Monday, 1 February 2016

తహశిల్దార్ కార్యాలయంలో వి.ఆర్.ఓ ల సమావేశం

  తహశిల్దార్ కార్యాలయంలో వి.ఆర్.ఓ ల సమావేశం 

రెబ్బెన: (వుదయం ప్రతినిధి); రెబ్బెన తహశిల్దార్ కార్యాలయంలో సోమవారం తహశిల్దార్ రమేష్ గౌడ్ వి ఆర్ ఓ సమావేశాన్ని ఏర్పాటు చేసారు ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ విఆర్ఓలు తమ గ్రామాకార్యాలయంలోరైతులకు అందుబాటులో ఉండాలని ఈ సంవత్సరం నడుస్తున్న పహనిలు 1బి  లు రైతులకు సకాలంలో అందించాలని ఏ గ్రామా వి ఆర్ ఓలు ఆ గ్రామా రైతుల పిర్యాదులు స్వీకరించి నెంబరింగ్ చేసి అందచేయాలని వి ఆర్ ఓల గ్రామకార్యలయంను విడిచివెళ్ళే టప్పుడు క్లస్టర్ రిజిస్టర్ లో నమోదు చేయాలనీ అన్నారు ఏ గ్రామా రికార్డులు ఆ గ్రామా అద్వర్యంలో పొందుపరచాలని  ఈనెల 3 నుండి ప్రతిగ్రామంలో కల్టివేటర్ ఋణ అర్హత కార్డులు మంజూరు అవుతాయని దీనిని కౌలుదారులు రైతు వద్ద కౌలు పత్రం వ్రాసుకొని  వి ఆర్ ఓల వద్ద వ్రాయించి మీ సేవ లో అందజేయాలని అర్హతగల రైతులకు ఋణ గ్రహీత పత్రాలు అందజేస్తామని తెలిపారు ఈ సమావేశంలో ఉప తహసిల్దార్ రామ్మోహన్ రావు, ఆర్ ఐ అశోక్, వి ఆర్ ఓలు ఈమ్లాల్ ,మల్లేష్ ,ధోని బాపు ,చంద్ర మొగిలి ,లక్ష్మి ,శ్రీను తదితరులు పాల్గొన్నారు

No comments:

Post a Comment