Thursday, 25 February 2016

గంగాపూర్ ఫాఠశాలలో ఉచిత వైద్య శిభిరం


గంగాపూర్ ఫాఠశాలలో ఉచిత వైద్య శిభిరం 



రెబ్బెన: (వుదయం ప్రతినిధి);  రెబ్బెన  మండలంలోని గంగాపూర్‌లోని కస్తుర్భవిద్యాలయం లో  గురువారం అభినవ సేవా సంస్థ ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు  రెబెన ఎస్ ఐ దారం సురేష్  మాట్లాడుతూ చిన్నతనం నుంచే వున్నత శికరాల అధిరోహించడానికి ప్రణాళికలు రూపొందించుకోవాలని సూచించారు భవిష్యత్ లో సమాజానికి ఉపయోగపడే స్తాయి లో లక్షాన్ని నిర్దేశిన్చుకోవాలని అన్నారు యువత చెడు అలవాట్లకు లోనుకాకుండా చదువుపైనే దృష్టి సారించాలని అన్నారు .ఈ శిబిరంలో డీజీవో రాధిక, ఫిజిథెరఫీ డాక్టర్‌ రాజ్‌కిరణ్‌లు,డాక్టర్ సరస్వతి  బాలికలకు  వైద్య పరీక్షలు నిర్వహించారు .ఈ కార్యక్రమంలో కస్తుర్భవిద్యాలయప్రిన్సిపాల్ గంగాపూర్ సర్పంచ్ ముంజం రవీందర్,సుమలత  ,రాధ ,ప్రమీల, క్రిష్ణవేణి, పద్మ తదితరులు పాల్గొన్నారు

రైలు ప్రమాదంలో ఒకరు మృతి

 రైలు ప్రమాదంలో ఒకరు మృతి 

రెబ్బెన: (వుదయం ప్రతినిధి);  రెబ్బెన మండలంలోని లక్ష్మిపూర్ గేటు సమీపంలో బుధవారం రాత్రి గుర్తు తెలియని రైలు డీకొని గంగాపూర్ నివాసి గందే వెంకమ్మ (72) అక్కడిక్కడేమృతి చెందింది  జి ర్ పి ఫ్ హెడ్ కానిస్టేబుల్ సత్తయ్య తెలిపిన వివరాల ప్రకారం మృతి రాలికి మతిస్తిమితం లేదని మృతురాలు బుధవారం రాత్రి 11:30ఇంటి నుంచి బయటకి వచ్చిన తర్వాత ప్రమాదవ శత్తు  చోటుచేసుకుందని  అన్నారు    ఈమెకు ఐదు గురు కుమారులు ఇద్దరు కూతురులు వున్నరు ఈ మేరకు కేసు నమోదు చేసి శవ పంచన పూర్తి చేసి శవాన్ని కుటుంబ సబ్యులకు అందచేశారు 

రెబ్బెన ప్రబుత్వ కళాశాలలో ఘనంగా వీడ్కోలు దినోత్సవం

రెబ్బెన ప్రబుత్వ కళాశాలలో ఘనంగా వీడ్కోలు దినోత్సవం  


 రెబ్బెన: (వుదయం ప్రతినిధి);; స్తానిక రెబ్బెన మండలంలోని ప్రబుత్వ జూనియర్ కళాశాలలో బుధవారం నాడు వీడ్కోలు దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా కళాశాల ప్రిన్సిపాల్ వెంకటేశ్వర్లు మాట్లాడుతూ విద్యార్తులు శ్రద్ధతో చదువుకొని ఉన్నత శికరాలకు ఎదగాలని అన్నారు ప్రబుత్వ కళాశాలలో  మంచి ఓపద్యయులు వుంటరాణి  వారి సూచనలు సలహాలను విద్యార్తులు సుచ తప్పకుండ పాటించాలని అన్నారు ఈ సందర్బంగా విద్యార్తిని విద్యార్తులు సంస్కృతిక నృత్యాలుతో అలరింప చేసారు జూనియర్ విద్యార్తులు సీనియర్ విద్యార్తులకు వీడ్కోలు పలికారు ఈ కార్యక్రమంలో కార్యక్రమములో ఎం.  ఇ.   ఓ. వెంకటేశ్వర్లు ,రిటైర్డ్ ప్రిన్సిపాల్ హరినాథ్, లెక్చరర్లు  రాజ్ కుమార్,  ప్రకాష్, శ్రీనివాస్ ,రామారావు , అమరేందర్ , గంగాధర్ ,ప్రవీణ్ జిల్లా పరిషత్  ఉన్నత పాటశాల హెడ్ మాస్టర్ స్వర్ణలత, తదితరులు ఉన్నారు.

రెండు ట్రాక్టర్లు పట్టివేత

రెండు ట్రాక్టర్లు పట్టివేత 
రెబ్బెన: (వుదయం ప్రతినిధి);;  రెబ్బెన మండలములోని కొండ పల్లి గ్వాగు నుండి అక్రమంగా తరలిస్తున్నా  రెండు ఇసుక ట్రాక్టర్లను మంగళ వారము రాత్రి పట్టుకున్నారు . అక్రమంగా ఇసుక తరలిస్తున్నారని సమాచారాన్ని తెలుసు కున్నా తహసిల్దార్ రమేష్ గౌడ్ రాత్రి 10. 30 గంటలకు అక్రమ దారులపై మెరుపు దాడి చేసి పట్టుకున్నారువాహనదారులు 4000 జరిమానా  బుధవారం నాడు విదించారు . ఈయనతో పాటు ఆర్ ఐ అశోక్ , వి ఆర్ ఓ ఉమ లాల్  ఉన్నారు .    

త్రాగు నీటి ఎద్దడి లేకుండా చూడాలి -ఎం పి పి

త్రాగు నీటి ఎద్దడి లేకుండా చూడాలి -ఎం పి  పి  

రెబ్బెన: (వుదయం ప్రతినిధి);;  రెబ్బెన మండలం ప్రతి గ్రామాలలో త్రాగు నీటి ఎద్దడి లేకుండా చూసే భాద్యత గ్రామ పంచాయత్ సర్పంచులు , కార్యదర్షులే నని రెబ్బెన ఎం పి  పి  కర్నాథం సంజీవ్ కుమార్ అన్నారు . బుధ వారం ఎం ఫై డి ఓ కార్యాలయములో సరోంచులకు ,ఎం పి  టి సి, అధికారులకు   ఏర్పాటు చేసినఅవగాహనా సదస్సులో ఆయాన మాట్లాడారు . అధికార్లు వారానికి ఒక్క సారి గ్రామాలు తిరిగి సమస్యలుంటే వెంటనే సర్పంచుల దృష్టికి తేవాలని తెలిపారు . ప్రణాళికతో సర్పంచులు , కార్యదర్శులు కలిశి పని చేసుకుంటే త్రాగు నీటి కొరత లేకుండా చూడ వచని అన్నారు . ఈ కార్య క్రమములో జెడ్ పి  టి సి బాబురావు , ప్రత్యేక అధికారి శ్రీనివాస్ రెడ్డి , ఎం పి  డి ఓ ఎం ఎ అలీమ్ , తహసిల్దార్ రమేష్ గౌడ్ , సరంచులు , ఎం పి  టి సి లు , అదికార్లు పాల్గొన్నారు .

