Thursday, 21 May 2015

ప్రభుత్వపాఠశాలలో రేషనలైజేషన్‌ విరమించుకోవాలి



(రెబ్బెన వుదయం  ప్రతినిధి, మే 21): రెబ్బెన మండలంలోని తెలంగాణ విద్యార్థి వేదిక బుధవారం సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ సందర్బంగా టీవీవీ రాష్ట్ర అధ్యక్షుడు కడ్తల సాయి మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం పాఠశాలల రేషనలైజేషన్‌ పేరుతో పాఠశాలలను మూసివేసే చర్యలను మానుకోవాలని ఆయన డిమాండ్‌ చేశారు. రేషనలైజేషన్‌ వల్ల పాఠశాలలు మూతపడి విద్యార్థులు వీదిన పడే అవకాశముందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ఖాళీగా ఉన్న ఉపాధ్యాయ పోస్టులతో పాటు ఇతర పోస్టులను బర్తీ చేసి వచ్చే విద్యాసంవత్సరంలో విద్యార్థులు నష్టపోకుండా ప్రభుత్వం చర్యలు చేపట్టాలని ఆయనకోరారు. 

పట్టణంలో ఎండ తీవ్రత తట్టుకోలేక ప్రజలు, కార్యాలయాలకు వెళ్లాల్సిన ఉద్యోగులు తమతమ విధులకు హాజరుకావాలంటే భయపడుతూ హాజరవుతూ నరక యాతన పడుతున్నారు. దానికి తోడుగా మధ్యమధ్యలో కరెంటు కోతలు ఉండటంతో ఎండవేడిమి తట్టుకోలేక ఇంటివద్ద ఉన్న గృహిణీలు, చిన్నపిల్లలు ఉక్కపోతకు గురవుతున్నారు.

No comments:

Post a Comment