యాచరణ ప్రకటించారు. ఈ కార్యక్రమంలో ఎ ఐ యస్ యఫ్ జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ దుర్గం రవీందర్, మండల అధ్యక్ష కార్యదర్శులు కస్తూరి రవికుమార్,పుదరి సాయి తదితరులు పాల్గొన్నారు
No comments:
Post a Comment