ఎమ్పిడివో అభివృద్ధి పనులకు ఆటంకం- గోలేటి సర్పంచ్ లక్ష్మన్

మ్పిడివో అభివృద్ధి పనులకు ఆటంకం- గోలేటి సర్పంచ్ లక్ష్మన్

రెబ్బెన: (వుదయం ప్రతినిధి);; రెబ్బెన మండల మ్పిడివో ఎంఎ హలీం ఆహివ్రుద్ధి పనులకు ఆటంకంగా మారారని గోలేటి సర్పంచ్ లక్ష్మన్ మంగళవారం మ్పిడివో తో వాగ్వాదానికి దిగారు. ఆయన మాట్లాడుతూ గ్రామాభివృద్ధి పనులు గ్రామ సర్పంచ్ లకు తెలియకుండా, గ్రామ సభలు ఎలా నిర్వహిస్తారని అన్నారు. సర్పంచ్లు గ్రామాలకు ప్రాతినిధ్యం వహిస్తారని కనీసం సర్పంచ్లకు కనీసం ఆభివ్రుద్ది పనుల సమాచారం ఇవ్వటం లేదని అన్నారు. దీంతో మాకు ఎలాంటి సమాచారం లేకపోవడంతో తీవ్ర ఇబ్బంది పడుతున్నామని అన్నారు. మీరో మండల అభివృద్ధి అధికారి మండలాన్ని ఏ  విధంగా అభివృద్ధి చేస్తారని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం పేద ప్రజల అభివృద్ధి కోసం కార్పోరేషన్ రుణాలు ప్రవేశ పెడితే అవి ధనవంతులకే అంట గట్టడం ఎంత వరకు సమంజసమని అన్నారు . ఈయనతో  పాటు కిస్టాపూర్ సర్పంచ్ భీమేశ్ ఉన్నారు . 

ఇంటింటికీ గ్యాస్ కనెక్షన్లు-- ఎమ్మెల్సి పురాణం సతీష్

ఇంటింటికీ గ్యాస్ కనెక్షన్లు-- ఎమ్మెల్సి పురాణం సతీష్

రెబ్బెన: (వుదయం ప్రతినిధి);;  ప్రతీ ఇంటికి గ్యాస్ కనెక్షన్లు అందిస్తామని ఎమ్మెల్సి పురాణం సతీష్ అన్నారు. సోమవారం రెబ్బెన మండలంలోనిలోని మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో ఎమ్మెల్సి పురాణం సతీష్ , ఎమ్మెల్యే కోవా లక్ష్మి తో కలిసి ఆయన దీపం పథకాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గతంలో ఎన్నడూ లేని విధంగా ప్రతి ఇంటికి గ్యాస్ కనెక్షన్లు అందిస్తామని పేర్కొన్నారు. అనంతరం లబ్ధిదారులకు గ్యాస్ స్టవ్‌లు పంపిణీ చేశారు. ఈ కార్యాక్రమంలో ఎంపిపి కార్నాధం సంజీవ్ కుమార్, జడ్పిటిసి బాబు రావు, మ్పిడివో ఎంఎ హలీం, ఎమ్మార్వో రమేష్ గౌడ్, సర్పంచ్ పెసరు వెంకటమ్మ, ఎచ్పీ  గ్యాస్ ఏజెన్సీ రాకేష్ అగర్వాల్, తదితరులు పాల్గొన్నారు.

దేవాలయ అభివృద్ధికి 5 కోట్ల నిధులు- ఆలయ చైర్మన్ గంటుమేర


దేవాలయ అభివృద్ధికి 5 కోట్ల నిధులు- ఆలయ చైర్మన్ గంటుమేర


రెబ్బెన: (వుదయం ప్రతినిధి);; ఆదిలాబాద్ జిల్లా రెబ్బెన మండలంలోని గంగాపూర్ శ్రీ బాలాజీ వెంకటేశ్వర దేవాలయాన్ని అభివృద్ధికి మరిన్ని సన్నాహాలు చేస్తున్నట్లు ఆలయ చైర్మన్ గంటుమేర అన్నారు, మంగళ వారం ఆయన మాట్లాడుతూ అవామీ వారి జాతర సందర్శానికి వచ్చిన రాష్ట్ర దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి ఇంద్ర కరణ్ రెడ్డి ఆలయ అభివృద్ధికోసం 5కోట్లు మంజూరు చేశారని ఆయన సంతోషాన్ని వ్యక్త పరిచారు. రాష్ట్ర ముఖ్య మంత్రి కెసిఆర్ దేవాలయాల అభివృద్ధికి కంకణం కట్టారని గంగాపూర్ దేవాలయాన్ని ప్రత్యేకంగా ముఖ్య మంత్రి దృష్టికి తీసుకెళ్తానని   ఆలయాన్ని అన్ని హంగులతో రూపురేఖలు మారుస్తానని మంత్రి ఇంద్ర కరణ్  రెడ్డి చెప్పడం రెబ్బెన మండలానికి వరమని అన్నారు, అదే విధంగా రెబ్బెన నుండి గంగాపూర్ కు డబుల్ రోడ్డు, గోపురం, భక్తులకు అనుకూలంగా కళ్యాణ మండపం విస్తరణ చేస్తారని, భక్తులకు మరుగు దొడ్లు నిర్మిస్తామని అన్నారు, పురాతన దేవాలయం కావడంతో జాతర మూడో రోజుకు చేరిన భక్తుల తాకిడి కొనసాగుతూనే ఉంది,

Sunday, 21 February 2016

వెంకటేశ్వర స్వామిని దర్శించిన ఎమ్మెల్యే

వెంకటేశ్వర  స్వామిని దర్శించిన ఎమ్మెల్యే 


రెబ్బెన: (వుదయం ప్రతినిధి);; రెబ్బెన మండలంలోని గంగాపూర్ గ్రామా శివారులో వెలిసిన బాలాజీ వెంకటేశ్వరస్వామి వారి కళ్యాణం ఆదివారం సందార్భంగా నియోజకవర్గ ఎమ్మెల్యే  లక్ష్మి వెంకటేశ్వర  స్వామిని దర్శించారు  ప్రత్యేక  నిర్వహించారు. 

ఈవో బాపిరెడ్డి పై మండిపడ్డ భక్తులు

ఈవో బాపిరెడ్డి పై మండిపడ్డ భక్తులు

రెబ్బెన: (వుదయం ప్రతినిధి);; గంగాపూర్ లోని శ్రీ వెంకటేశ్వర స్వామి వారి కల్యాణం సందర్భంగా స్వామి కళ్యాణం మహొత్సవం  సందర్భంగా భక్తులు అధిక  సంఖ్యలో పాల్గొనడంతో మంచినీటి సౌకర్యం అంతంత మాత్రాన ఉండడంతో దాహంతో భక్తులు తీవ్ర అవస్థలు ఎదుర్కొన్నారు. అధిక సంఖ్యలో భక్తులు పాల్గొనడంతో కూర్చునే స్థలంలో ఎండ విపరీతంగా కొడుతున్నా పైన టెంట్ అంతంత మాత్రాన  వేయడంతో అసౌకర్యాల మద్య చిన్న పిల్లలు, వృద్ధులు,  భక్తులు ఎర్రటి మండుటెండలో కళ్యాణ మండపం వద్ద అవస్తలు పడ్డామని భక్తులు తెలిపారు. ఈవో బాపిరెడ్డి పైన భక్తులు మండి పడ్డారు. మొదటి రోజున ఈ విధంగ ఇబ్బంది ఉంటె పౌర్ణమి నాడు జరుగు జాతరకు వేలకొద్ది వచ్చే భక్తులు ఎంత ఇబ్బంది పడతారో గమనించాల్సిన విషయమని భక్తులు తెలిపారు. 

