గిరిజన యూనివర్సిటీ ని తరలిస్తే మరో ఉద్యమం
ఐఖ్య విద్యార్ధి సంఘం
ఐఖ్య విద్యార్ధి సంఘం
గిరిజన యునివర్సిటిని ఆదిలాబాద్ జిల్లాలోనే ఏర్పాటు చేయాలనీ ఐక్యవిద్యార్ధి సంఘాల నాయకులు ఎన్ ఎస్ యు ఐ జిల్లా ప్రధాన కార్యదర్శి దుర్గం భరద్వాజ్,టి వి వి జిల్లా అద్యక్షుడు కడతల సాయి, ఎ ఐ ఎస్ ఎఫ్ జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ దుర్గం రవీందర్ అన్నారు రెబ్బెన అర్ అండ్ బి భవనంలో బుధవారం విలేకరుల సమవేశంలో మాట్లాడుతూ తెలంగాణ ఉద్యమంలో ఆదిలాబాద్ జిల్లా విద్యార్ధులు అనేక ఉద్యమాలు నిర్వహించారు కానీ ఈ రోజు ముఖ్యమంత్రి కె సి అర్ ఆదిలాబాద్ జిల్లా ను మరిచిపోయి కేవలం వరంగల్ జిల్లకె ప్రాధాన్యత ఇవ్వడం సరికాదు తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే ఆదిలాబాద్ జిల్లా అభివృద్ధి చెందుతుందని విద్యార్ధుల భవిష్యత్ బాగుపడుతుందని విద్యారంగంలో ఆదిలాబాద్ జిల్లా అన్ని రకాలుగా వెనుకబడి ఉందని,అలాంటి జిల్లా నుండి యునివర్సిటిని వరంగల్ కు తరలించి జిల్లావిద్యార్థులకు అన్యాయం చేయకూడదని అన్నారు వరంగల్ కు యునివర్సిటిని తరలించేఆలోచనను విరమించుకోవాలని లేని పక్షంలో విద్యార్ధి ఉద్యమాలను దశల వారిగా కొనసాగిస్తామన్నారు అన్నారు
No comments:
Post a Comment