Tuesday, 9 February 2016

భూగర్బ జలాలను పెంపుకై ఇంకుడు గుంతల ఏర్పాటు

భూగర్బ జలాలను పెంపుకై  ఇంకుడు గుంతల ఏర్పాటు

రెబ్బెన: (వుదయం ప్రతినిధి) పరిశుబ్రతే లక్ష్యంగా, భూగర్బ జలాలను పెంచుకునే విధంగా ఇంకుడు గుంతలు ఏర్పాటు చేసుకోవాలని  మంగళవారం  రెబ్బెన మండల ఎంపీడీవో ఎంఎ అలీం మాట్లాడారు. ఈ పనులలో భాగంగా మండలం లోని అన్ని గ్రామాలలో ఇంకుడు గుంతలు నిర్మించుకొని పరిశుబ్రతను పాటించాలని అన్నారు   వాడల్లో మురికి నీరు  పారుతుండటం వాళ్ళ ప్రజలు అనారోగ్యాల పాలవుతున్నారని  ఈ విధంగా ఇంకుడు గుంతలు  నిర్మించుకోవటం వల్ల మురికి నీరు వాడల్లో చేరకుండా ఉంటుందని, భూగర్బ జలాలను పెంచుకునే విధంగా కూడా ఉపయోగపడుతుందని, మండలం లోని అన్ని గ్రామాల ప్రజలు సహకరించి ప్రతి ఒక్కరు తమతమ ఇళ్లలో ఇంకుడు గుంతలునిర్మించుకోవాలని, పొలాల్లో నీటి నిలువకోసం  వారు  కోరారు.  

No comments:

Post a Comment