అంగ రంగ వైభంగా గంగాపూర్ శ్రీనివాసుడి కళ్యాణం

అంగ రంగ వైభంగా గంగాపూర్ శ్రీనివాసుడి కళ్యాణం   
ప్రారంభమైన గంగాపూర్ జాతర 





స్వామి వారి కల్యాణం



కల్యాణం వీక్షిస్తున్న భక్తులు


స్వామి సన్నిధిలో కోలాటం ఆడుతున్న భక్తులు


అన్నదాన కార్యాక్రమం

రెబ్బెన: (వుదయం ప్రతినిధి);; నిత్య కళ్యాణం పచ్చ తోరణం శ్రీ బాలాజీ వెంకటేశ్వరస్వామి రెబ్బెన మండలంలోని గంగాపూర్ గ్రామా శివారులో వెలిసిన బాలాజీ వెంకటేశ్వరస్వామి వారి కళ్యాణం ఆదివారం అంగరంగ వైభవంగా వేదమంత్రాల నడుమ భక్త జనావాలి  మద్య ఆదివారం నాడు జరిగింది.  భక్తులు స్వామి వారి మండపంలో కోలాటాలు ఆడారు. అన్నదాన కార్యక్రమంనిర్వహించారు. కళ్యాణం మండపంలో దంపతులు స్వామి వారి ఎదుట ప్రత్యెక కుంకుమర్చనలు చేసారు. నాయకులూ ,భక్తులు, తదితరులు పూజలో పాల్గొన్నారు

Saturday, 20 February 2016

నేడు శ్రీ బాలాజీ వెంకటేశ్వర స్వామీ కల్యాణం

నేడు శ్రీ బాలాజీ వెంకటేశ్వర స్వామీ కల్యాణం

 శ్రీ బాలాజీ వెంకటేశ్వర స్వామి కళ్యాణము ఆదివారము రంగ రంగ వైభవంగా జరుగును . ఈ కళ్యాణ మహోత్సా వానికి అన్ని ఏర్పాట్లు చేశారు దంపతుల వారిగా భక్తులు వచ్చి స్వామీ వారికి ప్రత్యక కుంకుమ పూజలు చేస్తారు . బ్రాహ్మనోట్తములు వేద మంత్రమూలా మధ్య స్వామి వారి కల్యాణం ఎంతో కనుల పండుగాగా జరిగింది. భక్తులు అధిక సంఖ్యలో తరలి రావాలని ఏ ఓ బాపు రెడ్డి తెలిపారు .   

నేటి నుంచి గంగాపూర్ జాతర

నేటి నుంచి గంగాపూర్ జాతర 


 రెబ్బెన: (వుదయం ప్రతినిధి) రెబ్బెన మండలం గంగాపూర్ గ్రామ శివారులోని బాలాజీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో నేడు జరుగు జాతరకు జిల్లాలోని నలుమూలల నుండి భక్తులు అధిక సంఖ్యలో తరలి వచ్చి మొక్కులు తీర్చుకుంటారు .జిల్లాలోని  మారుమూల గ్రామాల్లోని ప్రజలు ఎడ్లను అలంకరించుకుని జాతరకు రావడం ప్రత్యేక ఆకర్షణగా  నిలుస్తుంది.  జాతరలో ప్రభుత్వ ఆరోగ్య కేంద్రాల అద్వర్యంలో ఉచిత  వైద్య శిబిరం నిర్వహించడానికి ఏర్పాట్లు చేసారు.  ఎలాంటి అవాంచనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా బెల్లంపల్లి  డి ఎ స్పీ రమణారెడ్డి  అద్వర్యం లో రెబ్బెన ఎస్సై.  దారం సురేష్ బందోబస్త్  ఏర్పాటు చేసారు

పోలియో భూతాన్ని తరిమి కొట్టండి

 పోలియో భూతాన్ని తరిమి కొట్టండి 

రెబ్బెన: (వుదయం ప్రతినిధి) నేడు జరిగే  రెండో విడత పల్స్‌పోలియో కార్యక్రమాన్ని విజయవంతం   చేయలని రెబ్బెన  డాక్టర్ సారస్వతి   అన్నారు మండలంలోని  ఐదేళ్లు లోపు  పిల్లలందరికీ పోలియో చుక్కలను వేయనున్నట్లు పేర్కొన్నారురెండో విడత పల్స్ పోలియో ను విజయవంతం చేయలని పోలియో భూతం నుండి పిల్లలందరికీ కాపాడాలని అన్నారు   రెబ్బెన మండలంలో  విద్యార్తులు ర్యాలి నిర్వహించారు బస్టాండుల్లో, రైల్వేస్టేషన్లలో మరియు గ్రామపంచాయితీ   పోలియో చుక్కల కేంద్రాలను ఏర్పాటు చేశామన్నారు ఈ కార్యక్రమంలో సిబ్బంది పావని,కమలకర్  ప్రధానోపద్యయురాలు స్వర్ణలత ,ఎ ఎన్ ఎం లు ఆశ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు 

Friday, 19 February 2016

భ క్తుల కోర్కెలు తీ ర్చె కొంగు బంగారం శ్రీ బాలాజీ వెంకటేశ్వర స్వామీ

భ క్తుల కోర్కెలు తీ ర్చె కొంగు బంగారం శ్రీ బాలాజీ వెంకటేశ్వర స్వామీ 


మాఘ శుద్ధ పౌర్ణమి రోజు జరుగు గంగాపూర్ జాతర శ్రీ బాలాజీ వెంకటేశ్వర స్వామి నమ్ముకున్న భక్తులకు కోర్కేకలు తీర్చే కొంగు బంగారం . ప్రతి సంవత్సరాము 3 రోజులు జాతర వైభవంగా జరుగుతుంది . 
రెబ్బెన మండలం లోని గంగాపూర్ గ్రామపంచాయితి లో ని గంగాపూర్ గ్రామా శివారులోని శ్రీ బాలాజీ వెంకటేశ్వరస్వామి దేవస్ధానంలో నేటి నుంచి జాతర ప్రారంభంకానుంది. పచ్చని ప్రకృతి అందాల మధ్య వాగులు వంకల మధ్య జరిగే జాతరకు ఆదిలాబాద్ జిల్లా ల నుంచే కాకుండా వేర్వేరు జిల్లాల నుంచి భక్తులు తరలివస్తారు.
బాలజీ ఆలయ క్షేత్రం చరిత్ర :






