Friday, 29 May 2015

తెలంగాణ మన వ్యవసాయంపై రైతులకు అవగాహన సదస్సు



(రెబ్బెన వుదయం  ప్రతినిధి, మే 29 ):  మండలంలోని రైతులు పంట మార్పిడి వల్ల అధిక లాభాలు పొందవచ్చని, సేంద్రీయ ఎరువులను ఎక్కువగా వాడి సరైన సమయంలో విత్తనాలు ఎవో మంజుల అన్నారు. రెబ్బన గ్రామ పంచాయతీలో శుక్రవారం మన తెలంగాణ మన వ్యవసాయంపై రైతులకు అవగాహన సదస్సు ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ..విత్తన శుద్ది చేసి విత్తుకోవాలని, పంటల మార్పిడి వల్ల దిగుబడులు పెరుగుతాయన్నారు. వ్యవసాయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై సూచనలు అందించారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్‌ వెంకటమ్మ, వైస్‌ ఎంపీపీ రేణుక, ఏఈఓ మార్క్‌, పశు వైద్యాధికారి సాగర్‌, సింగిల్‌ విండో డైరెక్టర్‌ మదనయ్య, పంచాయతి కార్యదర్శి రవీందర్‌, రైతులు పాల్గొన్నారు. 

రెబ్బెన : మండలంలోని నేతగాని కులస్తులు తహసీల్దార్‌ కార్యాలయంలో వారి యొక్క కులం పేరు కుల నివాసన పత్రాల లో కులం పేరు సరిగ్గా రాకుండా నేతా అని వస్తుందని డిప్యూటీ తహసీల్దార్‌ రాంమోహన్‌కు వినతి పత్రం అందజేశారు. సంఘం గౌరవ అధ్యక్షులు దుర్గం హనుమంతులు వినతిపత్రాన్ని అందజేశారు. ఈ కార్యక్రమంలో అధ్యక్షుడు మొండయ్య, ఉపాధ్యక్షుడు లింగయ్య, దుర్గం భరద్వాజ్‌, మున్యం రవి తదితరులు పాల్గొన్నారు. - See more at: 

No comments:

Post a Comment