Monday, 15 February 2016

కన్నయ్య అరెస్ట్ అప్రజాస్వామికం,-ఎ ఐ ఎస్ ఎఫ్ ,ఎ ఐ వై ఎఫ్

          కన్నయ్య అరెస్ట్ అప్రజాస్వామికం,-ఎ ఐ ఎస్ ఎఫ్ ,ఎ ఐ వై ఎఫ్ 


 రెబ్బెన: (వుదయం ప్రతినిధి):  ఢిల్లీ జె ఎన్ యు అధ్యక్షులు కన్నయ్య అరెస్ట్ అప్రజాస్వామికం అని ఎ ఐ ఎస్ ఎఫ్ జిల్లా ప్రధాన కార్య దర్శిదుర్గం రవీందర్ ,ఎ ఐ వై ఎఫ్ జిల్లా ఉపాధ్యక్షులు బోగే ఉపేందర్ అన్నారు .ఈ సందర్బంగా రెబ్బెన లోని అర్ అండ్ బి అతిధి గృహం లో శనివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమవేశం లో మాట్లాడుతూ  ఢిల్లీ జె ఎన్ యు అధ్యక్షులు కన్నయ్యకుమార్ పై కక్ష కట్టి కావాలనే కేంద్ర ప్రభుత్వం అరెస్ట్ చేసిందని ,బి జె పీ అనుబంధ సంబందమైన ఎ బి  వి పీ  మెప్పు పొందించేందుకు కేంద్ర ప్రభుత్వం ఇస్తా రాజ్యాంగ వ్యవహరించడం తగదని దేశం లో వివిధ క్యాంపస్ లలో ప్రస్తుత అణచివేత పరిణామాలను ఎమర్జెన్సీ ని తలపిస్తున్నాయని ,వామ పక్ష విద్యార్ధి సంగాలను లక్ష్యంగా చేసుకొని ఎ బి వి పీ చెప్పిన విధంగా పోలీసులు వ్యవహరించటం ఎంతవరకు సమంజసం అని ,ఇది నిరంకుహ ధోరణులకు అద్దం పడుతుందని ,ప్రత్యేకించి విద్యసంస్థ ల లో భావ వ్యక్తీకరణ స్వేచ్చను దేబ్బతియటం అవుతుందని ,సాధారణ విద్యర్థులపై  దాడులకు దిగుతూ అర్  ఎస్  ఎస్ ,బి జె పీ ,ఎ బి వి పి  ,వారు క్యాంపస్ లలో బయనక పరిస్థితులను కల్పిస్తున్నారని ,ఈ తరుణం లో ఢిల్లీ పోలిసులు ఎ బి వి పీ కి అనుకూలంగా చర్యలు తీసుకోవటం అన్యాయం అని అన్నారు . ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం మతోన్మాద విధానలుమనుకోవాలని ,వామపక్ష విద్యార్ధి సంఘాలపై కక్ష సాధింపు చర్యలు మానుకోవాలని ,విద్యార్థి నేత కన్నయ్య ఫై పెట్టిన రాజద్రోహం కేసును వెంటనే ఎత్తివేయాలని ఎ ఐ ఎస్ ఎఫ్ జిల్లా కమిటి డిమాండు చేశారు. ఈ కార్యక్రమంలో మండల కార్యదర్శి పుదరి సాయి ,ఉపాద్యక్షులు మహిపాల్ ,ప్రదిప్ ,మండల సహాయక కార్యదర్శి రాజ్ కుమార్ ,కిశోర్  లు పాల్గొన్నారు 


     ఘనంగా వసంత పంచమి వేడుకలు 

                                                                                                                             
 రెబ్బెన: (వుదయం ప్రతినిధి): వసంత పంచమిని పురస్కరించుకొని రెబ్బెన మండలం లోని గోలేటి సెయింట్ అగ్నిస్ ఇంగ్లీష్ మీడియం పాఠశాల లలోశనివారం సరస్వతి దేవికి పులాభిషేకం చేసి చిన్న పిల్లలతో అక్షర అభ్యాసం చేపించారు . పాఠశాల ప్రిన్సిపాల్ కృష్ణకుమారి ,కరేస్పండేంట్ మాలిక్ , పాఠశాల సిబ్బంది పాల్గొన్నారు . అలాగే రెబ్బెన మండలం లోని పలు గ్రామాలలో  వసంత  పురస్కరించికొని  సరస్వతి దేవి కి పూజలు నిర్వహించి అక్షర అభ్యాసాలు నిర్వహించారు . 

No comments:

Post a Comment