రెబ్బెన మండలంలోని గంగాపూర్ గ్రమపోలిమేరలో ఉన్న గుట్టపై శ్రిబలజీ వెంకటేశ్వర స్వామి ఆలయాన్ని వందల్ ఏళ్ల క్రితం 16వ శబ్ధతానికి ముందు గంగాపూర్ కు చెందిన విస్వబ్రహ్మణ కులానికి చెందిన పొతజీ నిర్మిచినట్లు గ్రామస్తుల ద్వారా తెలుస్తోంది పొతజీ చిన్నతనం నుంచి స్రిబాలజీ వెంకటేశ్వరస్వామి భక్తితో కొలుస్తూ ప్రతి  ఏట మాఘశుద్ధ పొర్ణమి రోజు తిరుపతిలో శ్రీ వెంకటేశ్వరునికి మొక్కులు స్మర్పిస్తుమ్దేవాడు ఆ తర్వాత వయోభారంతో అతని ఆరోగ్యం క్షినిచడం ఆర్ధిక ఇబ్బందులు ఎక్కువ కావడంతో తిరుపతికి వెళ్ళలేక తీవ్ర మ్న్వేదనకు గురయ్వోవాడు, ఓ రాత్రి వెంకటేశ్వర స్వామి పొతాజీ కలలో కనిపించి నీలాంటి భక్తుల కోసం గంగాపూర్ పోలిమేర లోని గుట్టబాగం ముందు ఆలయం నిర్మించాలని ప్రతి మాఘశుద్ద పౌర్ణమి రోజున దర్శనమిస్తానని కలలో చెప్పాడు. గంగాపూర్ ను ఆను కొని ఊన్న గాగు సమీపమ్లొ గుట్టాను లోలువగా శ్రిబాలజి వెంకటేశ్వర స్వామి వారి పంచనామాలు ఆయనకు దర్శనమిచ్చాయి దీనీతో ఆయన అక్కడ ఆలయానీ నిర్మించాడు మొదటి గుహలో గోవింద రాజు విగ్రహం స్వామి వేడమ వైపూనా శివాలయం దాని పక్కన శ్రీ హనుమాన్ విగ్రహం గరుడ విగ్రహాలు న్నాయి పోతాజి సమాది ఆలయ ముందు భాగంలో ఉంది పోతాజి మరణానంతరం గ్రామస్తులే క్రమం తప్పకుండా ప్రతి ఏడాది జాతర ఉత్సవాలు నిర్వహిస్తున్నారు. ఈ ఏడాది జాతరలో భాగంగా కల్యాణోత్సవం. 22 వ రధోత్సవం కన్నుల పండవగా జరిపేందుకు ఆలయ కమిటి ఏర్పాటు పూర్తీ చేసింది 23వ ప్రత్యక పూజలు కార్యక్రమాలు నిర్వహించనున్నారు భక్తుల కోసం అన్ని యుర్పాట్లు పూర్తీ చేసినట్లు ఆలాయ ఆధికారులు తెలిపరు.





ఘనంగా సమ్మక్క సారలమ్మ జాతర

ఘనంగా సమ్మక్క సారలమ్మ జాతర 

రెబ్బెన: (వుదయం ప్రతినిధి) రెబ్బెన మండలం లోని గోలేటి క్రాస్ రోడ్  మరియు లక్ష్మిపుర్ గ్రామ సమీపంలోని సమ్మక్క సారలమ్మ జాతర ప్రారంబమైంది బక్తులు అధిక సంక్యలో వచ్చి తమ మొక్కులు తీర్చుకుంటారు అమ్మవారికి పసుపు కుంకుమ బంగారం బెల్లం  సమర్పికున్నారు  సమ్మక్క జాతర శుక్రవారానికి   చేరుకుంది. ఉదయాన్నే తండోప తండాలుగా భక్తులు రావడంతో జాతర ప్రాంగణం కిక్కిరిసి పోయింది. ఎస్సై దారం సురేష్  ఆధ్వర్యంలో భద్రత ఏర్పాట్లు పర్యవేక్షిస్తున్నారు. 





ఘనంగా ఛత్రపతి శివాజీ మహారాజ్ జయంతి వేడుకలు

ఘనంగా ఛత్రపతి శివాజీ మహారాజ్ జయంతి వేడుకలు 

రెబ్బెన: (వుదయం ప్రతినిధి) ఛత్రపతి శివాజీ 386వ జయంతి  ఉ త్సవాలను రెబ్బెన మండలం లో మరియు లక్ష్మిపుర్ శుక్రవారం ఘనంగా నిర్వహించారు ఈ జయంతి   ఉ త్సవాల సందర్బంగా గ్రామంలో ఉ రేగింపు నిర్వహించారు అనంతరం ఆర్య సంఘం గ్రామా కమిటి అద్యక్షులు సైరే తిరుపతి ఛత్రపతి శివాజీ  పతాకావిష్కరణ గావించారు ఈ కార్యక్రమంలో గ్రామా సర్పంచ్ ముంజం రవీందర్ గ్రామా కమిటి గౌరవ అద్యక్షులు చౌదరి సాంబయ్య మండల కార్యదర్శి కే . రవీందర్ ,చౌదరి సుభాష్ రౌతు శ్రీనివాస్ మరియు గ్రామా పెద్దలు చౌదరి నాగయ్య పిప్రే తుకారం ఊపాద్యయులు జాడి మనోహర్ యువకులు తదితరులు పాల్గొన్నారు  

ఆశ్రమ పాటశాల్లో సబ్ కలెక్టర్ అకస్మిఖ తనిఖీ

 ఆశ్రమ పాటశాల్లో  సబ్  కలెక్టర్ అకస్మిఖ  తనిఖీ 




రెబ్బెన: (వుదయం ప్రతినిధి) గురువారం రాత్రి ఆసిఫాబాద్ సబ్  కలెక్టర్ అద్వైత్ కుమార్  సింగ్ గోలేటిలోని ఆశ్రమ పటశాలను మరియు రెబ్బెన బి సి హాస్టల్ ను  ఆకస్మిక ట తనికి చేసారు   ఈ  సందర్భంగా తాగునీటి సమస్యలు మరుగుదొడ్లు గదులను పరిశీలించారు మెనూ ప్రకారం భోజనం అందించాలని నెలకొన్న సమస్యలపై సిబ్బందితో మాట్లాడారు విద్యర్తులతో పట్యపుస్తకాలూ చదివించారు వార్డెన్ రెగ్యులర్గా వస్తున్నాడ లేదా అని ఆరతీసారు అలాగే ఆ రాత్రి అక్కడే బస చేసారు   ఆయన వెంట తహసిల్దార్ రమేష్ గౌడ్ తదితరులు ఉన్నారు 

గంగాపూర్ జాతర ఘనంగా నిర్వహించాలి

గంగాపూర్ జాతర ఘనంగా నిర్వహించాలి 

రెబ్బెన: (వుదయం ప్రతినిధి) రెబ్బెన మండలం గంగాపూర్ గ్రామ శివారులోని బాలాజీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో  21 నుండి 23 వరకు  నిర్వ హించే  జాతరకు   అధికారులు అప్రమత్తంగ ఉండాలని ఆదిలాబాద్  ఎం ఎల్ సి పురాణం సతీష్  కుమార్ సూచించారు స్తానిక  ఎం పి డి ఓ కార్యాలయ సమావేశ  మందిరంలో గురువారం రాత్రి మండలంలోని అన్ని  అధికారులతో రివ్యు  నిర్వహించారు  అతిధి గా హాజరు  మాట్లాడుతూ వైద్యసదుపాయం త్రాగునీరు ఆ ర్ . టి . సి .బస్సు సౌకర్యం   విద్యుత్ సౌకర్యం పరిశుద్ధం   ట్రాఫిక్ కంట్రోల్ ఎన్ ఎస్ ఎస్ ఎన్ సి సి సేవల  అంశాలపై దృష్టి  కోరారు  బక్తులకు  కలగకుండా  చేపట్టాలన్నారు ఈ సమావేశంలో  బెల్లంపల్లి ఏరియా  జి ఎమ్ రవిశంకర్  ఎం పి పి కర్నాథం సంజీవ్ కుమార్ జ డ్ పి టి సి  బాబురావు డి హెచ్ ఎం ఓ   సుధాకర్ నాయక్  రెబ్బెన ఎస్.ఐ దారం సురేష్ ఎ పి ఎమ్ రాజ్ కుమార్ వెంకటరమణ ఎ ఓ మంజుల ఎ పి ఓ కల్పనాఈ .ఓ .బాపిరెడ్డి  వివిధ  గ్రామాల సర్పంచులు ఎం పి టి సి లు అధికారులు పాల్గొన్నారు 

