దేవాలయ అభివృద్ధికి 5 కోట్ల నిధులు- ఆలయ చైర్మన్ గంటుమేర
రెబ్బెన: (వుదయం ప్రతినిధి);; ఆదిలాబాద్ జిల్లా రెబ్బెన మండలంలోని గంగాపూర్ శ్రీ బాలాజీ వెంకటేశ్వర దేవాలయాన్ని అభివృద్ధికి మరిన్ని సన్నాహాలు చేస్తున్నట్లు ఆలయ చైర్మన్ గంటుమేర అన్నారు, మంగళ వారం ఆయన మాట్లాడుతూ అవామీ వారి జాతర సందర్శానికి వచ్చిన రాష్ట్ర దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి ఇంద్ర కరణ్ రెడ్డి ఆలయ అభివృద్ధికోసం 5కోట్లు మంజూరు చేశారని ఆయన సంతోషాన్ని వ్యక్త పరిచారు. రాష్ట్ర ముఖ్య మంత్రి కెసిఆర్ దేవాలయాల అభివృద్ధికి కంకణం కట్టారని గంగాపూర్ దేవాలయాన్ని ప్రత్యేకంగా ముఖ్య మంత్రి దృష్టికి తీసుకెళ్తానని ఆలయాన్ని అన్ని హంగులతో రూపురేఖలు మారుస్తానని మంత్రి ఇంద్ర కరణ్ రెడ్డి చెప్పడం రెబ్బెన మండలానికి వరమని అన్నారు, అదే విధంగా రెబ్బెన నుండి గంగాపూర్ కు డబుల్ రోడ్డు, గోపురం, భక్తులకు అనుకూలంగా కళ్యాణ మండపం విస్తరణ చేస్తారని, భక్తులకు మరుగు దొడ్లు నిర్మిస్తామని అన్నారు, పురాతన దేవాలయం కావడంతో జాతర మూడో రోజుకు చేరిన భక్తుల తాకిడి కొనసాగుతూనే ఉంది,
No comments:
Post a Comment