రెండో రోజుకు చేరిన సమ్మక్క సారలమ్మ జాతర


రెండో రోజుకు చేరిన సమ్మక్క సారలమ్మ జాతర 

రెబ్బెన: (వుదయం ప్రతినిధి) రెబ్బెన మండలం లోని గోలేటి క్రాస్ రోడ్  మరియు లక్ష్మిపుర్ గ్రామ సమీపంలోని సమ్మక్క సారలమ్మ జాతర ప్రారంబమైంది బక్తులు అధిక సంక్యలో వచ్చి తమ మొక్కులు తీర్చుకుంటారు అమ్మవారికి పసుపు కుంకుమ బంగారం బెల్లం  సమర్పికున్నారు  సమ్మక్క జాతర గురువారం రెండవ రోజుకు చేరుకుంది. ఉదయాన్నే తండోప తండాలుగా భక్తులు రావడంతో జాతర ప్రాంగణం కిక్కిరిసి పోయింది. ఎస్సై దారం సురేష్  ఆధ్వర్యంలో భద్రత ఏర్పాట్లు పర్యవేక్షిస్తున్నారు. 


         

జాతరకు ముస్తాబవుతున్న గంగాపూర్ ఆలయం

జాతరకు ముస్తాబవుతున్న  గంగాపూర్ ఆలయం  

జాతర ఏర్పాట్ల పరిశీలిస్తున్న రెబ్బెన  ఎస్ ఐ దారం సురేష్ 



రెబ్బెన: (వుదయం ప్రతినిధి) రెబ్బెన మండలం గంగాపూర్ గ్రామ శివారులోని బాలాజీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో  21 నుండి 23 వరకు జాతర నిర్వ హించుచున్నారు .  ఈ మేరకు అధికారులు పనులు ఏర్పాటు చేసారు. గంగాపూర్ జాతర ఏర్పాట్ల  రెబ్బెన ఎస్.ఐ దారం సురేష్ ఆలయ ఈ .ఓ .బాపిరెడ్డి   అడిగి తెలుసుకున్నారు  ప్రతి ఎటా మాఘ శుద్ధ పౌర్ణమి రోజున మూడు రోజుల పాటు జాతర నిర్వహించనున్నారు.ఆలయాన్ని విద్యుత్ దీపాలతో అలంకరించారు.అదివారం కళ్యాణ మహోత్సవాన్ని జరిపేOదుకు అన్ని ఏర్పాట్లు చేసామని ఆలయ ఈ .ఓ .బాపిరెడ్డి  అద్వర్యం లో ఆలయంలో ఏర్పాట్లు చేసారు . ఈ నెల 22న మాఘ శుద్ధ పౌర్ణమి  రోజున సాయంత్రం 5 గంటలకు రథోత్సవం  నిర్వహిస్తారు . ఉత్సవ విగ్రహాలను అలంకరించి రథంఫై ఊరేగిస్తారు.  భక్తుల సౌకర్యలకోసం ఆసిఫాబాద్ ,మంచిర్యాల డిపోల నుంచి ఆ ర్ . టి . సి . అధికారులు ప్రత్యేక బస్సు లను ఏర్పాటు చేస్తున్నారు . 

గ్రామాల అభివృద్దే తెలంగాణ ప్రబుత్వ లక్ష్యం

 గ్రామాల  అభివృద్దే తెలంగాణ  ప్రబుత్వ లక్ష్యం 





రెబ్బెన: (వుదయం ప్రతినిధి) గ్రామా గ్రామాల  అభివృద్దే తెలంగాణ  ప్రబుత్వ లక్ష్యం అని ఎం ఎల్ సి పురాణం సతీష్, ఆసిఫాబాద్ నియోజాకవర్గ ఎం ఎల్ ఎ శ్రీమతి కొవలక్ష్మి అన్నారు  గురువారం నంబాల గ్రామంలో నూతన సబ్ స్టేషన్  నిర్మాణం కోసం భూమి పూజచేసారు అనతరం
పశు వైద్యశాలను ప్రారంభించారు మరియు గంగాపూర్ గ్రామానికి వెళ్లి బి టి రోడ్ ఏర్పాటుక కై   భూమిపూజ   చేసారు అనతరం వారు  మాట్లాడుతూ  గ్రామా గ్రామా ల అభివృద్దే తెలంగాణ లక్ష్యమని అన్నారు గత ప్రబుత్వాలు చేయలేని అభివృద్ధి పనులు ఈ తెలంగాణ ప్రబుత్వం చేస్తుందని ముందు ముందు మరిన్ని ప్రబుత్వ పథకాలు ప్రజల్లోకి తీసుకెళ్ళి రాష్ట్ర అభివృద్దికై మన ముఖ్యమంత్రి కే సి ర్ కంకణం కట్టుకున్నారని బంగారు తెలంగాణే మన లక్ష్యమని  అన్నారు ఎం ఎల్ సి పురాణం సతీష్ ఎం పి పి సంజీవ్ కుమార్,  జడ్ పిటిసి బాబూరావు, స్తానిక సర్పంచ్ గజ్జెల సుశీల, స్తానిక  ఎం పి టి సి కొవ్వూరి శ్రీనివాస్, సర్పంచులు కుందారపు శంకరమ్మ , చెన్న  సోమశేకర్ తదితరులు పాల్గొన్నారు

Monday, 15 February 2016

రెబ్బెన బిసి మరియు ఎస్సి వసతి గృహాల తనికి

 రెబ్బెన బిసి మరియు ఎస్సి వసతి గృహాల  తనికి  

 

రెబ్బెన: (వుదయం ప్రతినిధి): రెబ్బెన బిసి మరియు ఎస్సి హాస్టల్ ను సోమవారం రెబ్బెన  తహసిల్దార్ రమేష్ గౌడ్ తనికి చేసారు  హాస్టల్ లోని  విద్యర్తులతో చర్చించి  సమస్యలు అడిగి తెలుసుకున్నారు రికార్డు లు పరిశీలించారు  పలు సమస్యలపై ఉ న్నత  అధికారులకు సిఫార్సు చేస్తామన్నాడు  మెను ప్రకారం భోజనం అందించాలని పేర్కొన్నారు 






పేదవారికి అందని సమాచార హక్కు చట్టం

పేదవారికి అందని సమాచార హక్కు చట్టం 

రెబ్బెన: (వుదయం ప్రతినిధి): సమాచార హక్కు చట్టం 2005 అనేమి పేదలకు బీదవారికి వరం లాంటిది అనే అనడమే కానీ అది అమలు లో మాత్రం సున్యమే కాని ఫలితం మాత్రం అందని ద్రాక్షల ఉందని ఎ ఐ ఎఫ్ డి ఎస్ జిల్లా అద్యక్షులు గోలేటి నగేష్ ఒక ప్రకటనలో సోమవారం తెలియచేసారు ఇందుకు తము నిదర్శనమని వాపోయారు గత నెల జనవరి 02 తేదిన రెబ్బెన  తహసిల్దార్ రమేష్ గౌడ్ కి కిస్టాపూర్  గ్రామానికి సంబంధించిన ఆహార బద్రత కార్డు మంజూరు చేయడానికి కావలసిన కనీస అర్హతలు తోలి విడతగా కిస్టాపూర్ గ్రామా పంచాయితీ లో ఎన్ని కార్డ్లు మంజూరు చేసారో వాటి క్షెరొక్ష్ చొపిఎస్ అడగడం జరిగింది కానీ వాటికీ సంబంధించిన సమాచారం నెల వ్యవదిలో ఇవ్వ ల్సి  ఉండగా ఇంకను ఇవ్వకుపోగా ఎం అర్ ఓ కార్యాలయం చుట్టూ తిప్పుతున్నారు దీని వాళ్ళ మాకు ఆర్ధికంగా చాల ఇబ్బంది పడాల్సి వస్తుంది అలానే ఆహార భద్రత కార్డ్లో పేరు నమోదు కోసం దరకాస్తు చేసుకున్న పట్టిచుకోవడం లేదు అన్నారు అర్హులు అయిన వారు లబ్దిపొండడం లేదు అని  అన్నారు.

రెబ్బెనలో సేవలాల్ జెండా ఆవిష్కరణ ఉత్సవం

రెబ్బెనలో సేవలాల్ జెండా ఆవిష్కరణ ఉత్సవం 

రెబ్బెన: (వుదయం ప్రతినిధి): రెబ్బెన మండలం లో సోమవారం సేవాలాల్‌ 277 జయంతి ఉత్సవాలు సందర్బంగా ఎంపీడీఓ,యం అర్ ఓ 
గ్రామపంచాయితీ,తదితర్ల బంజర తండలలో సేవాలాల్‌ జెండాలు ఎగరవేసి జయంతి ఉత్సవాలు ఘనగానిర్వహిచారు.  
ఈ సేవాలాల్‌ జయంతి కార్యక్రమంలో ఎం పి పి సంజీవ్ కుమార్ జెడ్ పి టి సి బాబురావ్ యం అర్ ఓ రమేష్ గౌడ్ 
వైస్ ఏం పి పి  రేణుక  సర్పంచ్ వెంకటమ్మ శ్రీధర్ రెడ్డి, రమేష్ తాదితరులు  పలుగోన్నారు

కన్నయ కుమార్ ని విడుదల చేయాలి ఎ ఐ ఎస్ ఎఫ్

కన్నయ  కుమార్ ని విడుదల చేయాలి ఎ ఐ ఎస్ ఎఫ్ 

రెబ్బెన: (వుదయం ప్రతినిధి): జెన్ యు అధ్యక్షులు కన్హాయ కుమార్ ని విడుదల చేయాలని ఎ ఐ ఎస్ ఎఫ్ రెబ్బెన మండల కార్యదర్శి పుదరి సాయి కిరణ్ డిమాండ్ చెశరు. నేడు దేశ వాప్తం గ జె న్ యు ఎ ఐ ఎస్ ఎఫ్ అధ్యాక్షులు కన్హయ్య కుమార్ అరెస్ట్ ను నిరసిస్తూ రెబెన మండలం కేంద్రం లో ని అర్ అండ్ బి గెస్తహొఉస్ వద్ద కళ్ళకు గంతలు  కట్టుకొని నిరసన తెలియజేయడం జరిగింది ఈ సందర్బంగా ఎ ఐ ఎస్ ఎఫ్ రెబ్బెన మండలం కార్యదర్శి పుదరి సాయి మాట్లాడు తు జె న్ యు లో జరిగిన ఘటనకు కన్హాయ్యకు ఏలాంటి సబందం లేనప్పటికీ ఆయనను దేశ విద్రోహి అని బి జె పి  ప్రభుత్వం అపరాధాలను మిధ వేసి అప్రజాస్వామికంగా అరెస్ట్ చేసిందని అన్నారు బి జె  పి  ప్రభుత్వం అధికారంలోకి వచినప్పటి నుండి యునివర్సిటిల లో ప్రత్యక్ష రాజకీయ లు చేస్తూ కేంద్రమంత్రులు ప్రత్యక్షంగా యునివర్సిటిల లోమతోన్మద కులమత తత్వాలను పోత్వహిమ్చడం వల నే రోహిత్ అనీ విద్యార్ధి అత్మ్తహత్య చేసుకోవడం జరిగిదన్నారు ఆ మరువక ముందే కన్హాయను అరెస్ట్ చేసి మరోసారి మతోన్మాద న్ని నిరుపించారని అన్నారు మతోన్మాద కులశక్తుల సంఘాలను ఓడించి  కన్హాయ ఎ ఐ ఎస్ ఎఫ్ నుండిజె ఎన్ యు అధ్యక్షులుగ ఎన్నిక అయినప్పటినుండి ఓర్వక ఇలాంటి నిజంలేని అర్దరహిత కుట్రలకు పాల్పడుతుందని అన్నారు వెంటనే కన్హాయ ను బేషరతుగా విడుదల చేయాలనీ డిమాండ్ చేసారు ఈ కార్యక్రమంలో ఎ ఐ ఎస్ ఎఫ్ గోలేటి గ్రామా అధ్యక్షులు పడాల సాయి నాయకులూ నవీన్ మాస్క సాయి పార్వతి సాయి విజయ్ విద్యార్తులు పా ల్గోన్నరు

కన్నయ్య అరెస్ట్ అప్రజాస్వామికం,-ఎ ఐ ఎస్ ఎఫ్ ,ఎ ఐ వై ఎఫ్

          కన్నయ్య అరెస్ట్ అప్రజాస్వామికం,-ఎ ఐ ఎస్ ఎఫ్ ,ఎ ఐ వై ఎఫ్ 


 రెబ్బెన: (వుదయం ప్రతినిధి):  ఢిల్లీ జె ఎన్ యు అధ్యక్షులు కన్నయ్య అరెస్ట్ అప్రజాస్వామికం అని ఎ ఐ ఎస్ ఎఫ్ జిల్లా ప్రధాన కార్య దర్శిదుర్గం రవీందర్ ,ఎ ఐ వై ఎఫ్ జిల్లా ఉపాధ్యక్షులు బోగే ఉపేందర్ అన్నారు .ఈ సందర్బంగా రెబ్బెన లోని అర్ అండ్ బి అతిధి గృహం లో శనివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమవేశం లో మాట్లాడుతూ  ఢిల్లీ జె ఎన్ యు అధ్యక్షులు కన్నయ్యకుమార్ పై కక్ష కట్టి కావాలనే కేంద్ర ప్రభుత్వం అరెస్ట్ చేసిందని ,బి జె పీ అనుబంధ సంబందమైన ఎ బి  వి పీ  మెప్పు పొందించేందుకు కేంద్ర ప్రభుత్వం ఇస్తా రాజ్యాంగ వ్యవహరించడం తగదని దేశం లో వివిధ క్యాంపస్ లలో ప్రస్తుత అణచివేత పరిణామాలను ఎమర్జెన్సీ ని తలపిస్తున్నాయని ,వామ పక్ష విద్యార్ధి సంగాలను లక్ష్యంగా చేసుకొని ఎ బి వి పీ చెప్పిన విధంగా పోలీసులు వ్యవహరించటం ఎంతవరకు సమంజసం అని ,ఇది నిరంకుహ ధోరణులకు అద్దం పడుతుందని ,ప్రత్యేకించి విద్యసంస్థ ల లో భావ వ్యక్తీకరణ స్వేచ్చను దేబ్బతియటం అవుతుందని ,సాధారణ విద్యర్థులపై  దాడులకు దిగుతూ అర్  ఎస్  ఎస్ ,బి జె పీ ,ఎ బి వి పి  ,వారు క్యాంపస్ లలో బయనక పరిస్థితులను కల్పిస్తున్నారని ,ఈ తరుణం లో ఢిల్లీ పోలిసులు ఎ బి వి పీ కి అనుకూలంగా చర్యలు తీసుకోవటం అన్యాయం అని అన్నారు . ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం మతోన్మాద విధానలుమనుకోవాలని ,వామపక్ష విద్యార్ధి సంఘాలపై కక్ష సాధింపు చర్యలు మానుకోవాలని ,విద్యార్థి నేత కన్నయ్య ఫై పెట్టిన రాజద్రోహం కేసును వెంటనే ఎత్తివేయాలని ఎ ఐ ఎస్ ఎఫ్ జిల్లా కమిటి డిమాండు చేశారు. ఈ కార్యక్రమంలో మండల కార్యదర్శి పుదరి సాయి ,ఉపాద్యక్షులు మహిపాల్ ,ప్రదిప్ ,మండల సహాయక కార్యదర్శి రాజ్ కుమార్ ,కిశోర్  లు పాల్గొన్నారు 


     ఘనంగా వసంత పంచమి వేడుకలు 

                                                                                                                             
 రెబ్బెన: (వుదయం ప్రతినిధి): వసంత పంచమిని పురస్కరించుకొని రెబ్బెన మండలం లోని గోలేటి సెయింట్ అగ్నిస్ ఇంగ్లీష్ మీడియం పాఠశాల లలోశనివారం సరస్వతి దేవికి పులాభిషేకం చేసి చిన్న పిల్లలతో అక్షర అభ్యాసం చేపించారు . పాఠశాల ప్రిన్సిపాల్ కృష్ణకుమారి ,కరేస్పండేంట్ మాలిక్ , పాఠశాల సిబ్బంది పాల్గొన్నారు . అలాగే రెబ్బెన మండలం లోని పలు గ్రామాలలో  వసంత  పురస్కరించికొని  సరస్వతి దేవి కి పూజలు నిర్వహించి అక్షర అభ్యాసాలు నిర్వహించారు . 

ఎ.ఐ.యస్.యఫ్ జిల్లా మహాసభ విజయవంతం

ఎ.ఐ.యస్.యఫ్ జిల్లా మహాసభ విజయవంతం 

రెబ్బెన: (వుదయం ప్రతినిధి);అఖిల భారత విద్యార్ది సమాఖ్య ఎ ఐ యస్ యఫ్ జిల్లా నిర్మాణ మహ సభ గురువారం గోలేటి లోని కే యల్  మహేంద్ర భవన్ లో  విజయవంతం గా  జరిగింది.  ఎ.ఐ.యస్.యఫ్ ప్రతినిధులు, విద్యార్దులు పాల్గొని విజయవంతం చేయాలనీ ఎ ఐ యస్ యఫ్ జిల్లా ఇంచార్జ్  యస్ తిరుపతి ఇచ్చిన పిలుపుకు విశేష స్పందన లభించింది. ఈయన మాట్లాడుతూ రాష్టంలో అనేక విద్యారంగ సమస్యలతో విద్యార్దులు తీవ్ర బ్బందులను ఎదుర్కొంటున్నారని అన్నారు. గిరిజన యూనివర్సిటిని ఆదిలాబాద్ జిల్లా నుండి వరంగల్ కు తరలింఛి జిల్లా విద్యార్దులకు, ప్రజలకు తీవ్ర అన్యాయం చేస్తున్నారని  అన్నారు. రాష్టంలో టిఆర్ఎస్ ప్రభుత్యం అధికారం లో ఉన్నప్పటికీ విద్యార్దుల సమస్యలు అలాగనే ఉన్నాయని,ఈ నిర్మాణ మహాసభలో విద్యార్దులు దుర్కొంటున్న సమస్యలపై చర్చించి   భవిష్యత్ కార్యాచరణ ప్రకటించారు. ఈ కార్యక్రమంలో  ఎ ఐ యస్ యఫ్ జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ దుర్గం రవీందర్, మండల అధ్యక్ష కార్యదర్శులు కస్తూరి రవికుమార్,పుదరి సాయి తదితరులు పాల్గొన్నారు
  

నిరుద్యోగ యువతీ యువకులకు ఉచితశిక్షణ

నిరుద్యోగ యువతీ యువకులకు ఉచితశిక్షణ

రెబ్బెన: (వుదయం ప్రతినిధి): భారత దేశ ప్రభుత్వ రంగ సంస్త అయిన ఎమ్ ఎస్ ఎం ఇ అభివృద్ధి సమస్త హైదరాబాద్ వారి అబ్వర్యంలో రెబ్బెన ఆర్ట్స్ సైన్స్ డిగ్రీ కళాశాలలో ప్రారంభమైన లఘు మద్య తరహ పరిశ్రమలు స్తాపన అభివృద్ధి 10 రోజుల ఒచిత శిక్షణ గురువారానికి 4 రోజుకు  చేరుకుంది ఈ రోజున ఆసిఫాబాద్ డివిజన్ వ్యవసాయ అసిస్టెంట్ డైరెక్టర్ శ్రీనివాస్ రావు గారు ముక్య అతిధిగా పాల్గొని యువత యువకులు వ్యవసాయ పనిముట్లు కొనుగోలు వ్యవసాయ రంగంలో వివిధ ప్రబుత్వ రాయితీ ఎరువుల తయారీ సేంద్రియ అధిక దిగుబడిఫై ఆవగాహన కల్పించారు అనంతరం ప్రబుత్వ జూనియర్ కాలేజీ లెక్చరర్ గంగాధర్ పరిశ్రమలలో ఒత్పత్తి అయ్యే వస్తువులు మార్కెటింగ్ నిర్వహణ ఫై ఆవఘాహన కల్పించారు ఈ కార్యక్రమంలో కళాశాల అకాడమిక్ డైరెక్టర్ హరినాథ్ ప్రిన్సిపాల్అమిర్ ఉస్మని మరియు వేర్వేరు ప్రాంతాల నుండి వచ్చిన నిరుద్యోగ యువత యువతులు పాల్గొన్నారు

Saturday, 13 February 2016

నులి పురుగు ల నివారణకు కృషి చేయాలి

నులి పురుగు ల నివారణకు  కృషి చేయాలి 

రెబ్బెన మండలలంలోని ప్రతి ఒక్కరు నులి పురుగుల నివారణకు కృషి చేయాలనీ డాక్టార్  సరశ్వతి అన్నారు . ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ నూలిపురుగుల మాత్రలు వేయించడం వలన రక్తహీనత,సంపూర్ణ శారీరక, మానసిక అభివృద్ధికి దోహదపడుతుందని నులి పురుగుల ఓ పరాన్న జీవి. ఇది మనుషుల పేగుల్లో నుంచి పోషకాలను గ్రహిస్తాయి. ఇవి చిన్నారుల పాలిట అత్యంత ప్రమాదకరమైన ప్రాణులు. మొదట ఏలిక పాములుగా పుట్టి, నులి పురుగులుగా ఎదిగి, కొంకి పురుగులుగా మారుతాయి. ఇలా మూడు దశల్లో వ్యాప్తి చెందే  పురుగులు ఆరోగ్యాన్ని హరిస్తాయిన్నారు  ప్రతి పాటశాలలో అంగన్వాడి కేంద్రాలలో  తప్పని సరిగా  నులిపురుగు  మాత్రలను పిల్లలకు వేయాలని  1 సం,, నుంచి 3 సం,,  పిల్లలకు సగం మాత్ర  వేయాలని అదేవిధంగా  3 సం,, నుంచి 19 సం,, పిల్లలకి  ఒక్క మాత్ర వేయాలని అన్నారు  భోజనం చేసిన అరగంట  తరువాత మాత్రను సప్పరించాలని అన్నారు  ప్రత్యేకంగా  శిషణ  పొందిన కార్యకర్తలచే  మందులు వేయలని అన్నారు 12 తేదిన మరియు 15 తేదిన పిల్లలందరికీ  నులి పురుగుల మాత్రలు  కచితంగా  వేయాలని ఆమె అన్నారు  

Friday, 12 February 2016

గిరిజన యూనివర్సిటీ ని తరలిస్తే మరో ఉద్యమం

 గిరిజన యూనివర్సిటీ ని తరలిస్తే మరో ఉద్యమం 
                                                                                                           ఐఖ్య విద్యార్ధి సంఘం   


గిరిజన యునివర్సిటిని ఆదిలాబాద్ జిల్లాలోనే ఏర్పాటు చేయాలనీ ఐక్యవిద్యార్ధి సంఘాల నాయకులు ఎన్ ఎస్ యు ఐ జిల్లా ప్రధాన కార్యదర్శి దుర్గం భరద్వాజ్,టి వి వి జిల్లా అద్యక్షుడు కడతల సాయి, ఎ ఐ ఎస్ ఎఫ్ జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ దుర్గం రవీందర్ అన్నారు రెబ్బెన అర్ అండ్ బి భవనంలో బుధవారం విలేకరుల సమవేశంలో మాట్లాడుతూ తెలంగాణ ఉద్యమంలో ఆదిలాబాద్ జిల్లా విద్యార్ధులు అనేక ఉద్యమాలు  నిర్వహించారు కానీ ఈ రోజు ముఖ్యమంత్రి కె సి అర్ ఆదిలాబాద్  జిల్లా ను మరిచిపోయి కేవలం వరంగల్ జిల్లకె ప్రాధాన్యత ఇవ్వడం సరికాదు తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే  ఆదిలాబాద్ జిల్లా అభివృద్ధి చెందుతుందని విద్యార్ధుల భవిష్యత్  బాగుపడుతుందని విద్యారంగంలో ఆదిలాబాద్ జిల్లా అన్ని రకాలుగా వెనుకబడి ఉందని,అలాంటి జిల్లా నుండి యునివర్సిటిని వరంగల్ కు తరలించి జిల్లావిద్యార్థులకు అన్యాయం చేయకూడదని అన్నారు వరంగల్ కు యునివర్సిటిని  తరలించేఆలోచనను విరమించుకోవాలని లేని పక్షంలో విద్యార్ధి ఉద్యమాలను దశల వారిగా కొనసాగిస్తామన్నారు   అన్నారు

Tuesday, 9 February 2016

ఆయుర్వేద వైద్య శిభిరాన్ని సద్వినియోగం చేసుకోండి


ఆయుర్వేద వైద్య శిభిరాన్ని సద్వినియోగం చేసుకోండి

 రెబ్బెన: (వుదయం ప్రతినిధి)  ఆయుర్వేద మందుల ద్వారా ఆరోగ్యం త్వరగా నయమవుతుందని బెల్లంపల్లి ఏరియ డీవై జీఎం చిత్తరంజన్ కుమార్ అన్నారు. బెల్లంపల్లి ఏరియా సింగరేణి సేవా సమితి అధ్వర్యంలో ఈరోజు ఉదయం 10 గం,ల నుండి మధ్యాహ్నము 1 వరకు ఆయుర్వేద వైద్య శిభిరాన్ని నిర్వహించడం జరుగుతుందని అలాగే సాయంత్రం 3 గంటల నుండి 6 గంటల వరకు నిర్వహిస్తున్నారని ఈ వైద్య శిభిరంలో దీర్ఘ కాలిక వ్యాదులైన కీళ్ళు, మోకాళ్ళ నొప్పులు, బీపీ, షుగర్, పక్షవాతం, మలబద్దకము, అస్తమా, స్త్రీ ల వ్యాధుల గురించి పరిక్షించడం జరుగుతుందని ఈ అవకాశాన్ని అందరు సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు.

కుటీర పరిశ్రమల స్థాపన-అభివృద్ధి శిక్షణ

కుటీర పరిశ్రమల స్థాపన-అభివృద్ధి శిక్షణ  


రెబ్బెన: (వుదయం ప్రతినిధి) రెబ్బెన మండలంలోని స్థానిక రెబ్బెన ఆర్ట్స్ అండ్ సైన్స్ డిగ్రీ కళాశాలో నిర్వహిస్తున్న కుటీర పరిశ్రమల స్థాపన అభివృద్ధి  శిక్షణా నిర్వహణ జరుగుతుంది. సోమవారం రోజునుండి మొదలైన కార్యక్రమం మంగళవారం తో  రెండవ రోజుకు చేరుకుంది ఈ కార్యక్రమానికి ముఖ్య అదిథిగా విచ్చేసిన  ఆదిలాబాద్ జిల్లా ఇండస్ట్రీయల్ ప్రమోషనల్ ఆఫీసర్ అశోక్  మాట్లాడుతూ ప్రభుత్వం ఇచ్చే సబ్సిడీ ల గురించి నిరుద్యోగులకు అవఘాహన కల్గించారు. ఆ తర్వాత లఘు పరిశ్రమల అభివృద్ధి సంస్థ డిప్యూటి జె యన్ మిశ్రా ప్రసంగిస్తూ  పరిశ్రమల స్థాపించటానికి రూపొందించాల్సిన ప్రాజెక్ట్ రిపోర్ట్ పై అవఘాహన కల్గించారు. ఈ కార్యక్రమం లో కళాశాల అకాడమిక్ డైరెక్టర్ హరినాథ్,  ప్రిన్సిపాల్ అమీర్ ఉస్మని, రీక్యాప్ అండ్ ఇంపాక్ట్ కో ఆర్డినేటర్లు వెంకట్, శోబన్ బాబు,  యువతీ యువకులు పాల్గొన్నారు